కురుస్తున్న చినుకు

కురిసే ఈ చినుకంటే కొందరికి కినుక,మరికొందరి ఆనందానికి ఊనిక,

అరచేతిని అడ్డుపెట్టి వర్షాన్ని ఆపలేరు,
తడి తగలకుండా చూసుకో గలరేమో గానీ

కురిసే ఈ చినుకు
పొలానికి మళ్ళాళి తిండిగింజగా అయ్యేందుకు


మనసు ముత్యపు చిప్పలో పడాలి,
సంతోషాన్ని పూయించేందుకు.

ఎండిన పెదాల దాహం తీర్చేందుకు,
ఆగిన పాదాల నడకను కూర్చేందుకు,


మురికి కాల్వలతో నిండిన చోటుని
ముందు శుబ్రం చేసుకుందాం పట్టండి.


ఏరువాక సాగేందుకు
విత్తనాలను సగెయ్యండి.


చినుకులానే ప్రేమను కురిపించేందుకు
విజయానికి హృదయం అద్దండి.

కామెంట్‌లు

  1. పద్మార్పత గారూ ధన్యవాదాలండీ.. మీ బ్లాగుకూడా చూస్తున్నాను బావుంది. నా అగ్రిగేటర్ కలెక్షన్ లో మీ బ్లాగు కూడా ఒకటి. ధాంక్యూ

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి