కొకిల మొన్న వసంతానికి ఓసారోచ్చి కూసిపోయింది.
చింత చిగురు నిన్నటి వరకూ పలకరిస్తూనే వుంది.
పండుగలలా ఓసారి మొరిసి
గుండెను ఒక్కరోజన్నా తట్టమంటున్నాయి.
గూగుల్ ఇమేజెస్ ని గాలించాను
అమ్మ కాన్సెప్ట్ మీద అందమైన పోటోలకోసం
యూట్యూబ్ లో హైరేటింగ్ విడియోలు వెతికాను.
మనసుకు హత్తుకునే దృశ్యాలున్నాయేమో నని,
క్లౌడ్ స్లోరేజిని కుదిపి చూసాను, హర్డ్డ్ డిస్కంతా వెతుకులాడాను.
కొంచెం కదిలించే ఓ మంచి విషయం దొరకాలని,
మిత్రుల అప్డేట్స్ అన్నీ చూస్తున్నాను,
కొన్ని కనెక్టవుతున్నట్లున్నాయి.
చివరికి హర్ట్ డిస్క్ సరిచేసుకుని,
ముందు రెండు లెన్సులు తెరుచుకుంటే
కనిపించింది.
ఏమీ కోరుకోకుండానే అన్నీ యిచ్చిన తనం
అన్నీతానై ఇంకా నావెనకే నిలుచున్న తను
మీతో పంచుకునేందుకు
అక్షరాలుగా ఏమీ మిగల్లేదు.
ఇది నా కళ్ళలోని తడి అంతే.
► 12-05-2013
అమ్మ ప్రేమని ఎక్కడ శోధించినా చివరికి అది ప్రతిఒక్కరిలోనూ దాగి ఉంటుంది.
రిప్లయితొలగించండిమాతృ దినోత్సవ శుభాకాంక్షలు!