దొంగలు ఎలా వుంటారు ?

పాత సినిమాలలో బాగా గుర్తు ఒక గళ్ళ లుంగీ, బుగ్గన చుక్క, మెడలో ఒక కర్చప్పూ పైగా మధ్య మధ్య వికటాట్టహాసం దొంగల్ని గుర్తుపట్టడం భలే సులభంగా వుండేది. ఇప్పుడేంటో ఒక్కడూ డస్సు కోడు కోడు మెయింటైన్ చేసి చావడు. డబ్బు కూడా రూపం మరిందనుకోండి బంగారు, వెండి నాణాల నుండి కాగితం ముక్కల నుండి కార్డుల్లోకి వచ్చేసింది డబ్బుకూడా ఎవడి పర్సైనా కొట్టేస్తే ప్లాస్టిక్ ముక్కలు దొరుకుతాయి కానీ రంగుకాగితాలు దొరికేలా లేదు.

ఇప్పుడు దొంగలు కూడా కొత్త టెక్నాలజీకీ అనుగుణంగా ఎదుగుతున్నారు. ( సో గ్రేట్ కదా :) )


మీరు పాస్ వర్డ్ల్ ల్లా, అంకెల్లా ఆన్ లైన్ సాగరంలో దాచుకున్న డబ్బుల్ని గాలాలో వలలో వేసి పట్టేందుకు రకరకాల టెక్నాలజీలను కనిపెట్టారు. దీన్నే ముద్దుగా ఫిషింగ్ అంటున్నాం.

పైన నేనిచ్చిన బొమ్మలో ఏకంగా జీ మెయిల్ మీ అకౌంట్ ని త్వరలో డీ యాక్లివేట్ చేయబోతోందంటూ బెదరగొట్టి వాడిచ్చిన లింకులో మిమ్మల్ని లాగిన్ come అంటాడు. మనం హడావిడిలో స్వీయ అకౌంట్ సంరక్షణా దురంధరులమై, శంకు చక్రాలను మర్చిపోయి మకరపు నోటిలో చిక్కిన గజేంద్రుడిని సంరక్షించేయాలన్నంత ఆతృతలో పరిగెత్తుకెళ్లి వాడి బుట్టలో దడాల్న పడిపోతాం. వాడికి నిజంగా కావలసింది కూడా అదే.

కొంచె ఆగండి పంపిన వాడెవడో వాడు క్రింద రాసిన పేరులో కాకుండా, పంపిన ఈ మెయిల్ లో చెక్ చేసి చూడండి. ఇలాంటివి చాలా పాత టెక్నిక్లే కావటంతో మీరు ఆ మెసెజ్ లోని వాక్యాలతో సెర్చ్ చేసినా ఇదే పేరుతో గతం లో రిజిష్టర్ అయ్యిన పిర్యాదులూ వాటికి సంభందించిన వివరణలూ వచ్చేస్తాయి.

ఆన్ లైన్ ప్రపంచంలో  కూడా జరభద్రం,
మెడలో గొలుసులు కొట్టేస్తారని తెలిసిన చోట్ల ఎంత భద్రంగా వుంటారో.
అంతకంటె కొంచెం భద్రంగా వుండాలి ఇలాంటి వాటికి స్పందించే ముందుకూడా.

ఈ విషయాన్ని మీ మిత్రులకు చెప్పటం మర్చిపోకండి.

కామెంట్‌లు