చిత్తుప్రతిని సిద్దం చేసుకో ముందు

నమ్మరా జీవితం చాలా విలువైందని
నమ్మకం దాన్ని నిజం చేసేందుకు సహకరిస్తుంది.

ఆవహింపజేసుకో ఉన్నతమైనదాన్నే ఎపుడైనా
అదే ఏదోరోజుకు నిజంగానే ఉన్నతిని నీతో మిగుల్చుతుంది.

బెసకని మాటలనే నోట పలికించేందుకు ప్రయత్నించు
ఆ ప్రయత్నమే ఓరోజుకు వ్యక్తిత్వానికో నిలకడనిస్తుంది.


చెరగని నవ్వుని పెదాలపై, మెరిసే పలకరింపును నేత్రాలపై
అద్దుతూ వుండు, అద్దకమే ఓ రోజుకు హత్తుకుపోతుంది.

తలపడే గడబిడల దారాలనైనా ఓ కట్టా! చిక్కులుతీస్తుండు
జీవితం సరళంగా నడిచిపోయే దారి నీకోసమే ఏర్పడుతుంది.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి