- సెప్టెంబర్ 12 ఫిరోజ్ గాంధీ పుట్టిన రోజు
- సెప్టెంబర్ 8 వారి వర్ధంతి
ఇవ్వాల్టి రాజకీయాలన్నీ గాంధీ కుటుంబం చుట్టూతనే తిరుగుతున్నాయి. మరి మహాత్ముడి నుంచి ఆ రెండక్షరాలనూ దత్తత తెచ్చి నెహ్రూ కుటుంబానికి దారాదత్తం చేసి ఇందిరా ప్రియదర్శినిని ఇందిరా గాంధీగా మార్చిన వ్యక్తిని కాంగ్రెస్ రాజకీయ చతురత కావాలనే ఎందుకు చరిత్రకు అందకుండా చేయాలని చూస్తోందో. ఈ తరం అల్లుడి మీద చూపుతున్న ఫోకస్ లో వందో వంతు కూడా ఆ తరం అల్లుడిపై ఎందుకు చూపరో. అవును ఈ రోజు మనం ఫిరోజ్ జహంగీర్ గాంధీ, జర్నలిస్టుగా, నిర్భీతిగల రాజకీయనాయకుడిగా మాత్రమే తన ప్రత్యేకతను చాటుకున్న నేత గురించి తలచుకుని స్పూర్తిపొందాల్సిన సందర్భం. 1912 సెప్టెంబర్ నెల 12 వ తారీఖున పార్శీకుటుంబాలో జహంగీర్ ఫారేదూన్, రతీమాయ్ లకు ఐదుగురి సంతానంలో చిన్న వాడిగా ఈయన బొంబాయిలోని తాజ్ ముల్ జీ నారిమన్ ఆసుపత్రిలో జన్మించారు.
1920లో వీరి తండ్రి మరణించాక తల్లితో కలిసి అలహబాద్ కి మకాం మార్చేశారు. అక్కడే తన
హైస్కూలు, డిగ్రీ చదువుల్ని పూర్తి చేశాడు. ఒకరోజు ఎండదెబ్బకు స్పృహ తప్పిన ఇందిర
తల్లి కమలా నెహ్రూ గారికి తక్షణమే స్పందించి సరైన సపర్యలుచేసి వారికి
ఆత్మీయుడయ్యారు. తర్వాత విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పి స్వాతంత్యోద్యమ
స్పూర్తితో 1930 లో కాంగ్రెస్ కు అనుభంధంగా ‘‘ వానర సేన’’ పేరుతో స్వాతంత్ర
పోరాట దళాన్ని ఏర్పటు చేశారు. అదే సమయంలో లాల్ బహదూర్ శాస్త్రిగారితో కలిసి
ఫైజాబాద్ జైల్లో పందొమ్మిది నెలలు కారాగార వాసం చేశారు. వివిధ ఉద్యమాలలో చురుకైన
పాత్రను పోషించి 1932-33 ప్రాంతంలో నెహ్రుగారికి అత్యంత సన్నిహితునిగా మసలారు.
అనారోగ్యం పాలైన
కమలా నెహ్రూ 1934 లో భోవాలిలోని టి.బి సనటోరియం ఆసుపత్రిలో చేరిన
నాటినుంచీ, 1936 లో ఆమె చనిపోయేంత వరకూ ఫిరోజ్ గాంధీ దగ్గరుండి తన సపర్యలను
అందిచారు. ఆ తర్వాతి కాలంలో కూడా స్వాతంత్రోద్యమ కార్యాచరణతో పాటు, కుటుంబ
సన్నిహితునిగా కూడా వస్తూ పోతూ వుండే ఫిరోజ్ ,ఇందిరలు ఒకరంటే ఒకరు
ఇష్టపడ్డారు.కానీ నెహ్రూకి ఈ వివాహం నచ్చక మహత్మా గాంధీని సలహ అడిగారు. అప్పుడే
నెహ్రూ తటపటాయింపుని పటాపంచలు చేసేందుకు తండ్రి గారిని కోల్పోయిన ఫిరోజ్ ని తన
దత్త పుత్రుడిగా తీసుకుంటానని అతడు అప్పటి నుంచి ఫిరోజ్ గాంధీగా పిలవబడతాడనీ
చెప్పి అలాగయితే సమ్మతమేనా అని నెహ్రూని ఒప్పింపి ఇందిరా, ఫిరోజ్ ల వివాహానికి
గాంధీ మార్గం చూపించారు. అందుకే రాజకీయ చతురత కలిగిన నెహ్రూ కుటుంబానికి,
ఉదాత్తమైన పేరుతో జనంలో చెరగని ముద్ర వేసుకున్న గాంధీ అనే మహత్తరమైన
రెండక్షరాలు వచ్చి చేరి. ఎంత మురికి వారు కావాలని పదే పదే అంటించుకున్నాసరే జనం
మనసులోంచి తుడిచివేయలేనంత బలంగా మార్చి, ఇవ్వాల్టికీ వారి వంశమే పాలకులుగా నిలబడి
వుండేలా చేసింది నిజానికి చిన్నదిగానే కనబడుతున్న ఈ సంఘటన.
గాంధీ కుటుంబం ? |
వివాహానంతరం ఇందిర, ఫిరోజ్ లకు 1944 లో రాజీవ్, 1946 లో సంజయ్ జన్మించారు. స్వాతంత్రం
వచ్చిన తర్వాత మామగారు ప్రధాని నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు మేనేజింగ్ డైరెక్టరుగా, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్
కు మొదటి ఛైర్మన్ గా ఫిరోజ్ పనిచేశారు.
లక్నో నుంచి నవజీవన్ పత్రికను నడిపించారు. కానీ తెల్లవాళ్ళను తరిమికొట్టడంలో వున్న
శ్రధ్ద మనల్ని మనం పరిపాలించుకోవడంలో లేకపోగా, ఎవరికి వారే తమ రాజకీయలబ్దికోసం అనే
రకాల అవినీతికి పాల్పడటం ఫిరోజ్ కి నచ్చలేదు. రాజకీయ చట్రంలో వ్యక్తిగా సాధారణ రాజకీయ విలేఖరి గానే తనను తాను
భావించుకుంటూ నెహ్రూ కుంభకోణాలను కూడా ఎండగట్టటమే కాదు 1951 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో
మామగారూ నెహ్రూకు వ్యతిరేకంగా రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచీ బరిలోకి దిగారు.
ఫిరోజ్ గాంధీ నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా గళమెత్తి వారి అవినీతి అక్రమాలను ముఖ్యంగా ఇన్యూరెన్స్ కుంభకోణాన్ని బయట పెట్టి దుమ్ముదులిపేశారు. దాంతో అప్పటి నెహ్రు మంత్రి వర్గంలో ఆర్ధిక మంత్రిగా పనిచేస్తున్న టి.టి కృష్ణమాచారి రాజీనామా కూడా చెయ్యాల్సి వచ్చింది. 1957 లో రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికయిన తర్వాత కూడా హరిదాస్ ముంద్రా కుంభకోణం గురించి ప్రపంచానికి తెలిసేలా చేసారు. బహుశా కుటుంబంలో దగ్గరగా గమనించిన ఒకవ్యక్తి ప్రజలకోణంలో కుంభకోణాలను బయటపెట్టకపోయి వుంటే అవి ఇప్పటికీ వెలుగు చూసేవి కావేమో. ఫిరోజ్ జాతియీ కరణ ఉద్యమాలలో కూడా ప్రధాన పాత్రపోషించారు. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ తో ఈ పోరాటం ప్రారంభించారు. టాటా ఇంజనీరింగ్ అండ్ లోకో మోటివ్ కంపెనీ ( టెల్కో) జపనీస్ రైల్వే ఇంజన్ల విషయంలో జపాన్ కంటే రెండింతలు ఎలా వసూలు చేస్తుందో ఆధారలతో సహా చూపించి దాన్ని ప్రభుత్వ పరం చేయాలని కోరారు. టాటా లు కూడా పార్సీలే కాబట్టి సహ పార్సీలమే అని ఫిరోజ్ పై విభిన్న కోణాలలో లాలూచీ లూ, వత్తిడులూ చేసినా చలించలేదు.

వ్యక్తిగతం జీవితంలో ఒకలాంటి ఒంటరి తనమే వీరిని వెంటాడేది. 1958 లో మొదటి సారి
గుండెపోటు వచ్చినపుడు ఇందిరా గాంధీ భూటాన్ పర్యటనలో వుంది. అయినా ఆమె ఎక్కవగా
ప్రధాన మంత్రీ నివాసం తీన్ మూర్తీ భవన్ లోనే వుండేవారట. 1960 లో రెండో సారి
గుండెపోటు వచ్చింది. ఢిల్లిలోని విల్లింగ్ డన్ ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేక
పోయింది. పుట్టిన నెల అయిన సెప్టెంబర్ లోనే 8 వ తారీఖున తన 48 ఎనిమిది సంవత్సరాల
వయసులోనే తనువు చాలించారు. తను తయారు చేసుకున్న కోట రాయ్ బరేలీ నియోజక వర్గం 1967
మరియు 1971 లో సహచరి ఇందిర కు ఇప్పుడు వారి కోడలు సోనియా గాంధీకి 2004 లోనూ 2009
లోనూ విజయాన్ని అందించిన అడ్డా అయ్యింది. అయినా సరే ఆయన్ను తలచుకోవాలంటే వంశపారంపర్య
నామజపం చేసే కాంగ్రెస్ లో చచ్చేంత హడల్ అదే కాంగ్రెస్ కల్చర్లో ఈయన కూడా వున్నట్లయితే
గత సంవత్సరమే శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిపించేసి వుందురు.
firoz gandhi gariki joharlu
రిప్లయితొలగించండిe post chusina tarvate firoz gandhi gari gurunchi telisindi
రిప్లయితొలగించండిoka kotta vishayam telusukunnanu