కాలయంత్రం




భాషనేమీ వాడకుండానే, భాషణం చేయకుండానే,

బావాన్ని ప్రసరింపజేస్తూ, భాధ్యతలను గుర్తింపజేసే,

తత్త్వవేత్త గడియారం నీకేమని చెబుతోంది ?




నడకనెప్పుడూ ఆపకుండానూ, నడతనెప్పుడూ తొణకకుండానూ,

గతాన్ని కొలతలేస్తూ, భవిత ప్రశ్నలకు బదులిస్తూ

కాలజ్ఞాని గడియారం నీకేమని చెబుతోంది ?




అలుపెరుగని ప్రయాణానికి అర్ధం వినిపిస్తూ,

కూలబడే జీవనాల వ్యర్ధతలను వివరిస్తూ,

నిరంతర ప్రయాణంలోనే గడియారం నీకేమని చెబుతోంది ?




తనవైపే అందరూ చూస్తున్నా, కాలనికే కొలమానమై నిలుచున్నా,

గమ్యం వైపు గమనాన్నేమాత్రం ఆపకుండానే,

నిత్యక్రుషీవలునిగా గడియారం నీతో ఏం చెబుతోంది?




కొన్నిమాటలు, కొన్ని అర్ధాలూ

చెవితో వింటేనే వంటికెక్కతాయనకూడదు.

మనసు గదిలో ప్రతిధ్వనించే లబ్ డబ్ లకు తోడుగా,

జుగల్ బందీ యుగళగీతం టిక్ టిక్ మనే వేళ,

కొన్నిపొరలను పరుచుకుంటూ,

కొన్ని తలుపులు తెరుచుకుంటూ,

వినాలనే తలంపుని తయారుచేస్తేచాలు.




తను చెప్పేదొక్కటనే కాదు.

నీక్కావలసిందేదో కూడా వినిపిస్తుంది.

నీవెక్కడికి నడవాలో సెలవిస్తుంది.

లోలోపలి తిమిరాన్ని తరిమేస్తుంది.

వెలుగుల బాటలో నడిపిస్తుంది.

http://www.facebook.com/groups/kavisangamam/permalink/454455971273827/

( ఆలోచనా విత్తనాన్ని నాటిన Sister Mercy కి ధన్యవాదాలతో )

కామెంట్‌లు