ఈ భాష మాట్లాడ గలిగిన 8 కోట్ల ప్రజలతో, అభివృద్ధి చెందుతూన్న వినోద పరిశ్రమలతో భారత ఉపఖండం లో తెలుగు మరొక మహత్తరమైన భాష.గా రూపొందింది . ఈ వ్యాసం ఈ భాష యొక్క మూలాన్ని ,చరిత్రను పరిశీలిస్తుంది.
తెలుగు ఒక భారతీయభాషగా గుర్తింపు పొందింది. మరియు, భారతదేశంలో హైటెక్ రాజధాని హైదరాబాద్ కు పుట్టిల్లైన ఆంధ్ర ప్రదేశ్ కు అధికారిక భాష. అనేక ఇతర ద్రవిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాణ్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, మొదటి శకం బి.సి లో శాతవాహన రాజులు సృష్టించిన "గధాశప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ ,గోదావరి మధ్య భూభాగంలో నివాసం ఉండే పెద్ద వారయి ఉంటారని నిర్ణయించ వచ్చు.
తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి. కి చెందినది. 11 వ శతాబ్దం ఎ.డి. ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యం. విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి కృష్ణదేవరాయల ఆదరణలో 16 వ శతాబ్దం ఎ.డి. ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.
శ్రీనాథుని "శృంగార నైషధం," పోతన "దశమస్కంధం", జక్కన "విక్రమార్క చరిత్ర", తాళ్ళపాక తిమ్మక్క "సుభద్రా కల్యాణం", మొదలైనవి మహారాజు కృష్ణదేవరాయల స్వర్ణయుగం కంటె ముందుగానే ఉన్నకొన్ని గొప్ప సాహిత్యాలు. స్వతహాగా కవియైన మహారాజు తన "ఆముక్తమాల్యద" తో "ప్రబంధం" అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.
కర్నాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, మరియు క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.
అశోకుడి చారిత్రక శకానికి చెందిన బ్రాహ్మి లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించినట్టుగా నమ్ముతున్నారు. తెలుగు యొక్క తూర్పు చాళుక్యుల లిపిని వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలనే కనిపిస్తుంది.
తెలుగు లిపిలో చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్ఛరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" ( వొవెల్స్ లేదా స్వర్ ) మరియు "హల్లులు" ( కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్ ) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ , చదవడానికీ, అచ్చు "అ" ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరాబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి.
ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు కలవు.
తెలుగును సాధారణంగా ఒకదానితో ఒకటి కలిసి చేరి పోయే భాషగా గుర్తిస్తారు, ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.
తెలుగును ఒక ద్రవిడ భాషగా గుర్తించడానికున్న ఎన్నో మార్గాలలో ఇదొక్కటి. తెలుగుకు "విభక్తి" సంప్రదాయం కూడా ఉంది. తెలుగులో ప్రతి పదమూ ఒక అచ్చుతోనే ముగింపు పొందడంతో, 19వ శతాబ్దపు యాత్రీకులు సాధారణంగా దీనిని "ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్" ( తూర్పు దేశపు ఇటాలియన్ భాష ) గా పరిగణించేవారు.
1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లో సాధ్యమయ్యింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.
మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్నకందుకూరి వీరేశలింగంగారి "రాజశేఖరచరిత్రము" తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావుగారు. గిడుగు రామ్మూర్తి వారి "ముత్యాల సరాలు", కట్టమంచి రామలింగారెడ్డిగారి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకులు) "ముసలమ్మ మరణం", రాయప్రోలు సుబ్బారావుగారి "త్రుణకంటకం" మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యవహారిక భాషను వాడడం "వ్యావహారిక భాషా వాదా"నికి దారితీసింది.
ఈనాడు హైదరాబాద్ కు ఇన్ ఫర్మేషన్ టెక్నాలజి తో ఉన్న సామీప్యం, తెలుగు భాషాభిమానుల మేళవించిన కృషి, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజి విభాగంలోనూ, కంప్యూటింగ్ విభాగంలోనూ, తెలుగు గణించదగ్గ అభివృద్ధి పొందగలదని నిశ్చయంగా తెలుపుతూంది. ఈ మృదుమధురమైన భాష శతాబ్దాలుగా ఉన్న తన చరిత్ర వలెనే మున్ముందు తప్పకుండా వర్ధిల్లగలదని కాలము, కృషి నిశ్చయంగా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి