అన్వేషణ



పైపైన చూస్తే ఏముందిరా,

పుస్తకం అంతరాలలో ఒకసారి అన్వేషించి చూడు,

కాగితపు అందాన్నో, అచ్చులో స్సష్టతనో కాదు,

చెప్పిన వాడి ఖ్యాతినో, దానికున్న చరితనో కాదు,

అఖరికి

భాషద్వారా అందే బావం ఒక్కటే కాదు.



లకుముకి పిట్లా

ఇంతపొడిచి ఇంకేం చూడాలిరా అంటావేమో ?

అదే వెతుకు

నీకక్కడ చాలా ఆశ్చర్యం దొరుకుతుంది.

ఆనందం మాత్రమే కాదు,

అదంటే ఏమిటో కూడా దొరుకుతుంది.

కామెంట్‌లు

  1. అవును, పుస్తకాలు చదవాలి, వీలైతే వాటిలో జీవించాలి.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది శ్రీనివాస్ గారూ !
    ఎంత ఎక్కువ చదివితే అంత విజ్ఞానం పెరుగుతుంది ..
    @శ్రీ
    గమనిక: ఇబ్బందిగా ఉండే word verification తీసేయండి సార్ ...

    రిప్లయితొలగించండి
  4. @శ్రీ గారూ ధన్యవాదాలు..
    ఎక్కడి word verification గురించి చెపుతున్నారు.
    ప్లీజ్ కొంచెం క్లియర్ గా చెప్పరా తీసేస్తాను.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి