మేల్ కొలుపు : మగవాళ్ళ దినోత్సవం


నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో – 2012 అధికారిక నివేదిక ప్రకారం  వివాహితులైన పురుషులలో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 63,343 ఇది వివాహితులైన స్త్రీల ఆత్మహత్యలు (31,921) కంటే రెట్టింపుగా వుంది. వేరుపడిన పురుషులలో 2043 మంది ఆత్మహత్యలకు  పాల్పడ్డారట మహిళలలో ఈ సంఖ్య 1240 గావుంది. తమ కుటుంబంలోని కలహాల వల్ల జీవితాలను చాలించిన మగవాళ్ళ సంఖ్య 7541 గా వుంది. ఇలా వత్తిడికి లోనవుతున్న వర్గంలో మగవాళ్లు కూడా వున్నారు గమనించండంటూ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మరీ ‘మేల్’ తలపెట్టాలని కోరుతున్నారు. వృత్తి పరమైన వత్తిడులూ, కుటుంబం తాలూకూ భాద్యతలతో పాటూ ఈ మధ్య సమాజమూ, మీడియా దృష్టిలో దోపిడీ వర్గంలాంటి కోణం లోకి నెట్టివేయబడటమూ జరుగుతోందనేది కూడా వీరి ప్రధాన వాదన మార్చి 8 అంతర్జాతియ మహిళాదినోత్సవం సంతోషమే. మరి మగాళ్ళకు మీకెందుకు దినోత్సవం అంటూ మహిళా సంఘాలు విరుచుకుపడాల్సిన అవసరం ఏమిటనేదీ ప్రశ్నే?

ఇదేమీ ఒక్క దేశపు సమస్య కాదు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
 (International Men's Day) ప్రతి సంవత్సరం నవంబరు 19 తేదీన జరుగుతోంది. ఇది ఐక్య రాజ్య సమితి (United Nations) ఆమోదంతో మొదటగా ట్రినిడాడ్ మరియు టొబాగో లో 1999 లో ప్రారంభించబడినది. బాలుర పురుషుల ఆరోగ్యం పై శ్రధ్దపెంచడం. జెండర్ రిలేషన్స్ ని మెరుగుపరచడం. ఆదర్శవంతమైన రోల్ మోడల్ గా వున్న మగవాళ్ళను ముందుకు తీసుకురావడం తద్వారా కూడా వ్యక్తులలో అలముకుంటున్న చీకటి ప్రవృత్తులను తగ్గించేందుకు ప్రయత్నించడం. దోషాలను ఆపదిస్తూ ఏర్పడుతున్న, ఏర్పడిన ప్రతికూల వివక్షనుండీ నిజాల కోణాన్ని చూపించడం.లాంటి ప్రధాన లక్ష్యాలను దృష్టిలో వుంచికుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవస్థలోని ఏదో స్వార్ధపూరిత అస్తవ్యస్థత అన్నివైపులా తినేయాలని చూస్తున్నప్పుడు. కనీసం బాధ పడేవాళ్ళన్నా ఆ విషయాన్ని గమనించాలి. మగాడంటే మృగాడే ననే నేటి మారిపోయిన పరిస్థితులలో మీడియా సైతం వార్తాంశంగా తీసుకునేందుకు జంకుతున్నట్లుంది. నిజానికి అమ్మా, నాన్నా ఇద్దరూ సక్రమంగా వుంటేనే కుటుంబం సంతోషంగా వుంటుంది. సమాజం నడిచేందుకు కూడా స్ర్తీ,పురుషులిద్దరూ సమానంగానే కావాలి. 






కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి