మరిగించిన అనుభవంలోంచి వచ్చే సువాసన ఎలా ఉంటుంది ??

చిక్కటి కాఫీ కమ్మదనం,
చక్కటి ముగ్ధ ప్రౌఢదనం,
పొదిగిన గుడ్డు జీవగుణం,
మిగిలిన మెలనిన్ కమ్మదనం,
ఎదురు చూపు తర్వాతి కలయిక,
ఆకలి కంటిన రుచి లా కొంచెం పాతగా
పలుచబడే, పలుచనచేసే కొత్తవురుకులేం కాకుండా,
మిడిసిపడే, ఎగసిపడే అలసే దుడుకు దనమేం లేకుండా,
ప్రవహించే కాలంలో పలుచగా వున్నా,
నిలదొక్కుకునేందుకు చిక్కబడాలంటే
అనుభవాలు ఆలోచనల వేడిలో మరగించబడాల్సిందేననే పాఠాన్ని ముక్కుపుటలకంటిస్తూ,
మరిగించిన అనుభవంలోంచి వచ్చే సువాసన
పాత పుస్తకంలోని నెమలీక స్పర్శలా,
తాత కురిపించే అనుభవాల ప్రేమలా,
ముందుతరాలు మిగిల్సిన ఎదుగుదల సారంలా
ఒక్కముక్కలో చెప్పాలంటే
ఆసరాను చూపే ఆదరువులా వుంటుంది.
అనుభవం పంచే నాన్న శ్వాసలా వుంటుంది.
కడుపునింపే అమ్మ ప్రేమలా వుంటుంది.
మరో ముక్కలో చెప్పాలంటే
భాద్యతెరిగిన నీ స్నేహంలా వుంటుంది.



( పేస్ బుక్ లో చెల్లి మెర్సీ  అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా.. )
https://www.facebook.com/bmercymargaret/posts/497720920280913

కామెంట్‌లు