► .G.O.D.I.S.N.O.W.H.E.R.E. ◄

తననే నిర్మించిన వాడిని తాను నిర్మించాడో,
తనను నిర్మించిన వాడని తలపోస్తూ స్మరిస్తుంటాడో,
తలనూ, తననూ పుట్టించిన వాడో,
తలలో మొలకై తనువై వెలుగొందేవాడో,
ఎవడో వాడెవడో ఊహలకైనా చిక్కడు,
చూపులకసలే దక్కడు,
చూపించే కళ్లను మనమేనాటీకీ చూడనేలేనట్లు,
దహించే ఆకలి రూపాన్ని అర్ధం చేసుకోలేనట్లు అందీఅందకుండా వుంటాడో.
అసలే లేని తనాన్ని నీకేం చూపాలంటాడో.

* 05-04-2013

కామెంట్‌లు