కొందరు
ఎవరో ఏదో భాషలో గీసిన చట్రాన్ని
కదలకుండా పట్టుకుని అచ్చుతీసుకుంటారు.
దానికి సుతారంగా తీగలూ, దారాలూ కట్టి
కదలకుండా పట్టుకుని అచ్చుతీసుకుంటారు.
దానికి సుతారంగా తీగలూ, దారాలూ కట్టి
పదాలను ఆ వరసలో కవాతు చేయిస్తారు.
ఇక గెలుసు యుద్ధంలో చట్రపు నమ్మకాన్ని కలవరిస్తుంటారు.
వెన్నుదానికే ఆన్చి నిటారుగా నిలబడదామని చూస్తుంటారు.
మరికొందరు
ఎక్కడో సంఘటన కొసలో
తళుక్కున మెరిసిన పదబంధాన్ని
అదాటున పట్టుకుని కపాలపు పెట్టెలో
పెట్టుకుంటారు.
భాషా వ్యాకరణ, శబ్దార్ధాలంకారాల సమ్మెట
దెబ్బలతో
అటూ ఇటూ సాగదీసి ఆకారాన్ని
ఆరోపిస్తుంటారు.
చివరికో పనిముట్టునో, సౌందర్యసాధనాన్నో
చేసేసాం
ఇదిగొమ్మంటూ చేతుల్లోనో చెవుల్లోనో
పడేస్తారు.
ఇంకొదరు
ఎవరిదో అలవోకగా వాడి ఆదమరచిన
ఓ అద్భుతాన్ని పొదివి పట్టుకుంటారు.
పలికే తమ పెదవే ప్రధమమని ముద్రపడేలా
దాన్ని వాడి వాడి వాడితగ్గేంత వరకూ
వదిలేయరు.
తామే దానికి పర్యాయపదమైనట్లు
గుండెల్నిండా గాలి పీలుస్తారు.
సిరాని నిరంతరం పనిలా కక్కే కలాలకంటే మెరుగే అయినా
అసలిదంతా ఎందుకు?
సిరాని నిరంతరం పనిలా కక్కే కలాలకంటే మెరుగే అయినా
అసలిదంతా ఎందుకు?
శ్వాస నీ జీవం అయినట్లు
మాట నీ భాషై బాసించినట్లు
అనుభవం అలాగే దృశ్యమై ఒదిగే
స్వచ్ఛమైన సొబగుని వదిలేస్తారసలెందుకు?
ఎండమావుల లోతులో ఊటలుంటాయని నమ్మి
ఊరాల్సిన జలాలకు ఊపిరి తీస్తావెందుకు?
నైపుణ్యాల పైనే సవారీ చెయ్యాలని
నైపుణ్యాల పైనే సవారీ చెయ్యాలని
ప్రతిభా మొలకల్ని చీకటి గదిలో
దాచేస్తావెందుకు?
నేలమాళిగకు బంగారు తాళం వేసినా చీకటిని రాకుండా చేయలేవు.
నేలమాళిగకు బంగారు తాళం వేసినా చీకటిని రాకుండా చేయలేవు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి