నిజానికి ప్రపంచంలో ఉన్న అన్ని శబ్దాలనూ సూచించగల లిపి అంటూ ఏదీ లేదు. దానిని నిర్మించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకవేళ అటువంటి ప్రయత్నం భవిష్యత్తులో మొదలైతే, తెలుగు లిపి ముందుకు ఉంచవచ్చు, తగిన మార్పులు తీసుకువచ్చిన పక్షంలో...! తెలుగు, సంస్కృతం రెండింటికీ వాడవలసిన, వాడదగిన తెలుగు లిపిని, వివిధ అక్షరాలను వదిలిపెట్టేయడంవలన, తెలుగు లిపిని తెలుగుకే పరిమితం చేయడం అవుతుంది. తద్వారా, వందల సంవత్సరాలుగా, తెలుగు నాట సంస్కృతాన్ని తెలుగు లిపిలో రాస్తూ వస్తున్న సంప్రదాయాలని ఆపుచేసినట్లవుతుంది. ఇది అస్సలు సమర్థనీయం కాదు.
తెలుగులోన లిపి సంస్కరణల గుఱించి ఇప్పటివఱకూ చాలామంది సూచనలు చేస్తూ కొందఱు, ఋ, ఱలు అనవసరం అంటే, మరికొందరు మహాప్రాణాక్షరాలు తెలుగుకి అక్కఱలేదు అని అంటున్నారు. తెలుగు లిపిని ఏర్పరిచినపుడు మనవారు కేవలం తెలుగునే, దృష్టిలో ఉంచుకొని ఉండుంటే, బహుశా మహాప్రాణాక్షరాలు ఉండేవి కావు. అందుకేనేమో, ‘‘తెనుఁగునకు వర్ణములు ముప్పది యాఱు’’ అని పరవస్తు చిన్నయసూరి పేర్కొన్నాడు. అయితే, తెలుగు లిపి సంస్కృతాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఏర్పాటుచేసినది. ఆమాటకొస్తే, సంస్కృతానికి ఏకైక లిపి అంటూ ఏదీ లేదు. తెలుగునాట తెలుగు లిపిలో, దక్షిణ ప్రాంతాలలో గ్రంథ లిపిలోనూ, ఉత్తర ప్రాంతాలలో దేవనాగరి, నాగరి, శారద తదితర లిపుల్లో రాసేవారు. బ్రిటీష్ పరిశోధకులు తమ పుస్తకాలలో సంస్కృతాన్ని దేవనాగరిలో రాయడం ప్రారంభించడంతో, అనుకరణల ప్రభావంలో పడిన మనవాళ్లందరూ తమతమ లిపులని పక్కన బెట్టి దేవనాగరి వెంటబడ్డారు (సంస్కృతం వఱకూ..!) నిజానికి దేవనాగరి సంస్కృతానికే పరిమితమైన లిపీ కాదు, సంస్కృతం దేవనాగరికే పరిమితమైన భాష, అంతకంటే కాదు. సంస్కృతానికి చెందిన అన్ని శబ్దాలనూ దేవనాగరిలో చూపడం కష్టం, కూడా. ఈ విషయంలో, సంస్కృతాన్ని కేవలం దేవనాగరిలోనే రాయాలని ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేయవచ్చును కూడా..! తెలుగు, సంస్కృతం రెండింటికీ వాడవలసిన, వాడదగిన తెలుగు లిపిని, వివిధ అక్షరాలను వదిలిపెట్టేయడంవలన, తెలుగు లిపిని తెలుగుకే పరిమితం చేయడం అవుతుంది. తద్వారా, వందల సంవత్సరాలుగా, తెలుగు నాట సంస్కృతాన్ని తెలుగు లిపిలో రాస్తూ వస్తున్న సంప్రదాయాలని ఆపుచేసినట్లవుతుంది. ఇది అస్సలు సమర్థనీయం కాదు. ఇకపోతే, ప్రస్తుత ప్రపంచీకరణలో, మధ్యయుగాల కాలంలోనూ ఇతర భాషల నుండి తెలుగులోకి వచ్చిన శబ్దాలలో కొన్ని తెలుగు నుడికారంలో ఇమిడిపోయినా, కొన్ని మాటలు రాయడానికి ఇబ్బంది పడవలసి వస్తోంది. ఏ కారణంవల్లనైతేనేమి, ఇలాంటి మాటలు తెలుగులో చాలానే వచ్చేసాయి. వీటికి సరిసమానమైన అర్థాలనిచ్చే, తెలుగు మాటలని పుట్టిస్తున్నా, అవి జనంలోకి ఎంతవరకూ వెళ్లగలవన్నది అనుమానమే. కొంతకాలానికి వెళ్లినా, అప్పటికే పరభాషలోని మాట జనాలలోనానిపోయి మనదే అయిపోయి ఉంటోంది (ఉదాహరణకి ‘సిగ్గు శరం’ అనే జంట మాట, శరం అనేది ఉర్దూ నుండి వచ్చినది చాలామంది భావన). అటువంటి వాటికి తెలుగులో రాయడానికి కొత్త అచ్చులు, హల్లులు ఏర్పాటుచేసుకోవలసిన అక్కఱ ఉంది. ముందుగా చెప్పుకోవలసినది, bank, tank, dam, may వంటి పదాలలోని అచ్చుని. పలికేటప్పుడు మేక అఱచినట్టుగా ఉన్న కారణంగా దీనిని మేషస్వరం అని కూడా చెప్పుకుంటారు. దీన్ని తెలుగులో బ్యాంక్, ట్యాంక్, డ్యాం వంటి పదాలతో రాసినా అసలైన పలుకుకీ, ఈ పలుకుకీ చాలా తేడా ఉందని అందఱికి తెలుసు. ఈ సమస్య దేవనాగరి లిపికి లేదు. వారికున్న మేష స్వరానే్న సూచిస్తుంది. అనే మాటలు పైనున్న ఉదాహరణలని సరిగ్గా సూచించగలవు. చాలామంది, దేవనాగరిలోని కారం తెలుగులోని ‘ఐ’కారాన్ని సూచిస్తుందని అనుకుంటారు. నిజానికి, ‘ఐ’ అనే సంయుక్త అచ్చుని దేవనాగరిలో ‘ఆ ఈ’గా విడదీసి రాస్తారు. ఉదాహరణకి ఐఐటీ అని తెలుగులో రాయగలిగేదానికి దేవనాగరిలో అని రాయాలి. (ఇదే ‘ఔ’కారానికి కూడా, దేవనాగరిలో ‘ఆ ఊ’గా విడదీయాల్సి ఉంటుంది. townI అనాల్సొస్తుంది. ఇది, ఉర్దూ ప్రభావం వలన కావచ్చు). ఈ అచ్చు, తెలుగులోకి వచ్చి చాలా కాలమైంది. దీనికొక అచ్చు, ఒక గుణింతమూ అవసరవౌతాయి. గతంలో, మేష స్వరానికి, బ్లాగరు తాడేపల్లి బాల సుబ్రహ్మణ్యంగారు ఒక సూచన చేశారు. అది ఈ క్రింద చూడండి. తర్వాత చెప్పుకోవలసినది "fa' అనే హల్లు గురించి. ఈ పలుకు తెలుగులో తీసుకువచ్చిన మార్పు ఇంతా అంతా కాదు. దీనికి తగిన మాటల తెలుగులో లేక, ‘ఫ’తో సూచించడం మొదలుపెడితే, అది అసలుకే ఎసరు పెట్టింది. ఇప్పటికీ ఫలితం, ఫలం వంటి మాటలని falitam, falam అని పలికే తెలుగువారు కోకొల్లలు. అలాగే హాస్యనటుడు బ్రహ్మానందం గారి ‘జఫ్ఫా‘ (jaffa) అనే మాటని తెలుగు కుర్రాళ్ళు విరివిగా వాడుతున్నారు. దీనిని తెలుగుమాటగానే పరిగణించాలని కొత్తగా చెప్పనక్కఱలేదనుకుంటాను. ఇంగ్లీషులోని జి, న, చీలుకూడా ఈ కోవలోనికే వస్తాయి. నిజానికి ఇంగ్లీషులోని ప్రతీ అచ్చునీ, హల్లునీ తెలుగులో కూడా రాయగలిగేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే, ఇంగ్లీషు ప్రభావంలో పడిన కొత్తతరం తెలుగు విద్యావంతులని తెలుగువైపు మరల్చడం అసాధ్యం. ఒకవేళ, భవిష్యత్తులో ఇంగ్లీషు మోజు, అవసరం తీరిపోయినా కూడా వారు తెలుగువైపు చూడరు. హిందీవైపో, చైనీస్ వైపో పోతారు. జాగ్రత్త పడకపోతే, వాళ్లు తెలుగు భాషీయులుగా గాక, వేరే ఇతర భాషలకు చెందినవారికి గుర్తింపబడవచ్చును కూడాను..! కొత్త అచ్చుల విషయంలో పరిశ్రమ అవసరం కావచ్చును గానీ, హల్లుల విషయంలో మాత్రం తెలుగువాళ్లం అంత కష్టపడనక్కఱలేదని నా ఉద్దేశ్యం. ఇందుకోసం, ముందుగా, ల గురించి చెప్పుకోవాలి. (ఉదాహరణకి చల్ల = సల్ల, చాలా = సాలా / శానా లాంటివి. ఇవన్నీ తో రాయవలసినవని నా అనుకోలు. తెలుగుకి చెందిన ప్రాచీన భాషా లక్షణాలలో ఇదీ ఒకటి. తమిళ లిలో చ, శలకి ఒకే అక్షరం ఉంది). సంస్కృతంలోని చ, ఛలే కాకుండా తెలుగులో మరో రకమైన చ ఉందని మొదటగా గ్రంథస్థం చేసినవాడు సి.పి.బ్రౌన్ అని అంటారు. ... అనే అక్షరాన్ని మొట్టమొదటగా వాడినది ఆయనే నంటారు. ఎవరైతేనేమి, చ అనే అక్షరం మీద ... (2)అంకెని వేసి ఈ పలుకుని ....గా సూచించడం జరిగింది. ఇదే పద్ధతిన జ అనే అక్షరం మీద .... వేస్తే.... వచ్చింది. ఈ పద్ధతిలో మరిన్ని కొత్త పలుకులని ఉన్న హల్లులతోనే సూచించవచ్చు. ముందు చెప్పుకున్న ‘చ్ఘి’ అనే మాటనే తీసుకుందాం. దానికి ‘్ఫ’ కాస్త దగ్గ కాబట్టి ‘్ఫ’ మీదనే .... అంకె వేస్తే సరిపోతుంది. కొన్ని మాటలని ఇక్కడ రాస్తున్నాను. first ఫస్ట్ fool ఫూల్ fun ఫన్ fan - ఫ్యాన్ (మేషస్వరం) fashion - ఫ్యాషన్ అలాగే, జికి క పైన, ఉర్దూ నుండి వచ్చిన హల్లులకి తగిన విధంగా అంకెలు వాడి, తెలుగు హల్లులని సృష్టించవచ్చు. Queen ........... కీన్ Quick ............. కిక్ Quiz ................... కిజ్ Que ................ కూ ఉఠ్దూ నుండి వచ్చిన మాటలు - ఖాన్, ఖబర్, ఖుషీ అలాగే, పాత తెలుగులో ఒకప్పుడు ఉండి, ఇప్పుడు తమిళ, మలయాళాల్లోనే మిగిలి, కన్నడంలో కూడా అరుదైపోయిన .... శబ్దాన్ని తెలుగులోకి మళ్లి తీసుకొని రావాలి (దీనికి సరిసమానమైన తమిళ అక్షరం ... మలయాళ అక్షరం....). కనీసం తమిళం నుండి, అక్కడి తెలుగు మాండలికాల నుండీ మాటలు తెచ్చుకునేటప్పుడు, ఇది ఉపయోగపడుతుంది. ఉన్నవాటినే వాడడం ఎలాగో చేతకానప్పుడు, కొత్తవి తెచ్చుకొని ఏం ప్రయోజనం? అని పెక్కుమంది తలపోయవచ్చు. నేను రాసింది, కేవలం నా దృక్కోణం నుండి మాత్రమే. నా ప్రధామైన ఉద్దేశ్యం, ఆలోచనని పంచుకోవడం మాత్రమే. ఇలాంటి మార్పులు, ఇతర భాషల నుండొచ్చిన మాటలనుండి తెలుగు మాటలను వేరు చేయడానికి కూడా ఉపయోగపడతాయి. నిజానికి ప్రపంచంలో ఉన్న అన్ని శబ్దాలనూ సూచించగల లిపి అంటూ ఏదీ లేదు. దానిని నిర్మించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. భారతీయ భాషల విషయంలో అలాంటి ప్రయత్నమేదైనా జరుగుతున్నదో లేదో తెలియదు. మన ప్రభుత్వం ఒకవేళ తలపోసినా, దేవనాగరి తప్ప మరో లిపి దానికి కనబడుతుందా అన్నది అనుమానమే...! ఒకవేళ అటువంటి ప్రయత్నం భవిష్యత్తులో మొదలైతే, తెలుగు లిపి ముందుకు ఉంచవచ్చు, తగిన మార్పులు తీసుకువచ్చిన పక్షంలో...!
ధన్యవాదాలు : సాలగ్రామ సుబ్రహ్మణ్య శర్మ 09966601753 గారి ఆంద్రభూమి వ్యాసం

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి