హిందువులు మృదు స్వభావులు; చెట్టూ-చేమా, పక్షీ, పశువులతో సహజీవనం చేస్తూ అవీ పచ్చగా, హాయిగా బతికేందుకు శ్రద్ధాసక్తులు చూపడంలో ఇతరులకు ఆదర్శప్రాయులు- ఇది ఒక అమెరికన్ రచయిత (కాల్పనిక) భావన. జంతువులకు సంక్షేమం, సంరక్షణ కల్పించడంలో హిందూ ధర్మం విశిష్టతపై ఆయన పరిశోధన చేస్తున్నారు. ఇటీవల ఆ విద్వాంసుడు నాకు ఫోన్‌చేసి తన భావన గురించి చెప్పారు. అది నిండు నిజం కాదా అని అడిగారు. 'నిరర్థక ఆలోచన' అనికొట్టిపారేశాను. ఆయనకు కోపమొచ్చింది.
నా అభిప్రాయాన్ని ఇలా వివరించాను: 'మాంసాన్ని పెద్దఎత్తున ఎగుమతిచేసే ఆసియా దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది; మేము పండించే ఆహార ధాన్యాలలో 36శాతం మా ఆహారానికిగాక, ఐరోపాలో మాంసం కోసం పెంచే జం తువులకు ఆహారమవుతున్నాయి; మా కబేళాలలో రోజూ 41,000 ఆవులు హతమవుతాయి... నిజానికి జంతువులతో హిందూ ధర్మానికి ఉన్న ఏకైక సంబంధం వాటిని యజ్ఞ పశువులుగానో లేదా బలి ఇవ్వడానికో చంపివేయడమే'. ఆ అమెరికన్ ఒక క్షణం మౌనం వహించి ఇలా అన్నారు: 'భారత్‌లో ఇంకా జైనులు, బౌద్ధులు ఉన్నారు.
మరి వారు మాంసాహారాన్ని తినరు కదా'. ఇందుకు నేనిలా స్పందించాను: 'మా దేశంలోని అతిపెద్ద జంతు వధశాలకు అధిపతి ఒక జైన్ మతస్థుడు. వనస్పతి వంటనూనెను ఎద్దుమాంసం కొవ్వుతో కల్తీ చేస్తున్నది ఒక జైనుడు; మాంసాహారం భుజించడాన్ని ప్రగతిశీల జీవనశైలిలో భాగమని యువ జైనులు భావిస్తున్నారు; లడాఖ్‌లోని బౌద్ధులు మాంసభుక్కులు'. ఆ హిందూధర్మ అభిమాని తన తుది వాద ననిలా చేశారు: 'క్రైస్తవంలో వలే, పుస్తకాలు, మతం మాంసాన్ని తినమని మీకు చెప్పవు కదా'. ఏమి చెప్పాలో నాకు తెలియలేదు. ఎందుకంటే క్రైస్తవ మతబోధనల గురించి నాకు తెలియదు.
అంతేకాక కైస్తవులు మాంసాహారులనే విషయాన్ని ఒక ప్రాకృతిక సత్యంగా మనం భావించడం పరిపాటి. అందుకే నేను పుస్తకాలనాశ్రయించాను. క్రైస్త వం, శాకాహారవాదం గురించి తెలుసుకున్న విషయాలను వివరిస్తాను. శాకాహారిగా ఉండడమే జీసస్ బోధనల స్ఫూర్తికి అనుగుణ్యమైన నైతిక నియమమని పలువురు క్రైస్తవపండితులు భావించారు. ఇబియోనిటెస్, అథనాసియస్, అరియస్‌లే ఇందుకు నిదర్శనం. తొలినాళ్ళలో చర్చికి నేతృత్వం వహించిన (అలెగ్జాండ్రియాకి చెందిన) క్లెమెంట్, అరిగెన్, టెర్టూలియన్, హెరోనిమస్, బోనిఫేస్, సెయింట్ జెరోమ్, జాన్ క్రిసోస్టోమ్‌లను పేర్కొని తీరాలి. క్లెమెంట్ ఇలా రాశారు: 'జంతువులకు మన శరీరాలు శ్మశానంకావడం కంటే క్షుద్బాధతో కృశించిపోవడమే చాలామంచిది.
ఆ ప్రకారమే ధర్మదూత మేథ్యూ మాంసాహారం జోలికి వెళ్ళకుండా పూర్తిగా కాయలు, పండ్లు, దుంపలు మాత్రమే తినేవారు. తొలినాటి క్రైస్తవ మత పత్రాలలో ఒకటైన 'క్లెమెంటైన్ ధర్మోపదేశాలు' (క్రీ.శ. రెండవ శతాబ్దికి చెందిన ఈ గ్రంధం సెయింట్ పీటర్ బోధనల ఆధారంగా విరచితమైనదని భావిస్తారు)లో పన్నెండవ ఉపదేశం ఇలా పేర్కొంది: 'విగ్రహారాధకుల దెయ్యాలపూజ ఎంత కల్మషమైందో, మాంసం తినడమనే అసహజ ఆహారపు అలవాటు అంతే కల్మష పూరితమైనది. మాంసాహార విందులో పాల్గొనడంద్వారా ఒక మనిషి దెయ్యాలకు సహ భోక్త అవుతున్నాడు'.
పాత, కొత్త నిబంధనలు చదివిన వారికి ఈ వాక్యం గుర్తుండే ఉంటుంది: 'నాకు కరుణేగాని, బలి అవసరం లేదు' (మేథ్యూ). దేవతలకు జంతువులను బలిఇవ్వడం అనివార్యంగా మాంసాహారాన్ని భుజించడానికి దారితీసే పరిస్థితుల నేపథ్యంలో మేథ్యూ సందేశానికి చాలా విశిష్టమైనదే. లెవిటికస్ సందేశం (17) చదివితే ఇది మరింత స్పష్టమవుతుంది. మాంసాహారాన్ని తీసుకోవడం జంతుబలులను అనివార్యంచేస్తుందని ఆ ఉపదేశం పేర్కొంది. ఆలయంలో జీసస్, వడ్డీ వ్యాపారస్తుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కథ గురించి మనకందరికీ తెలుసు. ఆ స్వార్థపరులు ఆలయాన్ని అపవిత్రంచేయడం పట్ల ఆయన అసంతృప్తి చెందుతారు.
అంతేగాక, కొందరు దున్నపోతులు, మేకలు, పావురాలను విక్రయించడం పట్లగూడ జీసస్ అసంతృప్తి చెందుతారు(జాన్). ఆ జంతువులను ఆహారంగా ఉపయోగించుకోవడానికి ముందు బలివ్వడానికై వాటిని విక్రయిస్తారు. జంతువుల పట్ల ఇలా క్రూరంగా వ్యవహరించడం జీసస్‌ను ఆవేదనకు గురిచేస్తుంది. జీసస్, మాంసాన్ని కొనడం లేదా తినడం గురించి బైబిల్‌లో ప్రస్తావన ఉన్నదా? లేదు. ఒక గీతంలో 'జీసస్ శిష్యులు మాంసం కొనడానికి నగరానికి వెళ్ళారన్న' (జాన్ 4:8) ప్రస్తావన ఉంది. కింగ్ జేమ్స్ బైబిల్ అనువాద కర్తలు గ్రీక్ మూల పాఠంలోని ఈ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు.
'మీట్'(మాంసం) అనే ఆంగ్ల పదానికి గ్రీకు మూలంలోని పదానికి నిజమైన అర్థం పోషకాహారం. సవరించిన ప్రామాణిక అనువాదంలో ఈ తప్పును సరిదిద్దారు. ప్రస్తుత ప్రామాణిక అనువాదంలో ఆ వాక్యం ఇలా ఉన్నది: 'జీసస్ శిష్యులు ఆహారానికి కొనుక్కోవడానికై నగరంలోకి వెళ్ళారు' 'కొత్త నిబంధన' (న్యూ టెస్ట్‌మెంట్)లో జీసస్ మాం సాహారాన్ని తింటున్నట్టు ఎక్కడా వర్ణించలేదని లెవిస్ రిగెన్‌స్టెయిన్ అనే పండితుడు పేర్కొన్నారు.
బైబిల్ గ్రీకు మూలంలోని "trophe', "brome' తదితర పదాలను మీట్ అనే పదంగా అనువదించారు. అయితే ఆ పదాలకు అసలు అర్థం 'ఆహారం', 'తినడం'. ఉదాహరణకు లూక్ సువార్తలో 'చనిపోయిన ఒక మహిళను జీసస్ పునరుజ్జీవింప చేసి, ఆమెకు మాంసం ఇవ్వమని ఆదేశించారని' ఉంది. ఇక్కడ 'మాం సం'(ఝ్ఛ్చ్ట)గా అనువదితమైన మూల పదం 'ఞజ్చిజౌ'కు అర్థం 'తినడం'. జీసస్ చెప్పింది 'ఆమెను తిననివ్వండి' అని. ఆంగ్ల 'మీట్'కు గ్రీకు మూలం 'జుట్ఛ్చట'. కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడా జీసస్‌కు సంబంధించి ఆ పదాన్ని ఉపయోగించలేదు.
జీసస్, కనీసం చేపలనైనా తిని ఉంటారా? సుప్రసిద్ధ 'రొట్టెముక్క లు, చేపలు' కథ గుర్తుందా? జీసస్, ఆయన మరణం అనంతరం, పునరుత్థానం తరువాత చేపలు తిన్నట్టుగా ప్రస్తావనలున్నాయి. తొలినాటి క్రైస్తవులలో చేప ఒక మార్మిక ప్రతీకగా ప్రఖ్యాతమయింది. ఫిష్ (చేప) అనే ఆంగ్ల పదానికి గ్రీకు మూల పదం జీఛిజ్టిజిడట. ఈ పదం ఒక (ఆద్యక్షర) సంక్షిప్త పదం; దీనికి 'జీసస్ క్రీస్తు, భగవంతుని కుమారుడు, రక్షకుడు' అని అర్థం. తొలి క్రైస్తవులు ఈ పదాన్నెలా వినియోగించారో పరిశీలిస్తే, సువార్తలలోని సమస్త 'చేప కథలను' ఉన్నదున్నట్లుగా కాక ప్రతీకాత్మకంగా అర్థం చేసుకోవాలన్న వాదనకు చారిత్రక రుజువుగా విశదమవుతుంది.
జీసస్ శాకాహారి అనడానికి పరోక్ష చారిత్రక రుజువు ఏమిటి? ఎస్సెనెస్‌లు, నజొరేయన్‌లు ఇబియోనిటెస్‌ల జీవన విధానాల గురించిన అవగాహన జీసస్ బహుశా శాకాహారి అయి వుంటాడని స్పష్టంచేస్తుంది. ఎస్సెనెస్‌లు ఒక ప్రాచీన యూదు తెగకు చెందిన వారు. ఆస్తిపాస్తుల ఆర్జనకు తొలి క్రైస్తవుల వలే వీరూ పెద్దగా ప్రాధాన్యమిచ్చేవారుకాదు. వీరిలో సామాజిక సంఘీభావం బాగా ఉం డేది. జంతు బలులను పూర్తిగా తిరస్కరించారు. తొలి క్రైస్తవులు నజోరియన్‌లుగా ప్రసిద్ధులు. ఇబియోనిటెస్‌ల వీరికి వారసులు. ఈ మూడు సామాజిక బృందాలూ శాకాహారులే. దీనిని బట్టి తొలి క్రైస్తవ సమాజాలలో శాకాహార ఆహారపు అలవాట్ల ప్రాధాన్యమేమిటో స్పష్టమవుతుంది.
సెయింట్ పీటర్ కూడా శాకాహారి అని క్లెమెంటైన్ 'ధర్మోపదేశాలు' పేర్కొన్నాయి. జీసస్ మరణాంతరం, జెరూసలేంలోని చర్చి మొదటి అధిపతి అయిన జేమ్స్ ది జస్ట్ (జీసస్ సోదరుడు) శాకాహారి అని, శాకాహారిగానే అతన్ని పెంచారని క్రైస్తవ మత పుణ్య పురుషులైన హెగిసప్పస్, ఆగస్టీన్‌లు చెప్పారు. జీసస్ తల్లితండ్రులు తమ చిన్న కుమారుడిని శాకాహారిగా పెంచడాన్ని బట్టి జీసస్‌ను సైతం అలానే పెంచి వుంటారని చెప్పవచ్చు.
ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలతోమేనకా గాంధీ మరిన్ని వ్యాసాలు ఆంధ్రజ్యోతి లంకె
ఇంకో కిరస్తానీ కవి.
రిప్లయితొలగించండి