విజయానికి ఎన్ని మెట్లు?

వెలుగురేఖ కొసం తడుముకుంటున్నపుడు

తళుక్కున ఓ మెరుపు మెరిసింది.

వెలుతురు విరిగి విడిపోగానే

మరింత చీకటి అలముకుంది.



ఖాళీబూరను ఊదుతున్న కొద్దీ

ఉత్సాహం పెరుగుతూనే వచ్చింది.

ఒకానోక గీతదాటే సమయానికి

ఢమాలుమన శబ్దంతో పాటు

బుడగెటో ఎగిరిపోయింది.

ఉత్సాహంతో పాటు.



ఉగ్గబట్టి పరుగెత్తినపుడున్న

ఉప్పోంగి ఉరకలెత్తిన సత్తువ

లక్ష్యపు ఆదరి కొసచేసుకోగానే

ఉస్సురంటూ కూలబడింది.



మరింతగా కావాలంటే.

మరోకటి సిద్దంగా వుంచుకోవాలి.

ముందుకు వెళ్ళేందుకై.

ఊతమిచ్చే వెన్నుదన్నుని.



లక్ష్యం కనిపిస్తుంటేనే

ప్రేరణ పరుగెత్తిస్తుంది.

సంత్రుప్తిని తేన్చితే

నిర్టిప్తత ఆవరిస్తుంది.

నిర్లక్ష్యం పూనితే



ది

పూర్తిగా మరుగవుతుంది.

http://www.facebook.com/groups/kavisangamam/permalink/445484742170950
*15-09-2012

కామెంట్‌లు

  1. ☻◈☻◈☻◈☻◈☻◈☻◈☻◈☻◈☻◈ ░█░░░█░█░▄▀░█▀▀░░░░▀█▀░█░█░█░▄▀▀░ ░█░░░█░█▀░░░█▀░░▄▄░░█░░█▀█░█░░▀▄░ ░█▄▄░█░█░▀▄░█▄▄░░░░░█░░█░█░█░▄▄▀░ ◈☻◈☻◈☻◈☻◈☻◈☻◈☻◈

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి