పదేపదే అదేనేను

పండుగ పూట కూడా పనివత్తిడితో పరుగెడుతున్నపుడు
వీధుల్లో ఆడుతున్న పిల్లలు అడ్డదిడ్డంగా విసుగెత్తించారు.
ఆఫీసు ముగిసాక ఆరామ్ సే తిరిగొచ్చేప్పుడు,
నవ్వుల సీతాకోకలై వాళ్ళే పలకరించారు.
తెలీని తేలికదనాన్నేదో అంటించారు.

పనుల పరుగులో ఈ వరుసలు
అక్షరాల కందిరీగలై బెదిరించాయి.
నెమ్మదినిండిన మరోకాలాన
ఇవే మాటలు రసాలూరే తేనెలై మురిపించాయి.

అదేనేను మరోమారు. అవేచోట్లు పలుమార్లు.
బయటిచూపుదేముంది, లోపటే కడుక్కోవాలిముందు.


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి