అద్వైతం


కాలి చెప్పునో, చేతి బ్యాగునో

కుట్టించుకునేందుకు

అప్పగించినపుడు,

ఇలా అనిపించలేదు.

టీవినీ, మిక్సీని

రిపేరు చేయిస్తున్నపుడూ

అనిపించలేదు.



ఏ వస్తువుని

బాగుచేయించేప్పుడూ

మది బరువుగా కాలేదు.





కానీ ఎందుకో 
శరీరాన్నే రిపేరుకి ఇస్తూ,
పరిక్షలకోసం నిరీక్షిస్తున్నపుడు,
రకారకాల రసాయనాలను
లోనికి పంపింపజేస్తున్నపుడూ,
ఎందుకో
నా
లకుముకి పిట్టా
నాకు నేనే పరాయిగా అనిపిస్తాను,
అతీత తత్వమేదో
నిశ్శబ్దంగా పీల్చుకుంటుంటాను.
నా దేహంకాని నన్ను తాకుతుంటాను.


కామెంట్‌లు