నీవు దిక్కులు చూస్తుంటావు
జిడ్డులా పట్టేసిన ఓ గబ్బుసీరియల్ వైపో,
చర్మసౌందర్య ప్రకటనలవైపో
చర్మన్ని ఆరబోసిన సినిమాలవైపో
లేక
అంగట్లో దోరకని అందాలవేటకై
అంతర్జాలం వైపో..
అప్పుడే
నిజం గా నీవు గమనింపులో వుండవు కానీ
నీ వెనుక ఒక్కో పుస్తకం
ఆత్మహత్య చేసుకుంటూ వుంటుంది.
కాని బాగా అర్దం చేసుకోవాలంటే
ఎందరో కలిసి చేస్తున్న హత్య.
మళ్లీ మరోసారి అర్దం చేసుకోవాలంటే
పుస్తకానికి దూరంగా దూకి
ఎవరికి వారే చేసుకుంటున్న
సామూహిక ఆత్మహత్యలు
చివరిగా ఇంకోలా చెప్పాలంటే
సమాజపు సంస్క్రుతిని చంపుతున్న
ఉమ్మడి హత్యలు.
విరామం తర్వాత
కానివ్యు మళ్లీ నీ సీరియల్
మిస్సవుతుంది.
సినిమా మారిపోతుంది.
ఎవరో చాటింగుకు పిలుస్తున్నారు చూడు.
అలాగే దిక్కులు చూస్తూనే వుండు.
ఏదోనాడు దిక్కు తోచని తనం ఆవరించేంత వరకూ.
అలాగే దిక్కులు చూస్తూనే వుండు,
http://www.facebook.com/nivas.katta74/posts/458811160826162
జిడ్డులా పట్టేసిన ఓ గబ్బుసీరియల్ వైపో,
చర్మసౌందర్య ప్రకటనలవైపో
చర్మన్ని ఆరబోసిన సినిమాలవైపో
లేక
అంగట్లో దోరకని అందాలవేటకై
అంతర్జాలం వైపో..
అప్పుడే
నిజం గా నీవు గమనింపులో వుండవు కానీ
నీ వెనుక ఒక్కో పుస్తకం
ఆత్మహత్య చేసుకుంటూ వుంటుంది.
కాని బాగా అర్దం చేసుకోవాలంటే
ఎందరో కలిసి చేస్తున్న హత్య.
మళ్లీ మరోసారి అర్దం చేసుకోవాలంటే
పుస్తకానికి దూరంగా దూకి
ఎవరికి వారే చేసుకుంటున్న
సామూహిక ఆత్మహత్యలు
చివరిగా ఇంకోలా చెప్పాలంటే
సమాజపు సంస్క్రుతిని చంపుతున్న
ఉమ్మడి హత్యలు.
విరామం తర్వాత
కానివ్యు మళ్లీ నీ సీరియల్
మిస్సవుతుంది.
సినిమా మారిపోతుంది.
ఎవరో చాటింగుకు పిలుస్తున్నారు చూడు.
అలాగే దిక్కులు చూస్తూనే వుండు.
ఏదోనాడు దిక్కు తోచని తనం ఆవరించేంత వరకూ.
అలాగే దిక్కులు చూస్తూనే వుండు,
http://www.facebook.com/nivas.katta74/posts/458811160826162
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి