కటసరాజ దేవాలయం (పాకిస్థాన్ లోని హిందూ దేవాలయం)



రెండు సంస్కృతులు విడిపోయేప్పుడు ప్రదేశాలని తరలించలేం. చారిత్రక ప్రసిద్ధి వున్న అపురూప సంపద భిన్నమైన సంస్కృతి వున్న ప్రాంతం లోనే మిగిలిపోతే.

ఇప్పుడు చెపుతున్న హిందూ దేవాలయం భారతదేశం విభజనకు గురయినపుడు పాకిస్థాన్ కి చెందింది. అది ఇప్పటి పాకిస్థాన్ లోని పంజాబురాష్ట్రానికి చెందిన చక్వాల్ జిల్లాలోని కటాస్ గ్రామంలో ఉన్నది. ఇది ఒక శివాలయం. దాయాది దేశంలో నిజానికి హిందు దేవాలయాలు వుండటం చాలా అరుదు. ఈ ఆలయం ఎంతో విశాలంగా అద్భుతంగా వుంటుందట. మరి దీని పరిరక్షన ఆదరణ ఎలావుందో మరి. ఇప్పటికైతే రక్షిత కట్టడంగా ప్రకటించబడలేదు.








ఈ ప్రదేశం గురించి వాడుకలో వున్న కథలివి

దక్షయజ్ఞసమయంలో, సతీదేవి ప్రయోప్రవేశం చేసినదన్న వార్త తెలిసినపుడు శివుని కంటి నుండి రెండు కన్నీటిబొట్లు రాలాయి. అవి భూమి మీద పడినపుడు, ఒకటి ఇక్కడి కటాసక్షేత్రంలోని అమృతకుండ్ తీర్థం గానూ, రెండవది భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని అజమేరు (అజ్మీర్)లోని పుష్కరరాజ్ తీర్థం గానూ మారాయి.

మరో కథ

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి
తర ఆరణి( త్రచ్చి నిప్పు పుట్టించెడి పుల్ల - అప్పట్లో అగ్గి పెట్టెలు, లైటర్లు లేవు కదా) లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడి మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృష్యవాణి పలికినది... ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. వీటినే, యక్షప్రశ్నలుగా  చెప్తారు. ఇది కటాసక్షేత్రంలోని అమృతకుండ్ వద్దనే జరిగింది.

యక్షప్రశ్నల ఘట్టం 


ఈ కాటస క్షేత్రం ఒకప్పుడు విశ్వవిద్యాలయంగా కూడా నిర్వహింపబడినదట దేశ విదేశాలకు చెందిన విద్వార్ధులు

ఇక్కడ చదువుకునేవారట. ప్రముఖ గణితజ్ఞుడు ఆల్బెరూనీ ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనం చేస్తూ, భూమి చుట్టుకొలతను లెక్కించాడు. అబూ రేహాన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ అల్-బెరూని జన్మతః పర్షియన్, హేతువాది, అవిసెన్నా మరియు అల్-హాజెన్ ల సమకాలికుడు, చరిత్రయేగాదు, తత్వము, బౌగోళికము చాలా లోతుగా తెలుసు, కానీ ఎక్కువగా ముస్లిం ఖగోళశాస్త్రాల ను "ఖానూన్ అల్-మసూదీ" క్షుణ్ణంగా వ్రాశాడు." "బెరూని, ఎన్నో శాస్త్రాలలో ఆరితేరినవాడు, - 'భాషా శాస్త్రం' నుండి 'లవణ శాస్త్రం' వరకూ, ఇతను మధ్యయుగపు ఉజ్బెకిస్తాన్ కు చెందిన సార్వత్రిక జ్ఞాని."
చంద్రునిపై ఒక క్రేటర్ కు ఇతని పేరుపెట్టారు.

1947 కాలంలో ఇక్కడి హిందువులందరూ భారతదేశంలోని పంజాబుకు వచ్చేశారు.

ఈ ప్రాంతం లోని సిమెంట్ తదితర పరిశ్రమల అత్యాసతో గొట్టాలతో పరిశ్రమల అవసరాల కోసం నీటిని పీల్చేసుకోవడమే కాక పంజాబ్ ప్రభుత్వం కూడా దీని చుట్టుపక్కల రెండు గ్రామాలకు(Choa Syedan Shah and Waula villages ఈ నీటినే అధికారికంగా సరఫరా చేస్తోంది. ఆ గ్రామాలకు ఈ నీరు తప్ప ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటంతో  ఈ సరస్సు లోనిన నీటి నిల్వలు అడుగంటి పోతున్నాయి 


ఈ దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని 2007 లోనే ప్రతిపాధనలను పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. 
ముషర్రఫ్ అధ్యక్షులుగా వున్న సమయంలో 2006-2007 సంవత్సరాలలో ఈ దేవాలయ పునురుద్దరణ కోసం కొంత ఖర్చు పెట్టారు. పర్యటక ప్రాంతంగానూ అభివృద్ధి చేసేందుకు కృషి చేసారు. కానీ ఇది నామమాత్రమనే చెప్పుకోవచ్చు. 

ప్రశ్నలు

ఇంతకీ శివాలయానికి కటస రాజ ఆలయం (కాటస రాజా ?) అని పేరేందుకు వచ్చింది?
దానికి అర్ధం ఏమిటి ? శివుడికే మరో పేరుగా అది వుందా?
బిర్లా టెంపుల్ లాగా ఈ ఆలయాన్ని కట్టించిన రాజు కటస రాజా? అయితే అతని చరిత్ర ఏమిటి

సమాధానాలు తెలిస్తే దయచేసి పంచుకోగలరు.... ముందస్తు ధన్యవాదాలతో


ఈ వ్యాసం కోసం క్రింది ఆధారాలను పరిశీలనలోకి తీసుకున్నాను.
http://www.pakistan-explorer.com/3/post/2012/04/post-title-click-and-type-to-edit.html
http://www.scoopweb.com/Katasraj_Temple
http://en.wikipedia.org/wiki/Katasraj_temple
Youtube documentaries
http://blog.travel-culture.com/2012/04/23/katas-raj-ponds-drying-up-due-to-water-supply/ ( నీటినిల్వల తరుగు దల పై కేంద్రీకరించిన వార్త)
తదితరాలు...


మూడు భాగాలుగా వున్న ఈ డాక్యుమెంటరీ లో చాలా వివరాలున్నాయి.

కామెంట్‌లు