రుబాయి పక్రియ వివరణ మరి కొన్ని ఉదాహరణలు


రుబాయి (అరబ్బీ: رباعی) ఈపదానికి మూలం అరబ్బీ భాష పదం 'అరబా' అనగా నాలుగు, చతుర్ పంక్తులుగల. రుబాయి కి బహువచనం 'రుబాయియాత్' (అరబ్బీ:رباعیات). ఈ రుబాయీలు పర్షియన్ భాషలో అధికంగా ప్రసిద్ధిపొందాయి. మౌలానా రూమ్, షేఖ్ సాదీలు కూడా తమ రచనలలో రుబాయీలు రచించారు.

ఫార్సీ, ఉర్ధూ సాహిత్యాలలో ‘రుబాయి’ అనేది ప్రసిధ్ధి పోందిన ఛందోరూపం.

రుబాయీలకు ఉమర్ ఖయ్యాం (పర్షియన్), అంజద్ హైదరాబాది, మహమ్మద్ ఇక్బాల్, మీర్ అనీస్, దబీర్, మరియు లు ప్రసిధ్ధులు.

మహమ్మద్ ఇక్బాల్ రుబాయి

తెరే షీషే మేఁ మై బాఖీ నహీఁ హై
బతా క్యా తూ మేరా సాఖీ నహీఁ హై
సమందర్ సే మిలే ప్యాసే కొ షబ్ నమ్
బఖీలీ హై యె రజ్జాఖీ నహీఁ హై

అంజద్ హైదరాబాది రుబాయి


బందే హో అగర్ రబ్ కే తొ రబ్ సే మాంగోపానశాల, దువ్వూరి రామిరెడ్డి వ్రాసిన పద్య కావ్యము. పారసీక కవి ఆయిన ఉమర్ ఖయ్యాం (జననం:1048 - మరణం: 1123) రచించిన "రుబాయితు"లకు ఇది అనువాదం. 
హర్ చీజ్ ముసబ్బబ్ సబబ్ సే మాంగో
మిన్నత్ సే ఖుష్ ఆమద్ సే అదబ్ సే మాంగో
క్యోఁ గైర్ కే ఆగే హాథ్ ఫైలాతే హో
పానశాల అనువాద కావ్యమైనప్పటికి,స్వతంత్ర రచన లక్షణాలను కల్గివున్నది.ఖయ్యాము యొక్క రుబాయూతుల మూలభావాన్ని తీసుకొని రచనలో స్వ్తంత్రత వున్న కావ్యమిది.ఖయ్యాము రుబాయూలలో కథలేదు,మరియు విషయైక్యత ఉండదు.కవి కలానుగుణ్యముగా రాజాస్ధానమునందు,పండితుల గోస్ఠులందు,శిష్యులకు పాఠం చెప్పునప్పుడు ,ప్రకృతి రమణియతను ఆస్వాదీస్తు,ఇష్టమున్నప్పుడు ఆశువుగా చెప్పిన రుబాయూతులు ఇవి.అందుచే ఇందులో భిన్నవిషాయాలు వ్యక్తమవ్వుతాయి.వేమన పద్య సంపుటములవలె ఖయ్యాము రుబాయూతులు కూడా కలగూర గంప.

అంతములెని యీ భువనమంత పురాతన పాంధశాల , విశ్ర్రాంతి గ్రుహంబు ,అందు యిరు సంధ్యలు రంగుల వాకిలుల్
ధరాక్రాంతులు,పాదుషాలు, బహరామ్ జమిషీడులు వెనవేలుగా కొంతసుఖించి పొయిరెటకొ పెరవారికి చొటొసంగుచున్
తూర్పు పడమర లు వాకిలులుగా గల ఈఅనంత విశ్వం ఒక సత్రం లాంటి ది అందులొ రాజులు,పాదుషాలు కొంతకాలం సుఖంగాఉండి వచ్చె వారికి చొటిస్తూ ఎక్కడికొ వెల్లిపొయారని దీని బావం
జలజల మంజులార్బటులు జాల్కొను ఈసెలఏటికొవలన్
మొలచిన లేతపచ్చికల మొటుగ కాలిడ బొకు
దెవదూతల రుచిరాధర ప్రకృతి దాల్చెనొ సుందరమందగామి
ఎ లలిత శరిర మ్రుత్కాణాల జిగురించనొ ఎమొ కొమలి
జలపాతాలలో ఏగిసి పడే నీటి తుంపరలకి అంచున మెత్తగా పెరిగె గడ్డిని కాలితో తొక్కవద్దు. ఇది ఎ దేవదూతల పెదవుల ప్రక్రుతో లేక మెత్తనిశరీరం కల చనిపోయిన ఓ అందమైన అమ్మాయి శరిరం నుండి చిగురించినదో ఎవరికి తెలుసు
పరమొ గిరమ్మొ దానితలపై దొచెడు మన్నుచల్లి
సుందరి మెరుంగు కపొలముల దాచిన ముద్దులు దొంగిలించి
సంబరముగ శీధువానుము నమాజులు పూజలు చెయనేల
ఎవ్వరైనా వచ్చినారె మ్రుతివాటిక కేగిన పూర్వయాత్రికుల్
యిహము పరము అనేది లేదు ఉన్నంతకాలం బూమ్మీద సుఖపడం మాని ఖయ్యామ్ ఉద్దేశ్యమ్. చనిపోయినవారు ఎవరైనా తిరిగి వచ్చారా అని ప్రస్నిస్తున్నాడు

మరణయంబు నాకు అణుమాత్రము లేదు
మదీయ జీవ సంబరన భయంబె మిక్కుటము ప్రాణము దెవము వద్ద వడ్డి
బేహారముకు అప్పుగొం టి ఋణమంతయు ఇమ్మని తల్పు తట్టి న
సరసర హేమనిష్కముల సంచులు ముందర విప్పిపొసెదన్
తనకి చావు భయం కన్నా బ్రతుకు భయం ఎక్కువ అంటాడు. ప్రాణాన్ని దేవుని వద్ద తాకట్టు పెట్టి జీవితాన్ని అప్పుగా తెచ్చు కున్నానంటాడు అప్పు కోసం దేవుడు తలుపు తట్టినప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు తిసుకో అనొచ్చు అని దీని భావం
మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలిపొతి
పాతవై చినెగెను నెడున్ మరల చెప్పుల కొసము వచ్చినాడన్
నెమ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపగరాను
నీవు చచ్చినయెడ వీడిపొయెదవు చెప్పులవొలె నమాజుసైతమున్
పొయినసారి దొంగిలించిన చెప్పులు చినిగిపొయినవి మరలా చెప్పుల కొసం వచ్చాను కాని నమాజు కొసం కాదు చచ్చి పొయిన తరువాత చెప్పులాగె నమాజులు కుడా పొతాయి కదా అంటాడు ఖయామ్
గతము గతంబె యెన్నటికిన్ కన్నుల గట్టదు సంశయాంధ సంవృతముభవిష్యదర్డ్హము
ఒక్క వర్తమానమె సతత మవ స్యమగు సంపద విషాదపాత్రకి
ఈమతమున తావులేదు క్షణ మాత్రవహింపుము పానపాత్రికన్

గతము కానరాదు భవిష్యత్తు తెలియదు. ఒక్క వర్తమానం మాత్రం అనుభవించటానికి పనికి వచ్చె సంపద. విషాదా నికి తావు లేదు ఆనందంగా మధుపాత్ర తిసికొ మంటాడు ఖయ్యామ్

తారాశుక్తులు రాల్చినట్టి జిగిముత్యాలట్లు పూరేకులన్
జారెన్ సన్నని మంచుతుంపురులు వాసం తొదయశ్రీ కి
కాం తారత్నం అనువెన నెచ్చెలిగ ఉద్యానంబునం దొచె
మిత్రా రారమ్ము సుఖింపుము ఈఅదను వ్యర్ధంబై న రాదెన్నడున్

పూల రెకులనుం జారిపడె మంచు చినుకుల్ని ఆకాశంలొ నక్షత్రాలు రాల్చె ముత్యాలు గా వర్నిస్తాడు
మిత్రుడా వసంతఋతువులొ ఉద్యానం అనువుగాఉంది ఈ అదను పొతె మల్లి రాదు అని అంటున్నాడు ఖయ్యామ్

ఆదిమధ్యాంత రహితమై యలరచుండు
కాలయవనిక భేధింప గలమె మనము
ఇటకు ఎందుండి వచ్చె ఇకెటకు బొవు
ప్రాణియను ప్రశ్నకు ఎవ్వాండుబదులుచెప్పు
మొదలు చివర లెని ఈ కాలతెర ను కనుగొనలెము

ఇ క్కడికి ఎక్కడ నుండి వచ్చాము ఎక్కడికి వెలుతున్నము
ఈప్రశ్నకు బదులు ఎవరు చెప్థారు

అఖిల శాస్త్ర పురాణ తత్వాబుధు లీది
పరమ విజ్ఞాన దీపమౌ పండితుండు
కాలరాత్రిని మార్గంబు కానలెక
అల్ల మాములు కధ జెప్పి అంతరించు
సకల శాస్త్రలు సదివిన పండితుడు కుడా
పొయెటప్పుడు అందరు చెప్పె మాములు కధె చెబుతాడు


నిన్నటి రోజు కుమ్మరిని కనుకొం టి బజారువీధిలొ
మన్నొక ముద్దజెసి మడమం జెడంద్రొక్కుచు నుండ వానితొ అది
చిన్నగ మందలించె నది దీనత మెల్లగ సలంగ ద్రొక్కు మయన్నఎరుంగవే నన్నునొకప్పుడు నీవలె నందగాడినె
మట్టి ముద్ద ను తొక్కు తున్న కుమ్మరి తొ ఆముద్ద
అన్నా మెల్లిగా తొక్కు నెనుకుడా నికుమాదిరిగా ఒకప్పుడు అంగాడినె అని అంటుంది
ప్రతివాడు మట్టి లొ కలసి పొయెవాడె అని ఖయ్యామ్ అంటాడు


ఇల చదరంగం అదుజెనులెల్లరు పావులు లహస్సులున్ నిశల్
తెలుపు నలుపు గళ్ళ కదిలించును రాజును బంటును టక్కు పావుల
విధి ఆటగాడు పలుపొకల్న్ ద్రిప్పును గళ్ళూ మార్ఛు నవ్వల
నొకటొకటిన్ జదిపివైసు నగాధ సమాధి పెటికన్

ఈభుమి ఒక చదరంగము పగలు రాత్రి నలుపు తెలుపు గళ్ళు జనులందరు పావులు
ఆట గాడు విధాత చివరకు రాజులు బంటులు అందరూ సమాధి లొ కి వెల్లెవారె


విషము నమ్రు తంపు మసిబుడ్ల్ల విధి కలంబు ముంచి
లొకుల నుదుట లిఖించు మొదట
గరంగ దరుంబేద కన్నిటి కాల్వ నదియు
పరమ భక్తుని యనుతాప వహ్ని జెడదు
విషాన్ని అమ్రుతాన్ని కలిపి మానవుల నుదుట రాసెరాతలకు


మెమెం దుకు బలి కావాలి దెవుడా అని అడుగు తున్నాడు ఖయ్యామ్ ఇవి మొచ్చుకు కొన్నిమాత్రమె 125 రుబాయీలలొ 10% మాత్రమె

1928 మొదలు 1991 వరకు 10 ముద్రణలు వెలువడింది దీనిని బట్టి ఈపానశాల కు ఎంత ప్రజాదరణ ఉందొ తెలుస్తుంది పారశికము లొ ఖయ్యామ్ రుబాయీలు ఎలాఉంటాయొ తెలీయదుగాని దువ్వురి రామిరెడ్డి గారి పానశాల మాత్రం తెట తెలుగులొ హ్రుదయానికి హత్తు కునే విధంగా ఆనం దంగా హాల్హాదం గా మరచి పొలెని మధురానుభుతిని అందిస్తాయీ అన్నది అక్షరసత్యం.

డా . సామల సదాశివ గారు అనువాదం చేసిన రుబాయిలు
ప్రక్రియ-రుబాయి అంటూ 9వ తరగతి స్టేట్ సిలబస్ తెలుగు టెక్ట్ 9 వపాఠం 33వ పేజీలో ఈ క్రింది వివరణ ఇచ్చారు.సదాశివ గారి పంక్తులను పాఠ్యాంశంగానే ఇచ్చారు కానీ సంపూర్ణవాక్యం అనే నియమం అన్నిచోట్లా కనిపించటం లేదుమరి, అరసున్నాలను అంత అవసరమైనట్లు ఎందుకు వాడారోతెలియలేదు.

రుబ్ అంటే ‘రసం, సారం’ అని అర్ధాలు, రుబాయి అంటే రసవంతమైనది అని కూడా అర్ధం. రుబాయి మూలంగా 'నాలుగు పంక్తులు గల కవిత'. ప్రతిపాదం ఒక సంపూర్ణ వాక్యం. ఒకటి, రెండు, నాలుగు, పాదాలకు అంత్యప్రాస నియతి వుంటుంది. మూడోపాదంలో వుండదు. మూడో పాదం - ఒకటి,రెండు,పాదాలను అనుసంధానం చేస్తుంది. మొత్తంగా మూడుపాదాల్లోని అభిప్రాయాన్ని బలపరుస్తూ నాలుగో పాదం చరుపుతో మెరుస్తుంది. గజల్ రుబాయిల్లో అంత్యప్రాసకు పూర్వపదం కూడాప్రాసబద్ధంగా కనిపిస్తుంది. ఈ రెండింటిని ‘ రదీఫ్ కాఫియా’ అంటారు. రుబాయి ఒకే చంధస్సులో ఒకే విషయవిభాగంగా నడుస్తుంది.


నిన్ను నీవు గుర్తింప లేకున్న యెడల
ఇంతవరకు సాధించిన దంత వృధయె
పుడమి యంతయు నీకు లోబడిన నేమి
నిన్ను నీవు లోబరచు కోకున్న వృధయె


వెలితి వానికి ధనము లభించె నేని
బుద్భుదంబు విధాన నుప్పొంగుచుండు
అల్పవిషయాన గర్వింతు రధములెన్న
గాలిలో చిరు పరకయు దేలిపోవు

అందరకు ముదం బొనరింపు మదియె పర్వ
మంతయును మంచిదని యెంచు మదియె స్తవము
ఎల్ల జంతువులీశ్వర సృష్టి యగుట
దలచి వర్తింపు మదియె యద్వైత మనగ


ఫలము వలతేని విత్తన మలికి చూడు
పడయ దలచిన సర్వంబు విడిచి చూడు
మొక్కసారి స్వార్ధము వీడి యెరుల వాడ
వై సమములేని యానంద మంది చూడు

కణము కణమున సంద్రంబు కడలుకొనును
అణువు నణువున మణిదీప్తు లలముకొనును
దృష్టిగలిగిన మంచి దర్శింపవచ్చు
అదియెలేకున్న రత్నము నశ్మసమము.

మబ్బు విడిపోవంగా జందమామ వెడలె
శుక్తి పగులగ వెడలెను మౌక్తికంబు
దాచి పెట్టువా డవనిలో దాగు కొనియె
దాచబడిన ధనంబదీతలకు వెడలె


............................................................................
రుబాయిలకు సామాజిక కోణాన్ని అద్దుతూ ఎండ్లూరి సుధాకర్ గారు రాసిన రుబాయిలు

2009 


తెలుగు రుబాయీలు 

-ఎండ్లూరి సుధాకర్ 

వాకపల్లి ఘోరానికి సిగ్గే లేదు

దుర్మార్గుల నేరానికి ఎగ్గే లేదు

జాతికింత అవమానం జరుగుతు వున్నా

జనం లో రగులుతున్న అగ్గే లేదు .



ఆడవాళ్ళ చట్టాలను కాపాడాలి

ఇరుగు పొరుగు వారికొరకు పోరాడాలి

దెబ్బతినే దేశమాత దేహం చూసి

దేవుడైన ఆమె వైపు నిలబడాలి .



భయం వేస్తున్నదమ్మా భైంసా

మధ్య యుగాల నాటి మత హింస

గుండె బాదుకుంటూ అరుస్తోంది

గూడు కాలిన నల్లహంస.




రాతి దేవుళ్ళకు నమస్కరిస్తాడు

బాబాలను బహుగా సత్కరిస్తాడు

యాచకులెవరైనా 'అయ్యా' అంటే

ఛీ పొమ్మని ఆ భక్తుడు ఛీత్కరిస్తాడు.


కాపీ కొట్టిందని ఎగబడి పట్టుకున్నారు

కళాశాల పరువు తీసిందని కసిగా తిట్టుకున్నారు

ఈ కార్పొరేట్ కంసులంతా కలిసి

బంగారం లాంటి బాలికను పొట్టన పెట్టుకున్నారు .



ఆమె మొదట్లో ఒక పువ్వనుకున్నాను

ఏమీ తెలియని గూటి గువ్వనుకున్నాను

మైకు ముందు నిలబడ్డాకే తెలిసింది

ఆమె నిజంగా ఒక నిప్పు రవ్వనుకున్నాను.




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి