►నాగులు, గరుడులు, వానరులు, రాక్షసులు, అసు రులు వీరందరూ వేరువేరు జాతుల వారంటారు మనుష్యశాస్త్ర జ్ఞులు.
► భారతదేశంలో నాగులు చాలా చోట్ల ఉన్నట్లు తెలుస్తుంది. అస్సాం దక్షిణభాగంలో ఉన్న నాగాయ్ కొండలలో ఇప్పటికీ నాగ జాతివారు కొందరు ఉన్నారట. వారు అనా గరికులు.కాశ్మీరదేశంలో అనాది కాలం నుంచీ నాగులుంటూ వచ్చినట్లుగా గాథలున్నాయి కాని ఆ జాతివారు లేరు. అక్కడ ఒకచోటే కాదు, మన ప్రాంతాలలో అనేక ప్రాంతాల నాగులుండే వారని తెలుస్తున్నది.
► ఆంధ్రులు నాగజాతి వారంటారు. కృష్ణా నది దక్షిణ తీరాన నాగజాతి వారుండేవారని బౌద్ధ గ్రంథాల వల్ల తెలుస్తుంది.
► ఎట్లా వచ్చిందో తెలియదు కానీ వేశ్యా సమూహానికి తెలుగులో నాగవాసమంటారు. నాగవాస మన్నది సంస్కృత సమాసము. మరి దీనికి సంస్కృతంలో వేశ్యా సమూహమనే అర్థం ఉన్నట్లు తోచదు.
►బౌద్ధ ధర్మమంటే నాగులకెక్కువ అనురక్తి. బౌద్ధాన్ని ఎక్కువగా ఆచరించి, అవలంచిన వారు నాగులు. వారు బుద్ధునికి పరమ భక్తులు. బౌద్ధ వాఙ్మయంలో నాగులకు సం బంధించిన గాథలు చాలా ఉన్నాయి. ఏలాపత్రనాగుడు, ముచిళింద నాగుడు మొద లైన వారు బౌద్ధ గాథలలో ప్రసిద్ధులు. ఏలాపత్రనాగునికి ఏరపత్ర నాగుడని నామాంతరమున్నది.
► దిక్కులను పాలించే లోకపాల కులకు నాగులకు కూడా సంబంధ మున్నట్లు కనప డుతుంది. విరూ పాక్షుడనే నాగరాజు తూర్పుదిక్కుకు పాల కడునీ, ఏలాపత్రుడు పడమటి దిక్కుకు పాలకుడనీ బౌద్ధుల విశ్వాసం.
► అమరావతి, నాగార్జున కొండ బౌద్ధ శిల్పా లలో ఎక్కడ చూసినా నాగరాజులు, నాగినుల, నాగముల చిత్రాలే. శిల్పంలో ప్రాచీనాంధ్ర శిల్పులు నాగులను కటి ప్రదేశం నుంచి పై భాగమంతా మనిషిరూపంలోనూ నాగముల క్రిందిభాగమంతా సర్పరూపంలోనూ చెక్కారు. నాగరాజు చిత్రాలకు తలమీద అయిదు పడ గలు ఉంటాయి. నాగినికి ఒక్కటే పడగ. అద యినా నాగకన్యక అని తెలియడానికే ఏమో! ఈ విధంగా సగం మనిషి సగం సర్పరూపంలో కాకుండా కేవలం మహాసర్ప రూపంలో చెక్కిన చిత్రాలు కూడా లేకపోలేదు.
►మనదేశంలో నాగపూజ అధికం. నాగప్రతి మలు చెక్కిన శిలలు సాధారణంగా ప్రతి చోటా కనపడుతాయి. వీటిని నాగ శిలలనీ, నాగకల్లు లనీ అంటారు. పుట్టిన బిడ్డలు చనిపోతూ ఉంటే సంతానం నిలవడానికి నాగప్రతిష్ఠచేసి ఆరాధించడం కద్దు. పూర్వీకుల నుండీ నాగదేవతను ఆరాధించేవారని ఆధారాలు తెలుపుతున్నాయి. నాగములను శిలలపై చెక్కి ఆరాధించడం ఒక ఆచారం.
► ఆంధ్రవిశ్వకళా పరిషత్ చిహ్నం మీద నాగముద్ర ఉంది.
నాగులచవితికి యోగ సంబంధమైన ఒక వివరణ
.........................................................
ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని కూడా ఒక ప్రచారం లోని కథ
చలిప్రవేశించు నాగుల చవితినాడు
మెరయు వేసవి రథసప్తమిగా దివసమున
అచ్చ సీతు ప్రవేశించు బెచ్చుపెరిగి
మార్గశిర పాషమాసాల మధ్యవేళ
----------------> సురవరం ప్రతాపరెడ్డి ))))
మలేషియాలోని పెనాంగ్‌లో 1850లో పాములకు ఆలయం నిర్మించారు.
ఇక్కడ పాములు వీరవిహారం చేస్తాయి. ఎవరినీ ఏమీ చేయకపోవడం విశేషం. బౌద్ధమత ప్రవక్త ఈ ఆలయ నిర్మాణం చేశారు. చిత్రమేమంటే పరిసరాల్లో ఆలయాలున్నా వాటిలో పాము కన్పించదు. కేవలం ఇక్కడే దర్శనమిస్తాయి. ఈ ఆలయం బేయాన్ లెపాస్ విమానాశ్రయానికి దగ్గరలోని సంగైక్లువాంగ్‌లో వుంది. ప్రాచీన కాలంలో డేవిడ్ బ్రౌన్, అనే బ్రిటిష్ వాసికి తీవ్రవ్యాధి నుండి బాధపడుతూ, ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే రోగనివారణ జరిగిన కారణంగా బౌద్ధమత బోధకునికి ఆర్థిక సహాయం చేసి ఆలయాభివృద్ధికి కృషి చేశాడట.
> శివుడికి సర్పం అలంకారప్రియం.
> విష్ణువుకి తల్పం, మంధర పర్వతాన్ని చిలికేప్పుడు తాడు
> కాశ్మీర రాజులు తాము కర్కోటక నాగరాజు సంతతియనీ, నాగపూర్ రాజు పుండరీకుడని విశ్వసిస్తారు.
> సర్పాధి దేవత మానసాదేవి నాలుగు చేతులలోనూ నాలుగు పాములు, పాముల చుట్టు చుట్టుకొనివుండే వాటిమీద ఆసీను రాలైవుంటుంది.
> పాముల్లో పన్నెండు రకాలున్నాయట. అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, కర్కోటక, అశ్వతర, దృతరాష్ట్ర, శంఖపాల, కాళీయ, తక్షక, పింగళ.
> సృష్టి, జ్యోతిశ్శాస్త్ర, గోచార విషయాలకు సంబంధింత మైనదిగా సీక్రెట్ డాక్ట్రయిన్‌లో హెచ్.పి. బ్లావెట్‌స్కీ విశదీకరించారు.
> కుండలినీ శక్తికి మరోపేరు స్పీరిమాగా గ్రీకులు వ్యవహరిస్తారు.
> యోగ విద్యలో కుండలినీ శక్తి సర్పంలా ముడివలె చుట్టుముట్టి సహస్రల వారకూ శరవేగంగా పోతుంది. పుట్ట మానవ శరీరానికి ప్రతీకం. మానవ శరీరంలో పాము నిద్రావస్తలో వుంటే, దానిని యోగ సాధన ద్వారా జాగ్రదావస్తలోకి తీసుకువెళ్ళెదరు. అంటే విషం హరిస్తుంది. ఆత్మజ్ఞానం కలుగుతుంది.మూలాధారం నుండి సహస్రారం వరకు వెన్నెముక (బ్రహ్మదండి) సర్పకారంగా సుఘమ్మానాడిని ఉత్తేజితం చేయడమే నాగపూజ ప్రధానోద్దేశం.
నాగోబా జాతర
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా దేవాలయంలో ప్రతియేటా పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి జాతర ప్రారంభమవుతుంది. జిల్లాలోని గిరిజనులతోపాటు వరంగ ల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల వారే కా కుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్టల్ర నుంచి తరలివస్తారు. గంగాజలం కోసం కా లినడకన వెళ్లిన మెస్రం వంశీయులు శనివారం ఇంద్రవెల్లికి చేరుకుని ఇంద్రాయి వద్ద పూజలు నిర్వహించడంతో సంబరాలు ఆరంభమయ్యా యి. అదే రోజు కేస్లాపూర్ చేరుకుని నాగోబా ఆల య సమీపంలోని మర్రిచెట్ల(వడమర) వద్ద విడిది చేస్తున్నారు. ఈ నెల రెండున ప్రారంభమ య్యే జాతర 13న ముగుస్తుంది. వివిధ ప్రాంతా ల గిరిజనులు జాతరకు తరలి వస్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
పూజలు ఇలా... జాతర ప్రారంభానికి ముందు మెస్రం వంశీయు లు జన్నారం మండలం కలమడుగు గోదావరి రేవులోని అస్తలమడుగు(అత్తలమడుగు) నుంచి కాలినడకన గంగాజలం తీసుకొస్తారు. ఇంద్రవెల్లిలోని ఇంద్రాయిదేవికి ప్రత్యేక పూజల అనంతరం కేస్లాపూర్ చేరుకుంటారు. నాగోబా ఆలయానికి సమీపంలో ఉన్న మర్రిచెట్ల(వడమర) వద్ద విడిది చేస్తారు. ఆ సమయంలో గంగాజలం ఉన్న కల శం కింద పెట్టకుండా చెట్టు కొమ్మకు కట్టి ఉంచుతారు. పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు. ఆల యంలో ఏడు పుట్టలు తయారు చేసి నవధాన్యాలు, ఆవుపాలు, నైవేద్యంగా సమర్పిస్తారు.
సిరికొండ నుంచి కుండలు.. ఇచ్చోడ మండలం సిరికొండలో ప్రత్యేకంగా త యారు చేసిన 116 మట్టికుండలను పూజల కో సం తీసుకొస్తారు. పూజల అనంతరం మెస్రం ఆ డపడుచులు వడమర సమీపంలోని బావి నుంచి వాటిలో నీటిని ఆలయానికి తెస్తారు. గత ఏడాది నిర్మించిన మట్టిపుట్టలను తొలగించి వాటి స్థానం లో ఆవుపేడ, జలంతో మట్టి పుట్టలు నిర్మించి కొలుస్తారు. అనంతరం కిక్రీ, డోలు తదితర వాయిద్యాలతో పెద్దలు కచేరీలు నిర్వహిస్తారు.
మెస్రం వంశీయులే కటోడాలు.. మెస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మెస్రం వంశీ యుల కిందికి వస్తారు. మడావి, మర్సుకొల, పు ర్క, మెస్రం, వెడ్మ, పంద్రా, ఉర్వేత ఇంటిపేర్లు గ లవారు మెస్రం వంశీయులు. వీరే కటోడా(పూజారులు)లుగా వ్యవహరిస్తారు. పూజారులను మూ డేళ్లకోసారి మార్చడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వారు కొత్వాల్, మెస్రం వంశంలో 22 తెగల వారిని పేరు పేరున స్మరించుకుంటారు.
గోవడ నుంచి పూజలు నాగోబాకు పూజలు నిర్వహించే మెస్రం వంశీ యులు ఆలయం వద్ద ఉన్న గోవడ(గుండ్రంగా గోడ కట్టి ఉండే ప్రాంతం)లోనే విడిది చేస్తారు. ఈ గోవడలో 22 కిత్తలతో విడిది చేసి నాగోబా జాతర ముగిసే వరకు పూజలు నిర్వహిస్తారు.
జాతరలో బేటింగ్... మెస్రం వంశంలో పెళ్లిళ్లు జరగ్గానే ఇంటికి వచ్చే కోడళ్లను వెంటనే వంశస్తురాలుగా గుర్తించరు. నాగోబా సమక్షంలో బేటింగ్ నిర్వహించాకే వారి వంశపు కోడళ్లుగా గుర్తింపు ఇస్తారు. ఇందుకోసం ప్రతి ఏడాది నాగోబా పూజల అనంతరం ఆలయంలో బేటి(బేటింగ్) నిర్వహిస్తారు. ఆలయంలో తయారు చేసిన పుట్ట వద్ద నూతన దంపతులతో ప్రత్యేక పూజలు జరిపిస్తారు. నాగోబా దర్శనం అనంతరం మెస్రం వంశంలోని కుల పెద్ద భార్య కోడళ్లను వంశస్తులకు పరిచయం(బేటి) చేయిస్తారు. అప్పటి నుంచి వారిని మెస్రం వంశం కోడళ్లుగా గుర్తిస్తారు.
నాగోబా చరిత్ర పూర్వకాలంలో మెస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పరూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్ప రూపంలోని నాగేంద్రుడికి తల్లి తన తమ్ముడి కూతురైన గౌరితో వివాహం జరిపిస్తుంది. అత్త ఆజ్ఞ మేరకు గౌరి తన భర్త నాగేం ద్రున్ని బుట్టలో పెట్టుకొని గోదావరికి వెళ్తుంది. సర్పం ఓ చోట ఉడుం రూపంలో కనిపించడంతో అక్కడ ఉడుంపూర్ ఏర్పడింది.
ఆ తర్వాత గౌరి గోదావరి నదిలో స్నానానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారడాని.. అయితే పేరు ప్రతిష్టలు కావాలో సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్క చేయకపోవడంతో తిరిగి నాగేంద్రుడు పాము రూపంలోకి మారడానే కథ ప్రచారంలో ఉంది. నాగేంద్రుడి కోసం ఉడుంపూర్ నుంచి గరిమ్మెల వరకు వెతికిన గౌరి గోదావరిలోని సత్యవతి గుండంలో కలిసిపోయిందని, ఆమె వెంట నాగేంద్రుడు ఉంచిన ఎద్దు రాయిగా మారిందని పెద్దలు చెబుతుంటారు. ఆ తరువాత పెళ్లి అయిన ప్రతి జంటకు నాగేంద్రుని సన్నిధిలో పరిచయం(బేటి) చేయాలని చెప్పి నాగేంద్రుడు కేస్లాపూర్ గుట్టలోకి వెళ్లిపోవడంతో అక్కడ నాగోబా వెలిసిందని ప్రచారంలో ఉంది.

హిమాలయ ప్రాంతంలో నాగా సాధువులు ఇంకా ఉన్నారు.
రిప్లయితొలగించండిప్రయాగలో కుంభమేళా జరిగినప్పుడు వాళ్ళు నగ్నంగా వస్తారు.