ఉచిత సందేశాలతో విసుగెత్తి పోతున్నారోం దేవుడో

ఇంతకు ముందే ఉపయోగపడే సమాచారం ఇస్తామని పేరుపెట్టుకున్న ఓ ఫేసుబుక్ పేజిలో రావిఆకుల్తో సెల్లు బ్యాటరీ ఛార్జింగ్ అని 1,2,3,4, స్టెప్పుల్లో ఓ బొమ్మెట్టి యివరన ఇచ్చేశాడు. ఇంకేముంది. పెట్టి నాలుగ్గంటలు కాకముందే నాలుగు వేలకు పైన షేర్లు, మూడేలకు పైన లైకులూనూ (నిజమే లైకుకంటే షేర్ కోసం ఉరుకులెట్టేశారు) నాలుగు వేలమంది మరో నాలుగు గంటల్లో ఒక్కోక్కరూ కనీసం నలబై మందికి ఈ గజ్జి అంటిస్తారు. ఏంటీ తొందర ఏదో పెద్ద మహత్కార్యం చేస్తున్నట్లు. ఒక పాతసెల్లుకి రావాకులు పెట్టి ఛార్జింగ్ అవుతుందో లేదో ముందు చూస్కోరాదు. అంత ఓపిక లేక పోతే కనీసం దీని గురించి విశ్లేషించిన నిపుణులు ఏమంటున్నారని ఓ సారి సరి చూసుకుని పంచొచ్చు కదా. 


ఐదు తలల పాము కనపడిందంటాడొకడు, ఐదు సెకన్లలో షేర్ చెయ్యపోతే నీ బొంగు పగిలి పోతుందని బ్లాక్ మెయిల్ బెదిరింపు చేస్తాడింకొకడు. ఏం పోయింది వస్తే కామెంట్లు లైకులూ పోతే ఓ క్లిక్కు అనుకుంటారేమో ఇలాంటివైతే ఎడాపెడా పంచేస్తారు. 

మరికొంతమందికి సాంతం చదివే ఓపిక వుండదు నీళ్ళ బాటిల్ కార్లో వుంటే ఖచ్చితంగా ఆడవాళ్ళకి బ్రెస్టు కాన్సరని అదేదో డాట్టర్లు తేల్చేశారంటాడు. ఈయన గారి బుర్రలో ప్లాస్టిక్ మంచిదికాదు కదా అని అప్పటికే ఫీడ్ అయ్యి వుంటుంది. ఒక్క క్షణం కూడా ఆగకుండా ఫోస్టుచేసిపారేస్తారు. ఇప్పటికే ఏదైనా హోదా వున్నవారయితే పరిస్థితి మరీ దారుణం ఈయనే చెపుతున్నాడంటే నిజమే కదా అనుకునే వాళ్ళకిదో సర్టిఫికేట్ అవుతుంది.

ఏం చెపుతున్నారో చూడలేనప్పుడు కనీసం వదిలేయకుండా కొంతమంది రైటే నని నెత్తికెత్తుకోవడం మరికొంత మంది అది ఖచ్చితంగా తప్పే అనుకుని ఏదో ఒక కామెంటు పెట్టటం చూస్తుంటే అంత ఓపిక లేనపుడు ఇది మాత్రం ఎందుకు చేసారా అని జాలేస్తుంటుంది.
ఒక జాతియ నాయకుడి పుట్టిన రోజుకి మరెవరిదో ఫోటో పెట్టి శుభాకాంక్షలు చెపుతారు. కనీసం కామెంట్లో అది తప్పండీ అని చెప్పినా వారి మానన పోస్టు చేసింతర్వాత మళ్ళఅటుచూసే పని పెట్టుకోరు మరికొందరు.

1) వ్యక్తిగతంగా , రాజకీయంగా లేదా తామున్న రంగంలో గుర్తింపు కోసం కొందరు.
2) ప్రమాద కరమైన రహస్య సంకేతాలను గూడుపుటానీలనూ భద్రతా విభాగాల కళ్ళుకప్పి చేరవేసేందుకు ప్రయత్నించేవారు.
3) మేలు చేస్తున్నమనే బ్రమలో ఎడాపెడా నిర్లక్ష్యాన్ని విరజిమ్మే వారు మరికొందరు.
4) బక్తి, వెబ్, ఉత్తత్తుల బ్రాండింగ్ కోసం మరికొందరు.

వినదగు నెవ్వరు చెప్పిన ... విని నంతనే వేగ పడకండి.
ప్రాక్లికల్ సాధ్యమయితే చేసి చూడండి రిజల్ట్ నిజమయితేనే చెప్పండి అది ఉత్తమం.
కనీసం సెర్చ్ లో కానీ లేదా వీటి ఆగడాలను అరికట్టేందుకే తయారు చేసిన http://www.hoax-slayer.com/ లాంటి సైట్ల లోనూ సరిచూడండి.

మంచి చేయలేక పోతే పర్వాలేదు ... కనీసం చెడు చెయ్యకుండా వుండ గలుగుతాం.
ఉచితాన్ని అనుచితంగా వృధాచేయకుండా అగుదాం.

కామెంట్‌లు


  1. ఇంతకీ మీ టపా కి 'లైకు' కొట్ట మంటారా ?

    లేక క్లిక్ చేసి చదివి వెళి పోతే చాలంటారా !

    జేకే

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. చివరాంతం బాగానే వ్రాసారు కానీ, 50 ఏళ్ల వాళ్ళు 18 ఏళ్ల వాళ్లకి చెప్పినట్లుగా ఉన్నది. ఎవరి జీవితం వారిది. చూసి చూసి బోరుకోట్టచ్చు. కోట్లాది జనాలలో మరొకడి అదే కొత్త. ప్రతివారు మైండులో ఎదో పెట్టుకొనే మాట్లాడుతారు. ఎవరికి వారు మరొకరిని ఒప్పించే ప్రయత్నమే కానీ, ఒప్పుకునేది లేదు కదా. అందుకనే కదా ప్రపంచంలో అన్నీ భాషలు, అందులోను మన దేశంలో మరిన్ని ఎక్కువ భాషలు, ఎవరి భావం వారిది. సహనో భవతు... :) :)

    రిప్లయితొలగించండి
  3. జిలేబీ గారూ అవగాహన చేసుకుంటారనే చెపుతున్నాను. లైకులూ, క్లిక్కుల మోజయితే ఇంకా చాలా రకాలుగా తెచ్చుకోవచ్చు. అర్ధంకావటం వల్ల చేసేషేరూ, నచ్చటం వల్ల సంతోషంతో పెట్టే లైకూ వస్తే మన పని ఫలవంతమైనందుకు సంతోషం.
    భారతీయ గారూ సర్లేడి రాతతాలూకూ వయసుతో ఇబ్బందేం వుంది. స్వేచ్చకీ , స్వతంత్రతకీ, విశృంఖలతకూ వున్న తేడానే ఇక్కడా పనిచేస్తుందండీ. అతి ఉదాశీనులే దుర్మార్గులకంటే ప్రమాదకారులవుతున్నారనేది నిజం.

    రిప్లయితొలగించండి
  4. ఒకరినొకరు కలవలేనంత మానసిక దూరం ఉన్న ఈ రోజుల్లో, అంతర్జాలంలోని సోషల్ నెట్ వర్క్ వాడేది 99 శాతం కాలేక్షేపం కోసమే. ప్రతి దానిలో మంచి చెడు అనేవి ఉంటాయి. అయితే చెడు చిన్నగా ఉన్నా బాగా కనపడుతుంది. కత్తితో కూరలు తరిగాలా లేక మేడలు కోసుకోవాలా అనేది విచక్షణబట్టి ఉంటుంది. అలా అని కత్తే పట్టుకోవద్దని నిర్దేసించలేము. చిన్న పిల్లల్ని పట్టుకున్నట్లు అందరిని చేయ్యపట్టుకొని నడిపిస్తే సమాజం అసమర్ధంగా మారుతుంది.

    రిప్లయితొలగించండి
  5. కొన్ని సరిగా అర్ధం చేసుకోగలిగితేనే విషయం తేటతెల్ల అవుతుందండీ.
    మానసిక దూరాలను కలిపేందుకు సోషల్ నెట్ వాడితే 99 శాతం కాలక్షేపం అనకూడదు.
    ప్రతిదానిలోనూ మంచీ చెడు వున్నప్పుడు చెడుని చూస్తూ అది చెడే అని తెలిసి అలానే వుండనీయమనే వాళ్ళని ఏమనుకోవాలి.
    మెడలు కోసుకునేవాళ్ళు అంతకంటే మూర్ఖంగా పక్కనోడి పీకలు కోద్దామని చూస్తున్నవాళ్ళు కనబడుతుంటే కత్తి ఉపయోగం అదికాదురా బాబులూ అని చెప్పకుండా నాకెందుకులే అని వూరుకోమనే వాళ్ళతెలివిని ఏమనాలి.
    శారీరకంగా ఎదగని చిన్న పిల్లలకు ఒకలా, మానసికంగా ఎదగని చిన్న పిల్లలకు ఒకలా చే సాయం అవసరం అవుతుంది. అది కూడా తప్పే అనిపించేవాళ్ళకు మూర్ఖపు మెసేజిలను ఎడా పెడా జనాలమీదకి వదలటం ఎందుకు రైటని పిస్తోందో అర్ధం కావడం లేదు.
    తీవ్రవాద సమాచారాన్ని పైపై పూతలతో వదిలితే ఇలానే ఉదాశీనులు దేశానికి ఏదో చేసేస్తున్నాం, మనదేం పొయ్యిందిలే అని జనం మీదకు వదులుతున్నారు.
    ఇది ఇంత సేపట్లో షేర్ చెయ్యకపోతే మీకు కీడు జరుగుతుందని బలహీనమనస్కులని బెదిరించే హక్కు మీకెవరిచ్చారండీ. నిజమో అబద్దమో తెలుసుకోకుండా పంచొద్దన్న దానిలో మీకు తప్పెందుకు కనిపిస్తోంది. నా యిష్టం వచ్చింది చూసుకోకుండానే పంపుతాను అనే దోరణిలో ఎందుకున్నారసలు. అదే రైటని ఇంకా ఎందుకు వాదిద్దామనిపిస్తోంది మీకు. మీరు ఇలానే ఇప్పటి వరకు దొరికిందల్లా పంపే పద్దతిలో వుంటే కనీసం ఇప్పటి నుంచీ సరిచూసుకోండి తప్పులేదు. రైటు అనిపించిన సమాచారాన్నే పోస్టు చేస్తూ వుండండి అంతవరకూ చెయ్యగలిగినా చాలు.
    ఇది నిజమే కాదో సరిచూసుకునే పద్దతులున్నాయని నేను చెప్పటంలో మీకు అంతగా గిట్టని విషయం ఏమి కనపడింది.

    రిప్లయితొలగించండి
  6. నాకు గిట్టని విషయం ఒక్కటి కూడా మీరు వ్రాయలేదు. ఈ రోజుల్లో స్వంతంగా తెల్సుకుంటే తప్పితే వినే వాళ్ళు ఎక్కడున్నారని మొదలు నేను చెప్పినది. మీరు అర్ధం చేసుకోలేదు. తరవాత... మీరు చివరగా పెట్టిన వ్యాఖ్యలోని నెట్ వర్క్ దురుపయోగం అన్నిటిలో ఉంటుంది. దానిబట్టి మొత్తంగా వాటిని తిట్ట వలసిన పని లేదని చెప్పాను. అన్నీ చెప్పి చేయించటం వలన సమర్ధత తగ్గుతుంది అని చెప్పాను. ప్రతిదానికి మంచి చెడు ఉంటుంది. తక్కువ ఉన్న చేడుకోసం ఎక్కువగా ఉన్న మంచిని కట్టడి చెయ్యలేము అని 99 శాతం లెక్కలు చెప్పాను. చెడు గురించి వ్రాసేవారు, చర్చించే వారు చెడుకి సపొర్టర్స్ కాదు.

    రిప్లయితొలగించండి
  7. ఇప్పుడింతకీ నాకేం చెప్పదల్చుకున్నారు ???

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి