దోమలపై యుద్దానికి మరో మంచి పద్దతి


కావలసిన వస్తువులు

ఒక ఖాళీ ప్లాస్టిక్ సీసా
200 మి.లీ నీరు
50 గ్రాముల పంచదార
1 గ్రాము ఈస్టు (ఇది మార్కెట్లో దొరుకుతుంది)
జిగురు టేపు ఒకటి
అట్టముక్క లేదా కవర్

తయారు చేసే పద్దతి.

1. ప్లాస్టిక్ బాటిల్ ను పై బాగాన జాగ్రత్తగా బ్లేడు లాంటిది వాడి కత్తిరించండి.
2. పంచదార ను వేడి నీళ్ళలో కలిపి మొదట చల్లారనివ్వండి.
3. ఈ ద్రావణంలో ఒక్క గ్రాము ఈస్టు(yeast) ను జతచేయండి. మిక్స్ చేసేందుకు కలప వద్దు.ఈ ద్రావణం నుంచి కార్భన్ డై ఆక్సైడ్ వెలువడుతుంది. కార్భన్ డయాక్సైడ్ వాయువు ఆడదోమలను బాగా ఆకర్షిస్తుంది. నిజానికి మనుషులను కుట్టేది కేవలం ఆడదోమలు మాత్రమే. మగ దోమలు చెట్ల రసాలు పీల్చుకుని బ్రతుకుతాయి అవి మనుషులను కుట్టవు.
4. పైన బాటిల్ నుంచి కత్తిరించిన బాగాన్ని తలక్రిందులుగా తిప్పితే ఒక గరాటులా కన్పిస్తుంది. దాన్ని బాటిల్ లోపటికి వెళ్ళేలా పెడితే అది ఒన్ వే దారిలా తయారయ్యి దోమలను ట్రాప్ చేసేందుకు బాగా పనిచేస్తుంది. గట్టిగా వుండాలంటే దాన్ని ప్లాస్టర్ తో అంటించండి.
5. ఈ బాటిల్ కి చుట్టూతా కప్పివుంచేలా ఒక నల్లటి కాగితాన్ని కానీ అట్టముక్క లేదా కవర్ లాంటివి వాడి చుట్టూ మూసేయండి పై బాగాన్ని మాత్రం దోమల కోసం అలాగే వదిలేయండి. చీకటిగా వుండే మూలల్లో దాన్ని పెట్టండి. మీరందరూ కలిసి కూర్చునే ప్రదేశాలలో మరీ దగ్గరగా వుంచాల్సిన అవసరం లేదు.

దీనిలో పనిచేస్తున్న సూత్రం:
పంచదార ద్రావణం ఆహారంగా పనిచేస్తూ ఈస్టు సంతతి బ్రతికేందుకు దోహదం చేస్తుంది. ఈస్టు శ్వాసక్రియద్వారా విడుదల చేసే వాయువులు దోమలను ఆకర్షిస్తాయి. ఆ వాసనుక ఆకర్షితమై వచ్చిన దోమలు ఈ బాటిల్ ట్రాప్ లో చిక్కుకుని చనిపోతాయి.

( ఈ ద్రావణాన్ని రెండు వారాలకు ఒకసారి మార్చుతూ వుండాలి. దానివల్ల ఈ దోమల నిర్మూలనా కార్యక్రమం కొనసాగుతుంది.)



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి