సిగ్గులేని గద్ద తరిమేటప్పుడు
నీకు కనీసం కోడిపిల్లంత రక్షణైనా వుండదని తెలుసు.
ముసుగేసిన మౌఢ్యలను
మలాలాని అడ్డుపెట్టుకుని దొబ్బినోళ్ళు,
నగ్నంగా నీవిషయంలో
నరహంతకులవుతారనీ తెలుసు.
పాట్రియాటిజ మంటే
సిఐయ్యే కి సలాం కొట్టి గులాం అవటం కాదు.
తప్పు తనవాళ్లదే అయినా
మనిషే మన మతమనటం నీనుంచి నేర్చుకోవాలి నేస్తం.
పేరులో మంచు, ఫేసులో మంచే కాదు
నిర్ణయంలో నిప్పులుకురిపించటం నీకే సాధ్యం.
ముఫ్ఫయ్యేళ్ళ మహా గ్రంధమా
నీనుంచి మీమంతా చదవాల్సింది చాలా వుంది.
దేశంలో చొరబాటే కాదు
దేహంలో చొరబాటూ దారుణమే.
స్వేఛ్చలోకి దూరటం మరీ ఘోరం.
నీతిలేని తనం న్యాయాధిపతి అయినపుడు,
ఈలేయటాన్నే నేరమంటారు మరి.
దేశాలు నీ దేహాన్ని హత్తుకోలేక పోయినా
చరిత్ర నిన్ను సువర్ణాక్షరాలతో పొదువుకుంటుంది
స్వేఛ్చ శిలగా నిలచిన చోట
నువ్వే స్టేటస్ ఆఫ్ లిబర్టి.
మృగాలు వెంటాడే తావుల్లో
నిజంగా నీవే మృగరాజువి.
నీకు కనీసం కోడిపిల్లంత రక్షణైనా వుండదని తెలుసు.
ముసుగేసిన మౌఢ్యలను
మలాలాని అడ్డుపెట్టుకుని దొబ్బినోళ్ళు,
నగ్నంగా నీవిషయంలో
నరహంతకులవుతారనీ తెలుసు.
పాట్రియాటిజ మంటే
సిఐయ్యే కి సలాం కొట్టి గులాం అవటం కాదు.
తప్పు తనవాళ్లదే అయినా
మనిషే మన మతమనటం నీనుంచి నేర్చుకోవాలి నేస్తం.
పేరులో మంచు, ఫేసులో మంచే కాదు
నిర్ణయంలో నిప్పులుకురిపించటం నీకే సాధ్యం.
ముఫ్ఫయ్యేళ్ళ మహా గ్రంధమా
నీనుంచి మీమంతా చదవాల్సింది చాలా వుంది.
దేశంలో చొరబాటే కాదు
దేహంలో చొరబాటూ దారుణమే.
స్వేఛ్చలోకి దూరటం మరీ ఘోరం.
నీతిలేని తనం న్యాయాధిపతి అయినపుడు,
ఈలేయటాన్నే నేరమంటారు మరి.
దేశాలు నీ దేహాన్ని హత్తుకోలేక పోయినా
చరిత్ర నిన్ను సువర్ణాక్షరాలతో పొదువుకుంటుంది
స్వేఛ్చ శిలగా నిలచిన చోట
నువ్వే స్టేటస్ ఆఫ్ లిబర్టి.
మృగాలు వెంటాడే తావుల్లో
నిజంగా నీవే మృగరాజువి.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/583791431673613/
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి