రోటి టైం : అప్పడాల కర్ర తిరగేస్తారా?

ఈ మధ్య తీయని భాదల నేపద్యంలోనో, కొవ్వుని కరిగించే కార్యక్రమంలోనో రోటీకి బాగానే డిమాండ్ పెరిగింది. తినడానికేం భేషుగ్గా వుంటుంది. అసలు రోటీలో నంజుకునేందుకు కూరలు చెయ్యాలా? కూరలు తినేందుకు నంజుగా రోటీ వండుకుంటామా ? అనే భేతాళ ప్రశ్నకు సమాధానం వెతికే విక్రమార్కుడే దొరకలేదట.


ఆట పింటని పిలుచుకునే గోధుమపిండి, లేదా మరికొన్ని పిండ్లతో కలిసిన పిండిని నీళ్ళనుకావలసినంతే కలిపి చేతివేళ్ళకు కావలసినంత ఎక్సర్ సైజ్ చేయించి,  దెబ్బలూ, మొట్టికాయలూ, పిడిగుద్దులూ, కసితీరా వేసేది. అప్పుడిక అప్పడాల కర్ర అందుకుంటే నా సామిరంగా సాఫయి పోవాల్సిందే కదా. ఇక వీటికోసం ఎన్ని రకాల పీఠలూ, ఎన్నెన్ని రకాల కర్రలు. క్రిందనో పైననో అంటుకోకుండా నొక్కగానే సరిపోదు దానికి అందమైన ఆకారం రావాల్సిందే. పైగా రౌండు గుండ్రమయితేనే ప్లేటుకి సరిపోనూ సరిగ్గా అమర్చేందుకు బావుంటుంది.

ఇక పెనం బాధలుచెప్పేదేముంది. ఆయిల్ తక్కువ వేయాలి. మాడిపోకూడదు. రోటీలూ, పుల్కాలూ, చపాతీలూ, చుక్కారోటీలూ, నాన్ లు, బటర్ నాన్ లు, పరాటా, పూరీ, ఆలూ స్పెషల్ పూరీ భారతీయ బ్రెడ్డుకు కావలసినన్ని రూపాలు.

ఇక జోన్ పిండి రొట్టెలైతే పీటలూ, కర్రలూ ఏంలేకుండా చేతులతోనే సమానంగా నైపుణ్యంతో వత్తేస్తారు. రుమాల్ రోటీ తినటం కంటే అది చేసేప్పుడు చూడటమే వింతగా వుంటుంది. సర్వపిండి రొట్టెలు పప్పుబద్దలతో హట్ హాట్ గా తెలంగాణాకి ఫేవరెట్,

సరే కానీ ఇంతకీ విషయం ఏంటంటే వీటిని పెద్దమొత్తంలో చేయడానికీ, సులభంగా చేసుకోవడానికీ చాలా రకాల యాంత్రిక పద్దతులొచ్చాయి. సరదాగా కొన్ని చూస్తారా మరి.

పిండి, నీళ్లూ వగైరా వేసేసి ఎన్ని రోటీలు కావలి? ఎంతమందంతో కావాలి లాంటి వివరాలు ఫీడ్ చేసి మనం డైనింగ్ టేబుల్ అమర్చుకునే లోగా నిమిషానికొకటి చొప్పున జిరాక్స్ మెషిన్లోంచి పేపర్లు పడ్డట్లు ప్లేటులోకి వచ్చేస్తున్నాయి. 




న్యూస్ పేపరు అచ్చుకోసం వెళ్ళినట్లు దుప్పటి లాగా, ద్రౌపతికి కృష్ణుడు ప్రసాదిస్తున్న కోకలాగా ఓ క్రమంలో వస్తున్న రోటీ బెల్టుని చక్కని గుండ్రని ఆకారంలో కత్తిరించటం, అదే వరుసలో వాటిని వేడిచేయటం బెల్టు చివరికెళ్ళేసరికి తయారైన రోటీలను కుప్పలుగా వచ్చేస్తుంటే ప్యాక్ చేసుకోవడం... బహుశా కటింగ్ లో మిగిలిన పిండి ముక్కల్ని మళ్లీ రౌండ్ లో కలుపుతారేమో.



కొద్దిగా మనుషుల అవసరం ఎక్కువ కావలసిన రొట్టలు తయారు చేసే మినీ పరికరం.
పిండి వృధాకావడం లేదు. యాంత్రిక శక్తికూడా మరీ ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు.


సరే మీరు ఓపిగ్గా రోటీ మేకింగ్ మెషిన్ల కోసం వాటి వివరాల కోసం వెతుక్కుంటే చాలా దొరుకుతాయి.
చివరిగా ప్రపంచంలోనే పెద్ద రోటీ ఎలా తయారు చేసారో చూడండి. మనం రుమాల్ రోటీ అన్నట్లే దీనికి కూడా పేరుపెట్టాలంటే లుంగీ రోటీనో, పంచె రోటీ అనో పెట్టాలేమో.. చూడండి చేతులతోనే సాగదీసి ఎంతబాగా ఆరేస్తున్నాడో




కామెంట్‌లు