మాటలే మాటలు

కోపంలో మాటలు మునిగిపోతుంటే
గుణం తడిసి పూర్తిగా కరిగిపోతుంది.

తుఫానుగా వాక్యాలు హోరెత్తితే
ప్రశాంతత దూరంగా పరిగెడుతుంది

అవసరం లేని పదాలు అతిగా ప్రవహిస్తే
అర్ధం పూర్తిగా అడ్డదారిలో కొట్టుకుపోతుంది.

అహంకారం సంభాషణలో ఉరిమిందంటే
ప్రేమ సరిహద్దులావలకు పారిపోతుంది.

అబద్దం వ్యక్తీకరణలో నిండిదంటే
ఖ్యాతి అలవోకగా తేలిపోతుంది

ఆలోచించి అంటుండరా ఓ కట్టా
ప్రత్యేకత నీతోనే అంటిపెట్టుకుంటుంది.

► 21-04-2013

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి