ఇలా ఎవరిఫోటోని వాళ్ళే తీసుకుంటే దానిపేరు ‘‘ selfie ’’ అట
self-portrait అనేదానికి సంక్షిప్తరూపం.
ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో 2013 కు గానూ ఈ సంవత్సరపు పదం ( word of the year) గా ఎన్నికయ్యింది. ఈ పదాన్ని మొదటిగా ABC అనే ఒక ఫోరంలో సెప్టెంబర్ 2002 లో వాడారట. మత్తులో తన పెదవిని కొరుక్కున్నానని చూపించేదుకు దాన్ని ఫోటోగా తీసుకుని ఫోరంలో ఇలా పోస్టు చేసారట.....
"Um, drunk at a mates 21st, I tripped ofer [sic] and landed lip first (with front teeth coming a very close second) on a set of steps, I had a hole about 1cm long right through my bottom lip. And sorry about the focus, it was a selfie."
కొత్త పదాన్ని వాడిన ఆస్ట్రేలియన్ కి పెదవి తెగటమేమో కానీ దేశం ఈ పదాన్ని చూసుకుని మేము కనిపెట్టిందే అని మురిసిపోతోంది. కుట్లతో వున్న అతగాడి పెదవి ఫోటో కూడా అతని మొహంకంటే ప్రముఖంగా ప్రచారంలో హల్ చల్ చేస్తోందట.
అవునుకదా ఎవరూ కనిపెట్టకపోతే భాషెలా పుడుతుంది?
జంగమయ్యా వేసుకో రెండు వీరతాళ్ళు (ఇక్కడ పెదవిని కుట్టే తాళ్ళు, కొత్త పదాలను విప్పే తాళ్ళు కావచ్చు)
మరి దీన్ని తెలుగులో ఏమందాం?
స్వీచి (స్వీయ చిత్రణ) లాగా మరింత మంచి పేర్లుంటే సూచిస్తారేంటి?

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి