కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ "చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా" అని ఒక సందర్భంలో అన్నారట.
బి.నాగిరెడ్డి - చక్రపాణి గార్లు కేవలం 6 వేల సర్క్యులేషన్ తో ప్రారంభించారు. ఇప్పుడు 6-7 లక్షల సర్క్యులేషన్ వుంది. చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు గారు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ, తరాలు మారినా పాఠకులను ఎంతో అలరించాయి. ఇప్పటికీ అప్పటి కథలు మళ్ళీ మళ్ళీ ప్రచురించబడి అలరిస్తూనే ఉన్నాయి.
(విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని) ఇది బిగినింగ్
(రాజుకు ఈవిధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు) తో ముగింపు.
మధ్యలో మంచి కథ
అసలు బేతాళ కథలు పాతిక మాత్రమేనని తెలిసినవారు చెబుతారు. చందమామలో వందల కొలది మామూలు కథలను బేతాళ కథలుగా ఎంతో నేర్పుతో(గా) మార్చి ప్రచురించారు. సాధారణమైన పిల్లల కథల్లోంచి, కథ చివర, ప్రతినెలా, ఒక చిక్కు ప్రశ్నను సృష్టించడం, దానికి చక్కటి సమాధానం చెప్పించడం, సామాన్య విషయం కాదు. అతి కష్టమైన ఈ పనిని, దశాబ్దాలపాటు నిరాఘాటంగా కొనసాగించారు
చందమామ ఒక్కో కాపీ విలువ ఎంత వుండేదో తెలుసా అప్పట్లో ?
1957లో దశాంక విధానం అమలులోకి వచ్చినతర్వాత రూపాయికి 100 నయాపైసలు (కొత్త పైసలు)గా నిర్ణయించారు.
బ్రిటిష్ పాలన సమయంలో మారక ద్రవ్య ప్రమాణం. ఒక రూపాయికి 16 అణాలు. ఒక అణాకు 6 పైసలు. అర్దణా అనగా మూడు పైసలు. ఈ పద్ధతి స్వరాజ్యం వచ్చాక కూడా కొనసాగింది.ఇప్పటికీ 25 పైసలను 'నాలుగు అణాలు' అనీ, 50 పైసలను 'ఎనిమిది అణాలు' అనీ వాడటం అనేక భాషల్లో కనబడుతుంది.
దమ్మిడీ(దమ్మిడీకి కొరగాడు అనేది నానుడి) ,పరక, బేడ (పదో పరకో ఇచ్చారని, పవాలా,బేడా సంపాదించుకున్నాడు) లను పూర్తిగా మర్చిపోయాం అప్పట్లా తెలుగు సామెతలు వాడే పద్దతెలాగూ లేదు కాబట్టి ఇప్పటి సంస్కృతి రేపటికి ఎలా ప్రవహిస్తుందో.
ఆ లెక్కలు ఇలా వుంటాయి.
1/12 అణా (అణాలో 12వ భాగం లేదా దమ్మిడీ)
1/4 అణా (అణాలో 4వ భాగం, కానీ లేదా పావు అణా)
1/2 అణా (అణాలో సగభాగం లేదా పరక)
అణా (6 పైసలు లేదా 1/16 రూపాయలు)
2 అణాలు (12 పైసలు లేదా బేడ)
1/4 రూపాయి (4 అణాలు లేదా పావలా)
1/2 రూపాయి (8 అణాలు లేదా అర్ధ రూపాయి)
లోపల పేజీలలో చూస్తే సంవత్సర చందా 5 రూపాయిలు అని వుంది. ఇది మాస పత్రిక కదా 12 సంచికలు 5 రూపాయిలు ఒక్కో సంచిక అర్ధ రూపాయికంటే తక్కువ సాలుసరిగా కొంటే ఆ రేటు. విడిప్రతి విలువ బహుశా అర్ధరూపాయి అంటే ఎనిమిది అణాలు అయ్యివుంటుంది. అంతే నంటారా?
పాత పుస్తకాలే అయినా చాలా విషయాలు చెపుతాయి
ఇప్పట్లా అమ్మాయిల బొమ్మలో, అర్ధంపర్ధంలేని హంగులో లేకుండా
సూటిగా సుత్తిలేకుండా వున్న వాణిజ్య ప్రకటనలు
ఇంగువ, కర్పూరాలు వాటి గుర్తులను కూడా బొమ్మల్లా వేయకుండా(అలా వెయ్యలంటే మళ్ళీ అచ్చు చేయించాలి,అక్షరాలను చేత్తో పేర్చుకునే ప్రింటింగ్ మిషన్లుమరి )
తాతయ్యల నాటి క్యూట్ ప్రకటన, మద్రాసు తయారి ఆంద్రాలో అమ్మకం కోసం( పుస్తకం కూడా మద్రాసులోనే ప్రింటయ్యేది)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి