మనది వ్యాపారమయ్యాక
సర్లే పొరపొచ్చాలు కూడ వచ్చాక.
ఇంకేం విడిపోదాం.
కాకపోతే
డబ్బు, వస్తువులే కాదు.
స్నేహాన్నీ, నమ్మకాన్నీ
అంతెందుకు
నా మనుసునే పెట్టేనిందులో,
అదికూడా ముక్కలు చేసుకెళ్ళమంటే,
ఎందుకో ఇలా బెంగ.
గరిట పట్టుకున్నవాడు
నిజమే నీ విస్తట్లో వడ్డించాలంటే
చెయ్యి పొట్టిగా మారేది.
నాకు తెలుసు
శోకం ఘనీభవిస్తే
పిడికిలికంటే బలంగా వుంటుందని.
నేలనిండా అల్లుకున్న వేళ్ళలా,
చెట్టుని కౌగలించుకున్న తీగల్లా
అంతా ఒకటై అల్లుకున్నాక,
దూరంగా లాగేయాలంటేనే
భారంగా అనిపిస్తోంది.
అప్పగింతలప్పుడు
మనసు రెపరెపలాడినట్లు,
దింపుడుకల్లం కూడా లేని
ఆశలు టపటప కొట్టుకుంటున్నాయి.
తప్పదు
ఎదగేటప్పుడు కణం కూడా విడిపోక తప్పదు.
తప్పదు
సమయమోచ్చాక ప్రయాణంలో దిగిపోవటం తప్పదు.
తొడుకోవలసిన పాలు విరిగిపోవద్దంటే,
పుల్లలెగదొసుకునే పని ఎవ్వరం చెయ్యోద్దు.
అత్తారింటికి చేరాక అమ్మానాన్నది చుట్టంచూపవటం తప్పదు.
కానీ నాక్కొంచెం నమ్మకమివ్వు,
నిజంగానే కావలసిన భరోసానివ్వు.
నువ్వూ, నేను ఏకవచనమై దూరంగా వున్నా,
మనమనేది నిజమే ననే దీపపు వెలుగుల ఓ చిర్నవ్వునివ్వు.
ఇదే ఇసుకలో నా పిచుక గూడు కట్టుకునేప్పుడు,
నేనో చెయ్యేస్తాననే మాటనివ్వు.
01-08-2013
https://www.facebook.com/groups/kavisangamam/permalink/598645070188249/
సర్లే పొరపొచ్చాలు కూడ వచ్చాక.
ఇంకేం విడిపోదాం.
కాకపోతే
డబ్బు, వస్తువులే కాదు.
స్నేహాన్నీ, నమ్మకాన్నీ
అంతెందుకు
నా మనుసునే పెట్టేనిందులో,
అదికూడా ముక్కలు చేసుకెళ్ళమంటే,
ఎందుకో ఇలా బెంగ.
గరిట పట్టుకున్నవాడు
నిజమే నీ విస్తట్లో వడ్డించాలంటే
చెయ్యి పొట్టిగా మారేది.
నాకు తెలుసు
శోకం ఘనీభవిస్తే
పిడికిలికంటే బలంగా వుంటుందని.
నేలనిండా అల్లుకున్న వేళ్ళలా,
చెట్టుని కౌగలించుకున్న తీగల్లా
అంతా ఒకటై అల్లుకున్నాక,
దూరంగా లాగేయాలంటేనే
భారంగా అనిపిస్తోంది.
అప్పగింతలప్పుడు
మనసు రెపరెపలాడినట్లు,
దింపుడుకల్లం కూడా లేని
ఆశలు టపటప కొట్టుకుంటున్నాయి.
తప్పదు
ఎదగేటప్పుడు కణం కూడా విడిపోక తప్పదు.
తప్పదు
సమయమోచ్చాక ప్రయాణంలో దిగిపోవటం తప్పదు.
తొడుకోవలసిన పాలు విరిగిపోవద్దంటే,
పుల్లలెగదొసుకునే పని ఎవ్వరం చెయ్యోద్దు.
అత్తారింటికి చేరాక అమ్మానాన్నది చుట్టంచూపవటం తప్పదు.
కానీ నాక్కొంచెం నమ్మకమివ్వు,
నిజంగానే కావలసిన భరోసానివ్వు.
నువ్వూ, నేను ఏకవచనమై దూరంగా వున్నా,
మనమనేది నిజమే ననే దీపపు వెలుగుల ఓ చిర్నవ్వునివ్వు.
ఇదే ఇసుకలో నా పిచుక గూడు కట్టుకునేప్పుడు,
నేనో చెయ్యేస్తాననే మాటనివ్వు.
01-08-2013
https://www.facebook.com/groups/kavisangamam/permalink/598645070188249/
Wow బావుంది.
రిప్లయితొలగించండి