కవిత్వాన్ని బతికించాలి

అంతరించిపోకుండా పదాలనెన్నో పదునెక్కించి వాడుకలోకి తేవటమేకాదు.
ఎప్పటినుండో పదునుని నిక్షిప్తంచేసుకున్న పొత్తాలను హత్తుకోవడమేకాదు.

లైకుకి కూడా ఓ పొడుగు కామెంటేసి, ఫేసుబుక్కు మరుపుపొరల్లోకీ ఇంకిపోకుండా
మళ్లీ మళ్లీ బయటికి లాగటం ద్వారాకూడా కవిత్వాన్ని కాపాడుతుండాలి.

నమస్కారానికి నమస్కారం సమస్కారమే కానీ
పేసుబుక్కుపోరాటంలో అదో మనస్కారం అయిపోయింది.

ఊపిరందక పడిపోయిన మనిషికి మళ్లీ మళ్ళీ ఆవిరులూది వత్తిడి చేసినట్లు
అడుగంటిన ఆశలను వదలకుండా కొట్టికొట్టి కొన్ని చుక్కలుగా బోరుబావినుండీ బయటికి తోడుకున్నట్లు.
జారిపోతున్న ఆశలాగా పడిపోతున్న కొన్నిలైన్లను కొట్టో కొట్టించుకునో బయటకులాగుతూనే వుండాలి.
ఎందుకంటే కవిత్వాన్ని బతికించాలి. కవితనాలను కూడా బతికించాలి.

కామెంట్‌లు