అప్పదాసు వాచకం, బుచ్చిగారి నటనం ఉభయంగా మిధునం ఒక అధ్భుత:

మొత్తానికి మిధునం  సినిమా చూసొచ్చాను. శ్రీరమణగారు ప్వదస్తూరీతో రాసిన ‘‘ మిధునం ’’ కథా సంకలనం నుండి, తనికెళ్ల భరణి గారి చేతిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఆర్ట్ పిల్మ్ కదా జాగ్రత్త అని చెప్పుకుంటూనే వెళ్లాను కానీ నా భయాన్ని పటాపంచలు చేస్తూ అప్పుడే సినిమా అయిపోయిందా అనేంత శ్రద్దగా చూసి వచ్చాను. మంచి సినిమా ను మిత్రులు మిస్సవుతారేమోనని ఇలా పంచుకుంటున్నాను. ( హైదరాబాదులో కేవలం రెండు దియోటర్లేనా )

ప్రసిద్ధ మళయాళ దర్శకలు ఎమ్.టి.వాసుదేవ్ నాయర్ ఇప్పటికే దీనిని అక్కడ సినిమాగా మలచటం 2001లో అవార్డు రావటం కూడా జరిగింది. మళ్లీ ఇక్కడ అచ్చతెలుగు అద్దటంలో అద్భుతమైన కృషి కనిపించింది.
తెలుగు వంటలు, తెలుగు పంటలు, తెలుగు లోగిళ్ళు, తెలుగు ముచ్చట్లు ముఖ్యంగా తెలుగుదనం ఉట్టిపడే అమ్మానాన్నల ప్రేమలు...కేవలం కథలా చెప్పటానికేమీ కనిపించని విషయాన్ని ఒకదానివెంట ఒకటిగా దృశ్యంగా ముద్రలు వేశారు. లేగదూడ అంజిగాడు, పాడి ఆవు సావిత్రీతో పాటు చెట్లను కూడా బిడ్డల్లా పెంచుకుంటూ, .జీవనాన్ని జీవిస్తున్న అప్పదాసు( SPB), బుచ్చి(లక్ష్మి) ల వివిధ సందర్భాలలోని ఎమోషన్స్ చాలా దగ్గరగా అనిపిస్తాయి.
మధ్యలో వినిపించే రేడియో సంగీతం. పాతరోజుల్ని గుర్తుకు తెస్తుంటుంది. ముందే రేడియోలో 2012 అని చెప్పిన తర్వాత కూడా 90 ల నాటి ప్రోగ్రాముల సంగీతం ఎందుకు వినిపించిందనే లాజిక్కులవైపు పోకుంటేనే సుఖం.
అప్పదాసు తిండియావ ని పండించటంలో బాలు రూపం, వాచకం,బాగా సూటయ్యాయి. ఇక బుచ్చిపాత్రకు తను తప్పమరెవ్వర్నీ ఊహించేందుకు కూడా అవకాశమివ్వనంత బాగా వొదిగిపోయారు తను. ఒంటరి తనాన్ని దగ్గరకు రానివ్వకుండా నిండుగా బతుకుతున్నా ఆ దంపతుల లాగానే రెండంటే రెండే పాత్రలతో నడుస్తున్న సినిమాను చూస్తున్నామన్న స్ప్రుహ కూడా కలగకుండా కధనం నిండుగా పొంగింది.( మధ్యంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందంల గొంతులు మాత్రం కథలోకి వచ్చి వెళ్తాయంతే) 

జ్ఞాపకాలను తలచుకుంటూ వాస్తవంలో జీవించటాన్ని చూపిన చిత్రం. ఆటలో అరటిపండులా వచ్చే కోపం తాపం లాంటి ఎమోషన్లుకూడా భార్యాభర్తల అనుభందాన్ని మరింత దగ్గర చేసేవే కానీ దూరాన్ని పెంచుకునేవి కాదనే నిజాన్ని మరోసారి ఎత్తిచూపుతుంది.
జోన్నవిత్తుల గారి కాఫీ శతకం, అప్పడం తాతయ్య కోసం మనవడు చేసాడని చెప్పి చూపించిన కార్టూన్ మూవీ, సందర్భానికి అనుగుణంగా జీవించటం అంటే ఏమిటో చెప్పిన మాటలూ నడకకు మరింత అందాన్నిచ్చాయి. అప్పదాసు చెప్పిన వంట జాగ్రత్తలలోలా సరైన దినుసులు సరైన మోతాదులో సరిగ్గా పడటం లాగా.

భందాల మద్య వుండాల్సిన అటాచ్చడ్ డిటాచ్ మెంటును, భార్యాభర్తలలో ఒకరిపై ఒకరి కున్న అపార ప్రేమ, పైకి కనిపించే తల్లిప్రేమ, తొణకని తండ్రి ప్రేమ, చక్కగా చూపించారు.

సాహిత్యం నుంచి సినిమాలు వచ్చే ప్రయాణం మొదలవ్వాలని కోరుకుంటున్నాను. నిన్ననే అమెరికాలో రిలీజయి ఈ చిత్రం అక్కడ కూడా మంచి భావాలను అప్పదాసు ఆర్గానిక్ పంటలా పండించాలని కోరుకుంటున్నాను. ప్రేమాను రాగాలమీద నమ్మకం వున్నవాళ్లు తప్పకుండా చూడండని నేనైతే రికమెండ్ చేస్తాను. వాటీస్ దిస్ నాన్సెన్స్ అనుకునే వాళ్ళు ఎలాగూ ఈ లైను దాకా చదవరనే ధైర్యంతో..

http://www.facebook.com/photo.php?fbid=536151776409345&set=a.536151743076015.122602.100000435816359&type=1

కామెంట్‌లు