యాత్ర

నా మనసుకు కూడా
అలాగే.. చేద్దామని వుంది..
అదేమిటో
నన్ను
మెదడు మాటే నడిపిస్తుంటుంది

మాట మొదట్లో
కరుకుదనం రుద్దాలని వుంది.
మరెందుకో
ప్రేమే
గెలుపును వరిస్తోంది.

కంటికొనల గుండా
నిప్పులు కురిపించాలని
చూస్తే
నీటిచుక్క
చెంపలపై జారి పలకరిస్తుంది.

రెండుపోరాటాల
నడుమ
ప్రవహించే జీవితపు
నడకైతే తెలుస్తోంది


https://www.facebook.com/groups/kavisangamam/permalink/567861509933272/

కామెంట్‌లు