30 వ నంబరు ఎవరిది ?

29 వ నంబరు లోకి తెలంగాణా ఇక వచ్చేసినట్లే. తరవాత 30 నంబరుకోసం ఎదురు చూస్తున్న మరికొన్ని పోరాటాలు మేరా నంబర్ కబ్ ఆయేగా అని చూస్తున్నాయి.


అయితే ఇప్పటి వరకూ ఏర్పడిన రాష్ట్రాల వివరాలు ఇవి

సంఖ్య
రాష్ట్రం పేరు
రాజధాని
సంవత్సరం
28
ఛత్తిస్ ఘర్
రాయ్ పూర్
2000
27
జర్ఖండ్
రాంచీ
2000
26
ఉత్తరా ఖండ్
డెహ్రడూన్
2000
25
అస్సాం
డిస్పూర్
1975
24
సిక్కిం
గాంగ్ టక్
1975
23
అరుణా చల్ ప్రదేశ్
ఈటా నగర్
1972
22
మిజోరాం
ఐజ్వాల్
1972
21
హిమాచల్ ప్రదేశ్
సిమ్లా
1971
20
గుజరాత్
గాంధీనగర్
1970
19
మెఘాలయ
షిల్లాంగ్
1970
18
హర్యానా
ఛండీగర్
1966
17
పంజాబ్
ఛండీగర్
1966
16
నాగాలాండ్
కోహిమా
1963
15
గోవా
పానాజి
1961
14
మహారాష్ట్ర
ముంబై
1960
13
ఆంద్రప్రదేశ
హైదరా బాద్
1956
12
కర్ణాటక
బెంగళూరు
1956
11
కేరళ
తిరువనంతపురం
1956
10
మధ్య ప్రదేశ్
భోపాల్
1956
9
త్రిపుర
అగర్తలా
1956
8
జమ్ము&కాశ్మీర్
శ్రీనగర్
1948
7
ఒరిస్సా
భువనేశ్వర్
1948
6
రాజస్థాన్
జైపూర్
1948
5
మనిపూర్
ఇంపాల్
1947
4
పశ్చిమ బెంగాల్
కోల్ కతా
1947
3
ఉత్తర్ ప్రదేశ్
లక్నో
1937
2
బిహార్
పాట్నా
1912
1
తమిళ్ నాడు
చెన్నై
1688


    బోడోలాండ్ : 2003 ఫిబ్రవరి 10 తారీఖున ఏర్పడిన ఒప్పందం ప్రకారం బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ అస్సాంలో ఏర్పడింది. బోడో లిబరేషన్ టైగర్స్ ఫోర్స్ ప్రత్యేక రాష్ట్రం కోసం తమ పోరాటాన్ని చేస్తూనే వుంది.

    దిమరాజి : అస్సాంలో దిమా హసో, కచ్చార్,జిల్లాలతో పాటు దిమాపూర్ లోని నాగోన్ కర్బీ ఆన్ గ్లాండ్ ప్రాంతాలను కూడా కలిపి ఈ రాష్ట్రాన్నీ ఏర్పాటు చెయ్యాలనేది వాది డిమాండ్.


    ఢిల్లీ : దేశ రాజధానిగా తెలిసిన ఢిల్లీలో కూడా ఈ విభజన సెగలున్నాయి. ఇది న్యూఢిల్లీ దాని పరిసరాలలోని ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా, గుర్గావ్,సోనిపాట్, భాగ్పాట్ లతో కలగలసిన మహానగరం. దాదాపు 22 మిలియన్ల నివాసిత జనాభాని కలిగి వుంది. ఒక కేంద్ర పాలిత ప్రాంతం కంటే దాని స్వంత హైకోర్టు, శాసన సభ, ముఖ్యమంత్రి నేత్రుత్వంలో రాష్ట్రంలా ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లి సంయుక్తంగా కేంద్రప్రభుత్వ మరియు ఢిల్లీ స్థానిక ప్రభుత్వ పాలనలో వుంది. 2003 లోనే దీన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని ప్రతిపాదించారు. పౌరపరిపాలనా సౌలభ్యానికి ఇది దోహదం చేస్తుందనే వాదనలు కొనసాగుతున్నాయి.


    గూర్ఖాలాండ్ : గూర్ఖా లనే ప్రజల పేరు మీరుగా ఈ రాష్ట్ర డిమాండ్ ప్రారంభం అయ్యింది. డార్జిలింగ్ కొండలు మరియు పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో డోయర్స్ నివశించే వారు. జాతి, భాష మనో భావాలనే అంశాల ఆధారంగా ప్రత్యేకతను కాపాడుకునే నేపద్యంలో ఈ ఉద్యమం ప్రారంభం అయ్యింది. 1907 నుంచే ప్రత్యేక పరిపాలనా ప్రాంతం కావాలనే డిమాండ్ వుంది.


    హరిత్ ప్రదేశ్ : మీకు హరితాంధ్రపదేశ్ అనే మాట గుర్తొస్తోందా కాదండీ. ఉత్తర ప్రదేశ్ పడమటి భాగంలోని 22 రాష్ట్రాలు ఇప్పుడు ఆరు డివిజన్లుగా వున్నాయి ఆగ్రా, ఆలిఘర్, బారేలీ, మీరట్, మోరాదాబాద్ మరియూ సహారన్ పూర్. ఉత్తర ప్రదేశ్ తూర్పూ పడమర భాగాల మధ్య ఆర్ధికంగా, సాంస్క్రుతికంగా వ్యత్యాసాలున్నాయి. పడమర ప్రాంతం హర్యానా రాజస్థాన్ లతో ఎక్కువగా సంభందాలను కలిగి వుంటుంది. అజిత్ సింగ్ అనే ప్రముఖ న్యాయవాది నాయకత్వం లో ఏర్పడిన రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ హరిత్ ప్రదేశ్ ను డిమాండ్ చేస్తోంది మాయా వతి కూడా దీనికి తన మద్దతు 2009 లో ప్రకటించారు.
    కొంగునాడు : కొంగునాడు అంటే కోయంబత్తూరు, ఈరోడు, సేలం జిల్లాల తావు. ఎంతో పాతదైన తెలుగు పంటవంశపు కుదురు తొండై నాడు ఈశాన్య ప్రాంతానికీ, ఛోళనాడు వాయువ్య ప్రాంతానికి, కర్ణాటకకు ఆగ్నేయ ప్రాంతానికీ, కేరళ తూర్పు భాగానికీ సంభందించినది కొంగునాడు డిమాండ్. కొంగునాడు మున్నేద్ర కజగం(KMK) పార్టీ ఈ డిమాండ్ చేస్తోంది. ఆర్దికంగా తమప్రాంతానికి రాష్ట్ర బడ్జెట్ లో వాటా లభించకుండా అన్యాయం జరుగుతోంది అన్న ప్రాతిపదికపై ఈ ఉద్యమం మొదలయ్యింది. ఇది కూడా పది జిల్లాల డిమాండే. కొయంబత్తూర్, నీలగిరీస్, నమక్కల్, ఈరోడ్, తిరుపూర్, సాలెం, కృష్ణ గిరి, ధర్మపురి మరియూ డిండిగల్ జిల్లాలతో కలసిన కొంగునాడు కావాలని కోరుతున్నారు.


    కోసల : ఇది ఒడిశాలోని ప్రాంతం. సుందర్ ఘర్, ఝార్సుగూడా, సంబర్ పూర్, బార్ ఘర్, సోనేపూర్, భోధ్, బోలాంగిర్, నౌపడా, కాలా హండీ, నవరంగ్ పూర్, అన్ గల్ పూర్ జిల్లాలోని ప్రాంత మైన ఆథ్ మాలిక్, రాయ్ ఘడ్ లోని కాశీపూర్ ప్రాంతం, జార్ఖండ్ కి ఉత్తర భాగంలో వుంటుంది.


  • మిధిల : రామాయణంలో జనకుడు లేదా మిథి పరిపాలించిన విదేహ రాజ్యానికి చెందిన ప్రాచీన రాజధాని నగరము ీహార్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలలో మైధిలి భాష ను మాట్లాడే 24 జిల్లాలను కలిపి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలని డిమాండ్. 1993లో అంతరాష్ట్రీయ మిథిలా పరిషద్ పేరుతో మొట్టమొదటి సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ తన తాను మిథిల మరియు మైథిలి కొరకే ఏర్పాటు చేయబడ్డట్లు ప్రకటించింది. తరువాత 1995లో ఏర్పాటైన మిథిలా రాజ్య సంఘర్ష్ సమితి , 2008లో మరియు అఖిల భారతీయ మిథిలా పార్టీ, మిథిలా వికాస్ పార్టీ , లాంటి మరికొన్ని సంస్థల ఏర్పాటు జరిగింది. ఈ రెండు రాజకీయ పార్టీలు మిథిలా రాష్ట్ర ఏర్పాటు ప్రస్థావనతో తమ అస్థిత్వం నిలుపుకుంటున్నాయి.


    పూర్వాంచల్ : ఉత్తర ప్రదేశ్ లోని తూర్పుకోస ప్రాంతం. దీని సరిహద్దులలో ఉత్తరాన నేపాల్, తూర్పున బీహార్ రాష్ట్రం, ధక్షిణాన మద్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతం, పడమటన ఉత్తర్ ప్రదేశ్ లోని అవధ్ ప్రాంతం వస్తాయి. దీనిలో అవధ్ ప్రాంతం, బోజ్ పురి,బుందేల్ ఖండ్ వున్నాయి. ఇక్కడ ఎక్కువగా మాట్లాడుకునే భాష బోజ్ పురి. ప్రముఖ రాజకీయవేత్త అమర్ సింగ్ నేత్రుత్వంలో ఈ ఉద్యమం నడుస్తోంది. పూర్వాం చల్‌ కూడా రాష్ట్రంలో బుందేల్‌ఖండ్‌ మాదిరే బాగా వెనకబడిన ప్రాంతం. కానీ, బుందే ల్‌ఖండ్‌తో పోలి స్తే పూర్వాంచల్‌లో జనసాంద్రత ఎక్కువ. ఇక్కడ పట్ట ణాలు తక్కువ. ఏవో కొన్ని పరిశ్రమలున్నాయి. అసలే వెనకబడిన ప్రాంతం... దానికితోడు ఇక్కడ ప్రతి సంవత్సర మూ వరదలు బీభత్సం సృష్టిస్తుంటాయి. సంపన్నులు చాలా తక్కువ. చాలా చోట్ల పేదరికం తాండవిస్తూంటుంది. ఉత్తరప్రదేశ్‌లో పూర్వాంచల్‌ గోరఖ్‌పూర్‌ నుంచి అలహాబాద్‌ వరకు, బాలియా- డియోరియా నుం చి వారణాసి- ఆజంగఢ్‌ వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు 28 మంది ఎన్నికవుతారు. 403 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో 150 మంది ఇక్కడి నుంచే వచ్చారు.

  • తుళునాడు : భారతదేశంలోని కర్నాటక, కేరళ రాష్ట్రాలలో తుళు భాష మాట్లాడే ప్రాంతాన్ని తుళునాడుగా వ్యవహరిస్తారు. దీనిలో కర్నాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలూ కేరళలోని కాసరగోడు జిల్లాలో పాయాశ్విని నది వరకూ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. మంగళూరు, ఉడిపి, కాసరగోడు ఈ ప్రాంతాలలోని పెద్ద ఊర్లు.స్వాతంత్ర్యానంతరం, రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడినపుడు తుళు భాషీయులు తమ భాషకి అధికార భాష గుర్తింపుకోసం, ప్రత్యేక భాషాప్రయుక్త రాష్ట్రన్ని ఏర్పరుచుకోడానికి ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో, తుళునాడు రాష్ట్ర డిమాండు కూడా మళ్ళీ బయటకి వస్తోంది. తుళు రాజ్య హోరాట సమితి వంటి సంఘాలు ఇందుకోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

    Vidarbha (Marathi: विदर्भ) is a region that comprises the Amravati and Nagpur divisions of eastern Maharashtra. The State Reorganization Act of 1956 placed Vidarbha in Bombay State. Shortly after this, the state reorganisation commission recommended the creation of "Vidarbha state" with Nagpur as the capital, but instead it was included in Maharashtra state, which was formed on 1 May 1960.
    Support for a separate state of Vidarbha had been expressed by Loknayak Bapuji Aney and Brijlal Biyani Vidarbha. The demand for the creation of a separate state are based on allegations of neglect by the Maharashtra state government. Jambuwantrao Dhote led a popular struggle for Vidarbha statehood in the 1970s. Two politicians, N.K.P. Salve and Vasant Sathe, have led 21st century attempts to bring about a state of Vidarbha.
    విధర్భ :
అయినీ-అక్బరీ ప్రకారం మధ్యయుగ కాలంలో ఖిల్జీ వంశం నుండి మొగలుల పరిపాలన దాకా, సుబః బేరార్, గొంద్వాన మరియు గుల్షన్-ఎ-బేరార్ గా పిలువబడిన విదర్భ ప్రాతం యొక్క దేవఘర్ సర్కార్ కు నాగపూర్ ముఖ్యపట్టణంగా ఉండేది మరియు ఆలంగీర్ నామా ప్రకారం విదర్భ ప్రాంతపు పద్నాలుగు సర్కారులను బేరార్ అంటారునాగపూర్ డివిజన్ మరియు అమరావతి డివిజన్‌లతో ఏర్పడిన మహారాష్ట్ర యొక్క తూర్పు ప్రాంతం. ఇది మహారాష్ట్ర యొక్క మొత్తం ప్రాంతంలో 31.6% ఆక్రమించి మొత్తం జనాభాలో 21.3% కలిగిఉంది[1]. ఇది ఉత్తరాన మధ్య ప్రదేశ్, తూర్పున ఛత్తీస్‌గడ్, దక్షిణాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను మరియు పశ్చిమాన మాహారాష్ట్రలోని మరాఠ్వాడ మరియు ఖాందేష్ ప్రాంతాలను సరిహద్దులుగా కలిగిఉంది. మధ్య భారతదేశంలోని విదర్భ, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు భిన్నమైన తన స్వంత ఘనమైన సాంస్కృతిక మరియు చారిత్రక నేపధ్యాన్ని కలిగిఉంది. నాగపూర్ విదర్భ యొక్క అత్యంత పెద్ద నగరం, రెండవ పెద్ద నగరం అమరావతి, తరువాత స్థానంలో అకోలా, యవత్‌మల్, చంద్రపూర్ మరియు గోండియా ఉన్నాయి. అధికభాగం విదర్భవాసులు మరాఠీ మాండలికమైన వర్హది మాట్లాడుతారు.విదర్భ జాతీయ స్థాయిలో 10 లోక్‌సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. విదర్భ రాష్ట్రస్థాయిలో 62 విధానసభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. భారత ప్రభుత్వ జనాభా లెక్కలు 2001 ప్రకారం విదర్భ 20,630,987 జనాభాను కలిగిఉంది.

ప్రత్యేక రాష్ట్రవాద ఉద్యమం

1) 1853 :-మొగలులు మరియు మరాఠాల నుండి మధ్య భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించిన తరువాత, 1853లో నాగపూర్ రాజధానిగా “నాగపూర్ ప్రావిన్స్” ఏర్పాటుచేయబడింది. ఇది కేంద్ర ప్రభుత్వం నియమించే ఒక కమిషనర్ పాలనలో ఉండేది.

2) 1861 :- నాగపూర్ రాజధానిగా బ్రిటిష్ వారు “సెంట్రల్ ప్రావిన్స్“ను ఏర్పరచారు.

3) 1903 :- అక్టోబర్ 1 న బేరార్ కూడా సెంట్రల్ ప్రావిన్స్‌ల కమిషనర్ పాలనలోకి వచ్చింది. దీనికి ఇప్పుడు “సెంట్రల్ ప్రావిన్స్ అండ్ బేరార్” అని పేరు పెట్టబడింది.

4) 1935 :- బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టం, ఎన్నికలను నిర్వహించి, ప్రొవిన్షియల్ అసెంబ్లీని ఏర్పరచింది. నాగపూర్ రాజధానిగా “సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్” ప్రత్యేక రాష్ట్రంగా ఉంచబడింది.

5) 1950 :-1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు "సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్", నాగపూర్ రాజధానిగా మధ్య ప్రదేశ్‌గా ఏర్పడ్డాయి.

6) 1956 :-భారతదేశంలో రాష్ట్రాల పునర్విభజన కొరకు ఏర్పాటైన ఫజల్ అలి కమిషన్(1953లో నియమించబడింది) నాగపూర్ రాజధానిగా “విదర్భ రాష్ట్రం” కొరకు సిఫారసు చేసింది.

7) 1960 :- మే 1న, రాష్ట్రాల పునర్విభజన కొరకు ఫజల్ అలీ కమిషన్‌చే సిఫారసు చేయబడిన "విదర్భ రాష్ట్రం", నూతనంగా ఏర్పాటైన మహారాష్ట్ర రాష్ట్రంతో కలిపివేయబడింది.



మహారాష్ట్ర యొక్క మిగిలిన ప్రాంతంతో సాంస్కృతిక భిన్నత్వంతో పాటు, విదర్భ చారిత్రకంగా ఒక ప్రత్యేక శైలిలో రూపొందింది. అనేక లేఖనాల ప్రకారం విదర్భ ప్రాంతంలో ఇవి జరిగాయి:

అగస్త్యుడు మరియు లోపాముద్రల వివాహం.
కృష్ణునిచే రుక్మిణీ-హరణం (రుక్మిణిని ఎత్తుకుపోవడం). రుక్మిణి, విదర్భ దేశపు రాకుమార్తెగా వర్ణించబడింది. రుక్మిణి కృష్ణుని ముఖ్య రాణులలో ఒకరిగా మారింది.
పౌరాణికంగా మహాభారతంలో కుండిన్ పూర్/కౌండిన్య పూర్/కుండినపురి, విదర్భ యొక్క ముఖ్యపట్టణంగా చెప్పబడింది. బమ్మెర పోతన (భాగవతం నుండి)

వచ్చెద విదర్భ భూమికి
చొచ్చెద భీష్మకుని పురము సురుచిర లీలన్
తెచ్చెద బాలన్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చిన పోరన్!


అనే పద్యం శ్రీకృష్ణ పాండవీయం (1966) తెలుగు సినిమానుంచి ఘంటసాల పాడారు. యన్ టీ ఆర్ కృష్ణపాత్రధారి టివి రాజు సంగీతం.

నల మహారాజు మరియు దమయంతిల కధ కూడా మహాభారతంలో ఉంది.

రామాయణంలో కూడా విదర్భ ఆ సమయంలోని జనపదములలో ఒకటిగా పేర్కొనబడింది.

కాళిదాసు యొక్క పద్యకావ్యం "మేఘదూత" కూడా యక్ష గాంధర్వ దేశబహిష్కారప్రదేశంగా విదర్భను సూచిస్తుంది.

    ఇంకా ఈ క్రింది రాష్ట్రాలు కూడా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ లోవున్నాయి వాటి వివరాలు కొంత విరామం తర్వాత అందజేయగలను అప్పటివరకూ సెలవు.
    (చూస్తూనే వుండండి కుదిరి నప్పుడల్లా నాబ్లాగ్.... :)  )



మరికొన్ని లింకులు

మందిని కలిపి ఉంచేది నుడే
- స.వెం. రమేశ్

కామెంట్‌లు