ప్రపంచం ఎలా ముగిసిపోతుంది.
నిప్పుల కుంపటవ్వటం వల్లనా,
నీళ్ళు ముంచెత్తటం వల్లానా,
యుద్దం కమ్ముకోవడమా,
ప్రారభ్దం ముగిసి పోవడమా,
చాలా సూత్రీకరణలున్నాయి
అన్నీ చదవలేదు కానీ.
ఒక్కటైతే నాకు నిజం అన్పిస్తోంది.
అది
‘‘ స్నేహం ముగిసిపోవడం వల్ల ’’
ఖచ్చితంగా ప్రపంచమే చచ్చిపోతుంది.
అవును
మనుషుల మధ్య మనసుల మధ్యే కాదు.
అణువునీ అణువునీ కలిపుంచేది స్నేహం,
అణువులో ప్రతిభాగాన్నీ అట్టిపెట్టేదీ స్నేహమే.
మొక్కకీ మట్టీకీ,నీటికీ,ఎండకీ స్నేహం, ఖండలకవతలి నీటి చుక్కను,
ఆకుల నోటికందించే వరకూ చేతులు కలిపిన
అనంత శృంఖలం
గిరగిరా తిరిగే గ్రహగోళాల మధ్య ఉహకందని స్నేహం.
అన్నముద్ద నోటికి చేరేలోగా,
అడుగడుగునా చెమట చుక్కల స్నేహం.
అవును మనసుతో చూస్తే
మన చుట్టూ స్నేహమే
మన లోనా నిలిచుందీ నిలబెట్టేదీ స్నేహమే.
అందుకే మళ్లీ చెపుతున్నా
స్నేహామే లేనీ రోజున
ఏమీ లేనట్లే.
► 04-08-2013 ( అగష్టు నెల మొదటి ఆదివారం)
నిప్పుల కుంపటవ్వటం వల్లనా,
నీళ్ళు ముంచెత్తటం వల్లానా,
యుద్దం కమ్ముకోవడమా,
ప్రారభ్దం ముగిసి పోవడమా,
చాలా సూత్రీకరణలున్నాయి
అన్నీ చదవలేదు కానీ.
ఒక్కటైతే నాకు నిజం అన్పిస్తోంది.
అది
‘‘ స్నేహం ముగిసిపోవడం వల్ల ’’
ఖచ్చితంగా ప్రపంచమే చచ్చిపోతుంది.
అవును
మనుషుల మధ్య మనసుల మధ్యే కాదు.
అణువునీ అణువునీ కలిపుంచేది స్నేహం,
అణువులో ప్రతిభాగాన్నీ అట్టిపెట్టేదీ స్నేహమే.
మొక్కకీ మట్టీకీ,నీటికీ,ఎండకీ స్నేహం, ఖండలకవతలి నీటి చుక్కను,
ఆకుల నోటికందించే వరకూ చేతులు కలిపిన
అనంత శృంఖలం
గిరగిరా తిరిగే గ్రహగోళాల మధ్య ఉహకందని స్నేహం.
అన్నముద్ద నోటికి చేరేలోగా,
అడుగడుగునా చెమట చుక్కల స్నేహం.
అవును మనసుతో చూస్తే
మన చుట్టూ స్నేహమే
మన లోనా నిలిచుందీ నిలబెట్టేదీ స్నేహమే.
అందుకే మళ్లీ చెపుతున్నా
స్నేహామే లేనీ రోజున
ఏమీ లేనట్లే.
► 04-08-2013 ( అగష్టు నెల మొదటి ఆదివారం)
Superb!
రిప్లయితొలగించండిThank you Tarangini garu
రిప్లయితొలగించండి