ఒక పద్యం లోని ప్రతి పాదం లోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రాస అంటే కవిత్వానికి ఉపయోగించే వ్యాకరణ విశేషము. అంటే పాదాల చివరి పదాలలో కొంత సారూప్యము ఉండుట.
మొదటి పాదంలో రెండవ అక్షరం ఏ విధంగా ఉంటుందో తక్కిన పాదాలన్నింటిలో రెండవ అక్షరం ఆ విధంగానే ఉండాలి. దీనినే ప్రాస మైత్రి అంటారు.
మొదటి పాదంలో రెండవ అక్షరం ఏ విధంగా ఉంటుందో తక్కిన పాదాలన్నింటిలో రెండవ అక్షరం ఆ విధంగానే ఉండాలి. దీనినే ప్రాస మైత్రి అంటారు.
- ప్రధమ పాదమందు ద్వితీయాక్షరము ఏ హల్లుండునో తక్కిన పాదములలో ఆ హల్లే ఉండవలయును.
- ప్రాసాక్షరము ద్విత్వమైన, అన్ని పాదములందునూ అదే అక్షరము ద్విత్వముగను, సంయుక్తమైన అన్ని పాదములందునూ అదే హల్లు సముదాయము సంయుక్తముగను ఉండవలెను.
- ప్రాస పూర్వాక్షరము గురువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము గురువుగనూ, ప్రాస పూర్వాక్షరము లఘువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము లఘువుగను ఉండవలెను.
- ప్రాసాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ అదే అక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను.
- ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస కుదురును.
- వృత్తాలలో ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం, తరలము, మత్తకోకిల వంటి రీతులలో ప్రాస నియమము పాటించవలెను.
- జాతులలో కందము మరియు తరువోజ పద్యాలలో ప్రాస నియమము ఉంది. ద్విపదలో ప్రాసనియమము ఉన్ననూ, ఈ నియమాన్ని పాటించని ద్విపదని మంజరీ ద్విపద అంటారు.
- ఆటవెలది, తేటగీతి, సీసము వంటి ఉపజాతి పద్యాలలో ప్రాస నియమము లేదు. కానీ వీటిలో, ప్రాసయతి చెల్లును.
ప్రాసభేదాలు
- అర్థబిందు సమప్రాసం
- పూర్ణబిందు సమప్రాసం
- ఖండాఖండ ప్రాసం
- సంయుతాక్షర ప్రాసం
- సంయుతాసంయుత ప్రాసం
- రేఫయుత ప్రాసం
- లఘుద్విత్వ ప్రాసం
- వికల్ప ప్రాసం
- ఉభయ ప్రాసం
- అనునాసిక ప్రాసం
- ప్రాసమైత్రి ప్రాసం
- ప్రాసవైరం
- స్వవర్గజ ప్రాసం
- ఋప్రాసం
- లఘుయకార ప్రాసం
- అభేద ప్రాసం
- సంధిగత ప్రాసం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి