ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
కొన్ని పదాలు ముసుగేసుకొస్తాయి.
మరికొన్ని కత్తుల నెత్తుటి పెదాలకు
తేనె బిందువులు రాసుకొస్తాయి.
తళ తళ లాడుతూ మిలమిల మెరుస్తూ
భుజంపై చెయ్యేసి నీ మిత్రుడినే అంటాయి.
ఏ పదజాలం వెనుక ఏ అర్ధం మాటువేసిందో
కళ్ళూ, చెవుల్తోనే కాదు
మనసు విచ్చుకుని చూడనంత కాలం
మోహ పడుతుంటాం.
మోస పోతుంటాం
మధన పడుతుంటాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి