గజల్ గురించి ఓ గజల్ - వర్చస్వీ

కంద పద్యాన్ని ఎలా రాయాలో 'కంద' పద్యంలోనే చెప్పారు వ్యాకరణ వేత్తలు! ఎందుకో కొత్త పిచ్చోడిలా గజల్ నెలా రాయాలో 'గజల్' లోనే చెబ్దామనిపించింది. అంతకుముందు ఎవరైనా రాశారేమో నాకు తెలియదు. గజల్ 'స్వరూపాన్ని' ఒకసారి చాట్ లోJyothirmayi Malla గారు నాకు తెలియజేయడం జరిగింది. అలా గజల్ 'స్వరూపాన్ని' తెలుసుకోనగాలిగానేమో గానీ 'స్వభావం' అధ్యయనం చేయలేదు. ఏమైనా గజల్ స్వరూపాన్ని 'గజల్' లోనే ఇక్కడ ఆవిష్కరించే ప్రయత్నం చేశాను నా మిడిమిడి జ్ఞానంతో! అవధరించండి.

.......................
:గజల్:
.......................

రెండు పాదాలు కలుపుకుంటే ఒక ‘శేరు’గా రావాలి
గజల్లో మొదటి షేరు పేరైన ‘మత్లా’గా రావాలి

మత్లా లో ప్రతిపాదానికి అంత్యపదమే ‘రదీఫ్’
అర్ధమున్న ఏకాక్షరమో, పదమో రదీఫులుగా రావాలి.

మిగతా శేరుల్లో మొదటి పాదమెలాగున్నా
రెండో పాదాంతం ఖచ్చితంగ రదీఫుగా రావాలి.

నాలుగు మించి శేరులెన్నొ గజల్లో జోడించు
ఆఖరి శేరు మటుకు మనం పిలుచుకునే ‘మఖ్తా’గా రావాలి.

మఖ్తా మొదటి పాదం చివరి పదం చూడు చిత్రంగా
ఏమేమో కాదది నీ నామమె - అది ‘తకల్లుఫ్’గా రావాలి.

ఇక గజల్లో సౌందర్యం చెప్పవేమి వర్చస్వీ
ప్రతి రదీఫు ముందు అక్షరమో పదమో ‘కాఫియా’గా రావాలి.



https://www.facebook.com/varchaswi.laxman/posts/10201579398512535


తెలుగులో గజల్ సాహిత్యం పై మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి