పైపైన చూస్తే ఏముందిరా,
పుస్తకం అంతరాలలో ఒకసారి అన్వేషించి చూడు,
కాగితపు అందాన్నో, అచ్చులో స్సష్టతనో కాదు,
చెప్పిన వాడి ఖ్యాతినో, దానికున్న చరితనో కాదు,
అఖరికి
భాషద్వారా అందే బావం ఒక్కటే కాదు.
ఓ
లకుముకి పిట్లా
ఇంతపొడిచి ఇంకేం చూడాలిరా అంటావేమో ?
అదే వెతుకు
నీకక్కడ చాలా ఆశ్చర్యం దొరుకుతుంది.
ఆనందం మాత్రమే కాదు,
అదంటే ఏమిటో కూడా దొరుకుతుంది.
అవును, పుస్తకాలు చదవాలి, వీలైతే వాటిలో జీవించాలి.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచాలా బాగుంది శ్రీనివాస్ గారూ !
రిప్లయితొలగించండిఎంత ఎక్కువ చదివితే అంత విజ్ఞానం పెరుగుతుంది ..
@శ్రీ
గమనిక: ఇబ్బందిగా ఉండే word verification తీసేయండి సార్ ...
@శ్రీ గారూ ధన్యవాదాలు..
రిప్లయితొలగించండిఎక్కడి word verification గురించి చెపుతున్నారు.
ప్లీజ్ కొంచెం క్లియర్ గా చెప్పరా తీసేస్తాను.