చెమట చుక్కలు ఒక్కోక్కటే
నేలపై రాలి పడి గుండె తడిసేలా అభ్యర్ధించి.
అన్నాన్ని పళ్ళెంవరకూ పండించుకొస్తున్నాయి.
ఒక్క తలబిరుసు అలవాటు
నిర్లక్ష్యంగా, సిస్సిగ్గుగా,
చేతికందిన దాన్ని
పిడికిట్లో పట్టు లేకుండానే
మళ్ళీ మట్టిలోకి నెట్టేస్తోంది.
నోళ్ళకడ్డంగా పెట్టిన
నోట్ల కట్టలు
నిర్లక్ష్యపు హంగులతో
శ్రమను చెత్తబుట్టలోకి తొక్కేస్తున్నాయి.
నోళ్లు తెరిస్తేచాలదు.
కళ్ళు తెరవాలి.
► 14-09-2013
నేలపై రాలి పడి గుండె తడిసేలా అభ్యర్ధించి.
అన్నాన్ని పళ్ళెంవరకూ పండించుకొస్తున్నాయి.
ఒక్క తలబిరుసు అలవాటు
నిర్లక్ష్యంగా, సిస్సిగ్గుగా,
చేతికందిన దాన్ని
పిడికిట్లో పట్టు లేకుండానే
మళ్ళీ మట్టిలోకి నెట్టేస్తోంది.
నోళ్ళకడ్డంగా పెట్టిన
నోట్ల కట్టలు
నిర్లక్ష్యపు హంగులతో
శ్రమను చెత్తబుట్టలోకి తొక్కేస్తున్నాయి.
నోళ్లు తెరిస్తేచాలదు.
కళ్ళు తెరవాలి.
► 14-09-2013
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి