సౌందర్యాన్ని వెతుక్కుంటూ
పువ్వుని రేకల ఈకలు పీక్కుంటూ వెతుకుతున్నాడో
సౌందర్య పిశాచి,
ఆడతనం గొప్పతనాన్ని
కనిపించే చర్మపు వైశాల్యంతో
లెక్కలేసుకుంటున్నాడో కాసనోవా.
పదాలను విరగ్గొట్టుకుంటూ
పదేపదే వల్లించి
నిర్వచనం తయారుచెయ్యాలనుకుంటుంన్నాడో
నిర్బాగ్యుడు.
వెలుతురు రేఖలను
చీకటి గుహని నిర్మిస్తూపెంచాలనుకుంటున్నారు.
పెదవుల మాటలతో
హ్రుదయపు ప్రేమను కొలవాలనుకుంటున్నారు.
రత్నం ఎలావుంటుందో ఎరుగకనే
రాళ్లకుప్పను గాలిస్తున్నాడో
నిరర్దకాన్వేషి.
--* 07-09-2012
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి