సదర్ ప్రదర్శనను ఆసక్తిగా చూస్తున్న జనం |
ఏంటీ పండుగ?
సదర్ పండుగ ప్రధానంగా పశువులకు ఇంకా చెప్పాలంటే దున్నపోతులకు సంభందించినది.
ఎప్పుడు జరుగుతుంది?
ఇది దీపావళి మరుసటిరోజు
సదర్(सादर ) అనే పదం హిందీ నిఘంటువు ప్రకారం ‘‘ RESPECTFULLY ’’ అనే అర్ధంలో ఉపయోగించారు. అంటే గౌరవసూచకంగా ప్రదర్శించడం, గౌరవించడం అనే అర్ధంలో వాడి వుంటారనుకోవచ్చా.
सदृश होना {sadaRash hona} అంటే TAKE AFTER అనే అర్దం వుంది.
सादृश {sadaRash} అంటే వున్న AGREEMENT అనే అర్ధమూ
सादृश्य {sadaRashy} అంటే వున్న APPROXIMATION అనే లాంటి అర్ధం కూడా ఈ పండుగ విధానానికి దగ్గరగానే వున్నాయి. ముస్లింల పాలనలో వున్న తెలంగాణా ప్రాంతానికి సంభందించిన పండుగ పేరు వెనకున్న అర్ధం కాబట్టి హిందీ ఉర్దూ మాటల నుండి ప్రయత్నించటంలో తప్పులేదను కుంటాను.
Etymology ప్రకారం పరిశీలిస్తే
Hindi లో వాడుకలో వున్న ఈ పదాలలో sar అనేది Persian మూలంలోని అర్ధాన్ని తీసుకుంటే head అని dar అంటే holder అని తెలుస్తుంది. ఈ ఉత్సవంలో ప్రధానంగా తలను ఒడుపుగా పట్టుకుని దున్నపోతును వెనుక రెండు కాళ్లపై నిలుచునే లా చేస్తారు కాబట్టి కూడా సదర్ అని వుంటారని అనుకోవచ్చు.
ఎవరు చేస్తారు?
యాదవులకు ఇది ప్రధాన పండుగ, తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా నిర్వహిస్తారు. తమ ఉనికికి ప్రతీకగా ఈ పండుగను నిర్వహించుకుంటున్నామని యాదవులు తెలియజేస్తారు.
పూర్వ చరిత్ర ఏమిటి?గంగిరెద్దుల ఆటకు దగ్గరగా అనిపించే ఈ సదర్ ఉత్పవాన్నిపాతబస్తీలోని సైదాబాద్‌లో జరిగే యాదవ సదర్ వేడుకలను స్వయంగా నిజాం నవాబు స్వయంగా వీక్షించి ప్రోత్సహించేవారట.
పండుగ సందర్భంగా ఏం చేస్తారు?
తమ దున్నపోతులను చూడ ముచ్చటగా సింగారించి... రాజదర్పంతో అలంకరిస్తారు. అలంకరణ కోసం మంచి
పువ్వుల దండలు వేస్తారు, కొమ్ములకు రంగులు వేస్తారు. శరీరంపై కూడా రంగులతో రకరకాలుగా అలంకరిస్తారు.సాంప్రదాయ సొబగులు అద్దుతారు. పూలదండలు, రంగులు, నెమలి ఈకలు, ఫించాలతో రమణీయంగా తయారు చేస్తారు. ఇలా అలంకరించిన దున్నపోతులను వీధులగుండా ఊరేగింపుగా తీసుకెళతారు. గుంపుల్లో రకరకాల వాయిద్యాలు వాయిస్తారు. ప్రధానంగా మంచి హుషారిచ్చే తీన్ మార్ దెబ్బలకు జనం చిందేస్తుంటారు. అంతే కాకుండా ఈ జంతువులతో విన్యాసాలు చేయిస్తారు. ప్రధానంగా వాటిని వెనుక కాళ్ళపై నిలబడేలా చేస్తారు. వాటి ముట్టె బాగంలో ఒడుపుగా పట్టుకోవడం ద్వారా ఈ విన్యాసాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఇలా చక్కటి విన్యాసాలు చేయించిన వారికి ప్రత్యేకంగా బహుమతులను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏ దున్నపోతైతే ఎక్కువ ఎత్తుకు తన ముందుకాళ్ళను లేపుతుందో ఆ దున్నపోతుకు బహుమతి ప్రధానం చేస్తారు. దీనినుంచి బలమైన, నాణ్యతగల మన్నికైన దున్నలను ప్రదర్శిస్తారన్నమాట
సదర్ ప్రదర్శనలో భాగంగా దున్నతో విన్యాసం |
ఉపయోగం ఏమిటి?
యాదవుల ఐక్యతకు, అస్తత్వానికీ ప్రతీకగా ఈ పండుగను చెపుతారు. పశువుల ఎడల తమకున్న శ్రధ్దను, వాటి పెంపకంలో తాము తీసుకున్న జాగ్రత్తలను తెలియజేయటం ద్వారా పశుసంపద పెంపొందించుకోవాలనే ఉత్సాహాన్ని పెంపొదిస్తుందని అంటారు. అలాగే ఇది మత సామరస్యానికి కూడా ఒక ప్రతీక గా చెపుతారు.
ఇబ్బందులేమిటి?
అయితే ఈ విన్యాసాల సందర్భంగా కొన్నిసార్లు దున్నపోతులు అదుపుతప్పటం, దానివల్ల దగ్తరలోని జనం గాయాల పాలవటం కొండొకచో వ్యక్తులు మరణించడం జరుగుతోంది. జంతువుల మూపుపై కెక్కి డాన్సులు కట్టడాన్ని కూడా జంతు ప్రేమికులు నిరసిస్తున్నారు. అయితే సదర్ పండుగ ‘‘ బుల్ ఫైట్’’ ‘‘జల్లికట్టు’’ లాగా జంతువులను కష్టపెట్టి ఆనందించే ఆట కాదని, శ్రధ్దతో వాటిని అలంకరించి గౌరవించి వాటి విన్యాసాలను, తాము అదుపు చేయగల సామర్ధాన్నీ చూపెట్టే ప్రక్రియ మాత్రమే నని సమాదానంగా అంటున్నారు.
Thanks a lot for the excellent information on Sadar festival.
రిప్లయితొలగించండి