కేవలం కడుపుమంటతోనో, ఆవేశంతోనే దూసుకొచ్చే మామూలు జనం తాలూకూ సెగలు కావచ్చు,
వారిలో కొంతమంది కావాలని చేరిన విద్వంసకారులున్న గుంపులు కూడా అయ్యి వుండవచ్చు.
ఏమాత్రం శిక్షణలేని పద్దతులు తెలియని గుంపులను ఎదుర్కొనేందుకు మన దళాలకు వున్న శిక్షణ ఎలాంటింది.
బషీర్ బాగ్ లాంటి, ముదిగొండలాంటి ఘటనలు జరిగినపుడు, ప్రభుత్వ దళాలు కూడా అనవసరమైన హడావిడికీ గందరగోళానికీ గుంపులతో సమానంగా దూకుడుగా వ్యవహరించి నష్టాలను కలిగించుకోవటం చూస్తున్న మనకి.
ఈ కొరియన్ సైనిక దళాలు, ఒక పద్దతి ప్రకారం శాస్త్రీయంగా గుంపుని ఎదుర్కోవటం చూస్తే,
తుఫానులూ, భూకంపాలూ, సునామీలే విపత్తులు కావు. ముట్టడులూ, ప్రజాస్వామికమనే పేరుతో నడిచే ఆవేశాలూ ఒకరకమైన విపత్తులే వీటి నిర్వహణకు మన దళాలకు ముందస్తుగా ఇటువంటి శిక్షణా ఏర్పాట్లు చేసుకోలేని దశలో వున్నామా మనం.
మాస్ ప్రొటస్ట్ కంట్రోల్ విషయంలో కొరియన్ దళాలు ఎలా వ్యవహరించాయో తెలుసుకోవాలనుకుంటే ఈ విడియో చూడండి.
బయటినుండి దళం మొత్తాన్నీ మైక్ లో ఒక కంఠం నిర్దేశించటం.
ఒక క్రమంలో వ్యూహాత్మకంగా ముందుకు రావటం.
గుంపు చేసే బలప్రయోగానికీ వారి దూకుడుకూ అనుగుణంగా ఎత్తుగడలను మార్చడం.
దుందుడుకుగా వచ్చేవారినీ, ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఇతర పదార్ధాలను లంఘించి గుంపుమధ్యలోకి చేర్చి పక్కకి చేర్చి గుంపును సైకలాజికల్ గా బలహీనపరచటం.
ఎంత గందరగోళం జరుగుతున్నా ఒక ఉక్కు గోడలా వారి క్రమశిక్షణతో నిర్మాణాన్ని చెక్కచెదరకుండా నిలుపుకోవడం.
జాగ్రత్తగా గమనిస్తే ఇటువంటి విషయాలు చాలా అబ్బురం అనిపిస్తాయి.
వారిలో కొంతమంది కావాలని చేరిన విద్వంసకారులున్న గుంపులు కూడా అయ్యి వుండవచ్చు.
ఏమాత్రం శిక్షణలేని పద్దతులు తెలియని గుంపులను ఎదుర్కొనేందుకు మన దళాలకు వున్న శిక్షణ ఎలాంటింది.
బషీర్ బాగ్ లాంటి, ముదిగొండలాంటి ఘటనలు జరిగినపుడు, ప్రభుత్వ దళాలు కూడా అనవసరమైన హడావిడికీ గందరగోళానికీ గుంపులతో సమానంగా దూకుడుగా వ్యవహరించి నష్టాలను కలిగించుకోవటం చూస్తున్న మనకి.
ఈ కొరియన్ సైనిక దళాలు, ఒక పద్దతి ప్రకారం శాస్త్రీయంగా గుంపుని ఎదుర్కోవటం చూస్తే,
తుఫానులూ, భూకంపాలూ, సునామీలే విపత్తులు కావు. ముట్టడులూ, ప్రజాస్వామికమనే పేరుతో నడిచే ఆవేశాలూ ఒకరకమైన విపత్తులే వీటి నిర్వహణకు మన దళాలకు ముందస్తుగా ఇటువంటి శిక్షణా ఏర్పాట్లు చేసుకోలేని దశలో వున్నామా మనం.
మాస్ ప్రొటస్ట్ కంట్రోల్ విషయంలో కొరియన్ దళాలు ఎలా వ్యవహరించాయో తెలుసుకోవాలనుకుంటే ఈ విడియో చూడండి.
బయటినుండి దళం మొత్తాన్నీ మైక్ లో ఒక కంఠం నిర్దేశించటం.
ఒక క్రమంలో వ్యూహాత్మకంగా ముందుకు రావటం.
గుంపు చేసే బలప్రయోగానికీ వారి దూకుడుకూ అనుగుణంగా ఎత్తుగడలను మార్చడం.
దుందుడుకుగా వచ్చేవారినీ, ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఇతర పదార్ధాలను లంఘించి గుంపుమధ్యలోకి చేర్చి పక్కకి చేర్చి గుంపును సైకలాజికల్ గా బలహీనపరచటం.
ఎంత గందరగోళం జరుగుతున్నా ఒక ఉక్కు గోడలా వారి క్రమశిక్షణతో నిర్మాణాన్ని చెక్కచెదరకుండా నిలుపుకోవడం.
జాగ్రత్తగా గమనిస్తే ఇటువంటి విషయాలు చాలా అబ్బురం అనిపిస్తాయి.
మహా భారతంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చే వ్యూహం ‘‘పద్మవ్యూహం’’ పద్మం ఆకారంలో సైనిక నిర్మాణం చేసి శత్రువులను బంధించటం. అభిమన్యుడు దానిలో చిక్కుకున్న కథ చదువుకున్నాం.
ఈ మధ్య కాలంలో మెలూహా మృత్యంజయులులో కూడా అమిష్ ఇటువంటి ప్రక్రియలనే వివరిస్తాడు. NCC,స్కౌటింగ్ లాంటి శిక్షణలలో చెప్పే విషయాలు నిజజీవితంలో సమస్యలను ఎదుర్కునే దళాలకు ఇవ్వరా? ఏమో నాకా ప్రొఫెషనల్ డీలింగ్ సంఘటన ఎక్కడా గమనించినట్లు ఎరుకలో లేదు.
విశిష్టమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహం అని, వ్యూహా శాస్త్రనిపుణులు వివరిస్తారు. సైన్యం తక్కువుగా ఉన్నప్పుడు ఎదుటి సైన్యం ఎక్కువుగా ఉన్నప్పుడు తమ తక్కువ సైన్యం ఎక్కువ సైన్యాన్ని గెలవడానికి వ్యూహం బాగా ఉపయుక్తమవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్న ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా విజయం తమకు దక్కేలా తగినట్లుగా వ్యూహాన్ని నిర్మించుకోవాలి.
మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహాం, గరుడ వ్యూహాం, మకర వ్యూహం, కూర్మవ్యూహం, శకట వ్యూహం, సూచి, శ్యేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్థ, శృంగాటక ఇలా అనేకానేక రకాల పేర్లతో కనిసిస్తున్నాయి. పశువులు, పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆ పశువులు కానీ, ఆపక్షులు కానీ తమ శత్రువులతో ఎలా పొట్లాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్ని అంతటినీ వ్యూహ రచయిత సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు
చక్రవ్యూహం లో అభిమన్యుడు ప్రవేసించే చిత్రం రాతిపై శిల్పరూపంలో. |
రోజువారీగా మహా భారత కథలో వర్ణించిన యుద్ధ విశేషాలు
వివిధ దినాలలో కురు పాండవ సేవలు పన్నిన వ్యూహాలిలా ఉన్నాయి.
యుద్ధం రోజు | పాండవ వ్యూహం | కౌరవ వ్యూహం | విశేషాలు |
---|---|---|---|
1 | వజ్ర వ్యూహం | సర్వతోముఖ వ్యూహం | కృష్ణుడు అర్జునునకు గీతోపదేశం చేశాడు. భీష్ముడు దావానలంలా విజృంభించాడు. అభిమన్యుడు, అర్జునుడు మాత్రమే అతనిని కాస్త నిలునరించ గలిగారు. ఆరోజు పాండవులు చింతా క్రాంతులయ్యారు. |
2 | క్రౌంచ వ్యూహం | త్రికూట వ్యూహం | అర్జునుడు భీష్ముని తీవ్రంగా బాధించాడు. భీముడు విజృంభించి కళింగ సేనను కల్లోల పరచాడు. అభిమన్యుని ధాటికి తట్టుకోవడం భీష్మ ద్రోణులకు కూడా సాధ్యం కాలేదు. |
3 | అర్ధచంద్ర వ్యూహం | గరుడ వ్యూహం | భీష్ముని దాడితో క్రోధుడైన అర్జునుడు చెలరేగి కౌరవ సేనను దావానలంలా దహించాడు. |
4 | ? | ? | అభిమన్యుడు, భీముడు విజృంభించారు. తొమ్మండుగురు కౌరవ సోదరులు భీముని చేత హతులయ్యారు. ఘటోత్కచుని మాయాయుద్ధంతో కౌరవసేన కకావికలయ్యింది. |
5 | శ్యేన వ్యూహం | మకర వ్యూహం | పాండవుల పక్షంలో భీముడు, అభిమన్యుడు, అర్జునుడు చెలరేగిపోయారు. కౌరవుల పక్షంలో భీష్ముడు, భూరిశ్రవుడు విజృంభించారు. విజయం ఎటూ కాకుండా పోయింది. భూరిశ్రవుని చేత సాత్యకి కొడుకులు పదిమంది మరణించారు. అర్జునుడు పాతికవేల రధికులను నిర్జించాడు. |
6 | మకర వ్యూహం | క్రౌంచ వ్యూహం | భీముడు, పాండవుల కొడుకులు ఐదుగురూ కౌరవులను ముప్పుతిప్పలు పెట్టించారు. ద్రుపదుడు, ద్రోణుడు తలపడ్డారు. నకులుడి కొడుకు శతానీకుడు అద్భుతంగా యుద్ధం చేశాడు. |
7 | వజ్ర వ్యూహం | మండల వ్యూహం | కౌరవులలో భీష్ముడు, పాండవులలో భీమార్జునులు అద్భుతంగా యుద్ధం చేశారు. భగదత్తుడు ఘటోత్కచుని తరిమేశాడు. సాత్యకి అలంబసుడిని తరిమేశాడు. ధర్మరాజు ధాటికి శ్రుతాయువు పారిపోయాడు. సుశర్మ అర్జునుడిని ఢీకొన్నాడు. |
8 | శృంగాటక వ్యూహం | కూర్మ వ్యూహం | భీముడి చేత 12 మంది కౌరవ సోదరులు మరణించారు. ఘటోత్కచుని తమ్ముడు ఇరావంతుడు అలంబసునిచేత మరణించాడు. అర్జునుని తీవ్రత కొనసాగింది. |
9 | ? | సర్వతోభద్ర వ్యూహం | భీష్ముని ప్రతాపాన్ని తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అర్జునుడు తేజోహీనుడయ్యాడు. ఇక లాభం లేదని కృష్ణుడే స్వయంగా చక్రధారియై భీష్మునిపైకి లంఘించాడు. అర్జునుడు బ్రతిమాలగా కృష్ణుడు వెనక్కి తగ్గాడు. భీష్ముని చంపడం సాధ్యం కాదనుకొన్న పాండవులు ఆ రాత్రి భీష్ముని ప్రార్ధించారు. పాండవులు శిఖండిని అడ్డుపెట్టుకొని యుద్ధం చేస్తే తనకు యుద్ధోత్సాహం నశిస్తుందని భీష్ముడు సలహా ఇచ్చాడు |
10 | ? | ? | భీష్ముడు, అర్జునుడు, శిఖండి, ధర్మరాజు విజృంభించారు. శిఖండి ఎదురుపడినప్పుడల్లా భీష్ముడు వేరేవైపు వెళ్ళసాగాడు. ధర్మరాజు పరాక్రమానికి ద్రోణుడు నిలువలేకపోయాడు. అర్జునుడి శరపరంపరకు భీష్ముడు కూలిపోయాడు. అంపశయ్యపై విశ్రమించాడు. |
11 | క్రౌంచ వ్యూహం | శకట వ్యూహం | కౌరవ సేనాపతిగా ద్రోణుడున్నాడు. కర్ణుడు మొదటిసారి యుద్ధరంగంలో ప్రవేశించాడు. ద్రోణుడు ధర్మరాజును పట్టుకోబోయే సమయంలో అర్జునుడు అడ్డం పడ్డాడు. మరుసటిరోజు అర్జునుని రణరంగంనుండి దూరంగా తీసుకెళ్ళాలని త్రిగర్త దేశాధీశుడు సుశర్మతో కలిసి పన్నాగం పన్నారు. |
12 | మండలార్ధ వ్యూహం | గరుడ వ్యూహం | సంశప్తకులను ఓడించి కృష్ణార్జునులు యుద్ధంలోకి తిరిగి వచ్చారు. భగదత్తుని వైష్ణవాస్త్రం కృష్ణునివల్ల వ్యర్ధమయింది. అర్జునుడు భగదత్తుని వధించాడు. కర్ణార్జునులు తొలి ద్వంద్వయుద్ధం చేశారు. మరునాడు అర్జునుని ఇంకా దూరంగా తీసుకెళ్ళాలని, తిరిగి రానీయమని సంశప్తకులు మాట యిచ్చారు. |
13 | (సాధారణ వ్యూహం) | పద్మ (చక్ర) వ్యూహం (తమ్మి మొగ్గరము) | ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు. పద్మ వ్యూహాన్ని ఛేదించి అభిమన్యుడు కాలాగ్నిలా చెలరేగిపోయాడు. కర్ణుడు పారిపోయాడు. తక్కిన పాండవులను జయద్రధుడు వ్యూహ ద్వారంలో ఆపేశాడు. ఒంటరియైన అభిమన్యుడు ఏడుమార్లు తనను చుట్టుముట్టినవారిని మట్టి కరిపించారు. ఎనిమిదవ సారి అభిమన్యుని అన్నివైపులనుండి చుట్టుముట్టి వెనుకనుండి నిల్లు విరిచి అతనిని చంపేశారు. మరునాడు సూర్యాస్తమయంలోపు సైంధవుని చంపుతానని అర్జునుడు ప్రతిన పూనాడు. |
14 | ? | శకటవ్యూహం + పద్మవ్యూహం + సూచీవ్యూహం | ద్రోణుని వ్యూహ రచన సైంధవుని రక్షించడం కోసం చేయబడింది. అయినా అర్జునుడు అందరినీ జయించి తృటిలో వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాడు. శ్రుతాయుధుడు, కృతవర్మాదులు, విందానువిందులు అర్జునునిచేత మరణించారు. ఘటోత్కచుడు అలంబసుడిని, హలాయుధుడిని వధించాడు. దుర్మర్షణుడు, దుర్మధుడు, శత్రుంజయుడు వంటివారు భీమునిచేత చచ్చారు. సాత్యకి భూరిశ్రవుని చంపాడు. చివరకు అర్జునుడు సైంధవుని చంపి తన ప్రతిన నెరవేర్చుకొన్నాడు. రాత్రి పూట జరిగిన యుద్ధంలో ఘటోత్కచుడు పెట్రేగిపోయాడు. అర్జునుని చంపడానికి దాచుకొన్న శక్తిని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కచుని కడతేర్చాడు. |
15 | ద్రోణార్జునుల ద్వంద్వ యుద్ధంలో ఎవరూ ఓడలేదు. చివరకు "అశ్వత్థామ" (అనే ఏనుగు) మరణించినట్లు ప్రకటించగా ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. ధృష్ష్టద్యుమ్నుడు ద్రోణుని శిరసు తెగనరికాడు. దుఃఖ క్రోధాలతో రెచ్చిపోయిన అశ్వత్థామ పాండవులపై విరుచుకుపడ్డాడు. అశ్వత్థామ దివ్యాస్త్రాలు కృష్ణార్జునుల శక్తియుక్తులవలన వృధా అయ్యాయి. వేదవ్యాసుడు అర్జునునికి పరమేశ్వర మహిమను విశదీకరించాడు. | ||
16 | అర్ధచంద్ర వ్యూహం | మకర వ్యూహం | అశ్వత్థామ సూచనపై దుర్యోధనుడు కౌరవ సైన్యాధిపతిగా కర్ణుని నియమించాడు. భీముడు క్షేమధూర్తిని వధించాడు. ప్రతివింధ్యుడు చిత్రసేనుని చంపేశాడు. భీముడు అశ్వత్థామతోను, కర్ణుడు నకులునితోను, అర్జునుడు సుశర్మతోను ద్వంద్వ యుద్ధాలు చేశారు. ధర్మరాజు సుయోధనుని మూర్ఛిల్ల చేశాడు. అర్జునుడూ, కర్ణుడూ ఎదురి పక్షాలను గగ్గోలు పెట్టించారు. మరునాడు పాండవులను అంతం చేస్తానని కర్ణుడు దిగాలుగా ఉన్న దుర్యోధనునికి మాట యిచ్చాడు. |
17 | దుర్జయ వ్యూహం | ? | దుర్యోధనుని ప్రార్ధననంగీకరించి కర్ణునికి సారధ్యం చేయడానికి శల్యుడు అంగీకరించాడు. శల్యుడి పరుష వ్యంగ్య వచనాలకు కర్ణుడు నొచ్చుకొన్నాడు. కర్ణుడూ, కర్ణుని కొడుకులూ చెలరేగి పాండవ సైన్యాన్ని కాలరాచేశారు. కర్ణుడు ధర్మరాజుని పట్టుకొని పరుషంగా అవమానించి వదిలేశాడు. భీముడు దుశ్శాసనుని వధించి దారుణంగా రొమ్ము చీల్చి రక్తం త్రాగాడు. కర్ణార్జునుల ద్వంద్వయుద్ధం ప్రళయ సమానంగా సాగింది. కర్ణుని సర్పముఖాస్త్రం విఫలమయ్యింది. కర్ణుని రధం భూమిలో దిగబడినపుడు అర్జునుడు అంజలికం అనే దివ్యాస్త్రంతో అతని తల నరికేశాడు. ధర్మరాజు చాలా సంతోషించాడు. |
18 | త్రిశూల వ్యూహం | సర్వతోభద్ర వ్యూహం | దుర్యోధనుని కోరికతో కౌరవ సేనాధిపతిగా శల్యుడు ఉన్నాడు. భీమార్జునులు మిగిలిన కౌరవ సేనను తుడిచిపెట్టసాగారు. యుధిష్ఠిరుని చేత శల్యుడు హతుడయ్యాడు. సహదేవుడు గాంధారసైన్యాన్ని ఊచకోత కోసేశాడు. శకునిని చంపేశాడు. అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ పారిపోయారు. దుర్యోధనుడు పరిసరారణ్యాలకుపోయి ఒక జలాశయంలో దాగున్నాడు. ధర్మరాజు వచ్చి మాటాడిన పరుషవాక్యాలతో దుర్యోధనుడు భీమునితో గదాయుద్ధానికి సిద్ధుడయ్యాడు. భీముడు దుర్యోధనుని తొడలు విరుగగొట్టి అక్కడవదిలేసి వెళ్ళారు. తరువాత అర్జునుని కపికేతనం, దివ్యాస్త్రాలు అదృశ్యమయ్యాయి. రధం భస్మమైపోయింది. అశ్వత్థామ సుయోధనుని కలిసి అపాండవం చేస్తానని మాట యిచ్చాడు. (తరువాతి కథ "సౌప్తిక పర్వం"లో ఉంది.) |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి