రామ రామ ఏమి సేతు ? దేశమంతా డబ్బుపోటు రాజకీయపు విషపు కాటు

భారత్-శ్రీలంక దేశాల మధ్య రామేశ్వరం మరియు శ్రీలంక దీవులును కలుపుతు సేతువు లాంటి సున్నపు రాతి ఆకారం. దీనిని 'ఆడమ్స్ బ్రిడ్జ్' అని కూడ అంటారు. ఇది పాక్ జలసంధిలో ఉన్నది. సేతువులను 'షోల్స్' లేక 'సాండ్ బార్స్' అని కూడా అంటారు.(http://en.wikipedia.org/wiki/Shoal ) అక్కడ ఒక వైపు వున్న పాక్ జలసంధి గుండా కాలువ తవ్వి మరోవైపున గల మన్నార్ సింధు శాఖతో కలుపుతూ కాలువ మార్గం ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచో నలుగుతున్నాయి.

ఇది పగడపు దిబ్బనే అని శాస్థ్రావేత్తలు వివరిస్తున్నారు. ఎప్పటిదో మానవనిర్మితమని కొందరు నమ్ముతున్నారు.

ఎందుకు నిర్మించాలనుకుంటున్నారు ? సుయజ్‌ కెనాల్‌, పనామా కాలువ లాంటివి భారీ నౌకలకు వేలాది మైళ్ళ దూరాన్ని తగ్గించి, వందల గంటల సమయాన్ని ఆదాచేశాయని. అటువంటి ఆర్థిక లాభాల కోసమే దీన్ని పగలగొట్టేసి నౌకామార్గం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానివల్ల అరేబియన్ సముద్రం నుంచి హిందు మహ సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలు శ్రీలంకను చుట్టి వెళ్లే బాధ తప్పుతుందని అందువల్ల దేశ తూర్పు పశ్చిమ తీరాల మధ్య దూరంలో 424 నాటికల్ మైళ్లు అంటే 780 కిలోమీటర్ల దూరం కలిసొస్తుందని. సుమారు 30 గంటల సమయం ప్రయాణంలో కలిసి వస్తుందని ఈ పనికి పూనుకోవాలని చూస్తున్నట్లు చెపుతున్నారు.
అంతర్జాతియ నౌకా రవాణాలో మరింత సౌలభ్యం వుంటుందనీ చెబుతున్నారు. మరికొన్ని నిజాలు చూద్దాం.

►2005 జూలై 2 ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌న శంకుస్థాపనచేశారు. 2007 సెప్టెంబరులో సుప్రింకోర్టు దీనిపై నిలుపుదల ఉత్తర్వులను జారీ చేసింది.

ఇది కేవలం ఆర్ధిక అంశమే కాదు. ముఖ్యంగా పర్యావరణపరమైన కారకాలను, మత పరమైన అంశాల వల్ల ఏర్పడిన సున్నిత మనో భావాలనూ కూడా పరిగణలోకి తీసుకోవాలి.

►అధికారిక నివేదికలే ఇది అనవసం అంటున్నాయి : ప్రఖ్యాత శాస్త్ర్రవేత్త RK పచౌరీ సారధ్యంలో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ప్రస్తుత రూపంలో సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేఖిస్తూ నివేదిక సమర్పించింది.

►దీని ఖర్చు : ప్రాధమిక అంచనాల ప్రకారమే 24,700 కోట్ల రూపాయిలు, తాజా అంచనాల ప్రకారం 45,000 కోట్లకు పెరిగింది.

►ఉపయోగ పరిధి : ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 60,000 DWT ( డెడ్ వెయిట్ టన్నేజి ) రవాణా నౌకలు సంచారం పెరిగింది. కానీ సేతు కాలువ ద్వారా కేవలం 32,000 DWT మించిన రవాణా నౌకలు వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు ఆర్ధికంగా పెద్ద లాభదాయకం కాదు.

►పర్యావరణం : మన్నార్ సింధు శాఖలో అరుదైన జీవవృక్షజాతులు 3600 వరకూ వున్నాయని, వైవిధ్య భరిత క్షీరదాలకు ఇది అనుకూల ఆవాస ప్రాంతం గా ఉపయోగ పడుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటిలో ఆమ్లీకరణ పెరుగుతుంది. చమురు తెట్టుల వంటి కాలుష్యం ముసురు కోవడం వల్ల వీటికి నష్టం ఏర్పడుతుంది.

►జీవన భృతి : లక్షలాది మంది ఇక్కడ లభించే మత్ససంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. 20 లక్షల మంది మత్య్సకారుల జీవనం జీవికలు కోల్పోతారు. ప్రత్యామ్నాయ జీవికలను వారు ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది.

►ప్రకృతి వైపరీత్యాలు : కెనడాలోని అట్టావా విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ టాడ్ ఎస్ మూర్తి వెల్లడించిన పరిశీలనల ప్రకారం 2004 నాటి సునామీ కేరళపై విరుచుకు పడకుండా రామసేతు అడ్డుకుందన్నారు. రామసేతును తొలగిస్తే భవిష్యత్తులో సునామీల వంటి ప్రకృతి విపత్తులను అడ్డుకునే ఈ సహజమైన గోడను కోల్పోయినట్లే అంటున్నారు. ( ఒకప్పుడు కలివికోడి కోసం తెలుగు గంగ దారి మార్చటం మన రాష్ట్రంలోనే జరిగింది )

►మనోభావాలు : పురాణాల ప్రకారం సీత ను రక్షించడానికి రాముడు, వానరసేన సహాయంతో లంకకు కట్టిన వారధి ఈ రామ సేతు. సముద్రంపై తేలే బండలతో కట్టినట్లు చెప్తారు. దీన్ని కూల్చటం అంటే వీరందరి మనోభావాలను కూల్చటమే అనిది మరో అంశం. ఇది కూడా సులభంగా కొట్టిపారేసే చిన్న అంశం కాదు.

బీజేపి కూల్చొద్దంటోంది కాబట్టి దాన్ని కూల్చేద్దాం అంటే సెక్యులర్ అనుకుంటారా ? జయలలిత దీనిని జాతియ కట్టడంగా ప్రకటించ మన్నారు కాబట్టి ఆమె రాజకీయ వ్యతిరేఖులు అది వృధా నిర్మాణమని ఊరుకోవంటం సరైందా?

నిజాల వెలుతురులో విషయాలను చూడటం నాదేశానికి అబ్బితే ఎంతబాగుండును.

కామెంట్‌లు