ఎక్ ఆఫ్టర్ మేకయిడెంటిటీలు

నాకు
నిజమంటే ఇష్టం కనీసం నిజమేననే ఆధారం దొరికినా సంతోషం.
స్నేహమంటేనూ ఇష్టం
కానీ క్రీనీడలతో కరచాలనమే కష్టం.
మాటలంటే ఇష్టం
మెమాటమైతే పర్లేదు మరీ మొహం లేకుంటేనే కష్టం

నీడలతో స్నేహం
గుడ్డుగా కాదు గుడ్డిగా వుంది...
గాలిలో ఊహల గాలం
గాయమే కాని గేయమై ఎలా మురిపిస్తుంది?

అర్ధం అయ్యిందనుకుంటాను..
నీకిలా దోబూచులాడటం ఇష్టమయితే నేనెందుకు అభ్యంతరపెడతాను?
నేనే కలిసి ఆడలేనంటానంతే.

వినిపించిందనుకుంటాను
నిశీధిగీతాలకు ప్రచలితుడి కవాట్లేదని,
నిన్నాపమనో ఆగమనో అనకున్నా
నా రణగొణ గుడుగుడు గుంచంలో నే నడిచిపోతాను.

ఏమో ఎక్కడో ఒక నిజమైన హృదయం
రక్తన్ని నింపుకుని కొట్టుకుంటుందేమో నన్న అనుమానంతో
మళ్ళీ ఇదంతా రాస్తుంటాను.
ఎందుకంటే
నాకు నిజంగానే నిజమంటే ఇష్టం.

► ఒకానొక నాన్ సీరియస్ వచనం.
03-10-2013

కామెంట్‌లు