నేనోక వేటగాడినై నిరంతరం నన్నునేనే తరుముకుంటూ వెంటాడుతుంటాను.
కొండలూ గుట్టలూ దాటేసి, కొమ్మలూ లోయలూ దూకేసి,
కావలసిందేదో అర్ధం కాక నిరాశతోనే వెనుదిరుగుతుంటాను.
నేనోక తటాకమై, ప్రవాహాలనెన్నో నింపుకుంటాను.
ఆర్తిగా లోపలికి వొంపుకుంటాను.
దాహం తీరని గొంతుతో ఎవరినో పిలుస్తూనే వుంటాను.
నేనసలు నేను కాననే నిజం తెలియకుండా,
నిండు దుప్పటి కప్పుకుంటాను.
నాదైనది నేను కానపుడూ,
అన్నీ నావనే అబద్దాన్ని తలపై మోస్తుంటాను.
నాకోసం చెప్పుకునే మాటల్ని,
మీకోసం రాసాననుకుని,
నా బుజాలపైనే ధరిస్తాను.
మీ అర్ధాల కోసం పలవరిస్తాను.
శాఖాల గుండా దూకుతూ
ప్రశాంతతను కోరుకుంటాను.
నీడల వెంట పరుగెడుతూ,
వెలుతురుకై ఆశిస్తాను.
అదేనేమో నేను,
నాలా నాతో లేని నవ్యూనూ.
► 05-04-2013
baavundi
రిప్లయితొలగించండి