అమ్మలాంటి మాట

వయసుకి చెల్లివో
వరుసకు బిడ్డవో
ఏమైనా అవుతావో, అసలేమీ కావో
అన్నం తినమన్న వేళ
నువ్వూ నా బిడ్డతో సమానమే అన్నావ్ చూడు.
ఆక్షణం నిజంగానే
అమ్మను గుర్తుకు తెచ్చావు.

విలువల తడితగలక
దాహంతో తిరుగుతున్నవేళ
మనసుని తడిపి
కళ్ళగుండా ప్రవహించావు.
నిర్మలమైన మనసులు
మన తరంలోనూ వున్నాయని
ప్రవాహంలో కొట్టుకుపోతున్నవేళ ఆధారంలా భరోసానిచ్చావు.
మళ్ళీ జన్మలుంటాయో లేదో కానీ
నీ కడుపున పుట్టినా తీరనంత రుణం మోపేస్తావు.

https://www.facebook.com/groups/kavisangamam/permalink/633038076748948/

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి