నేనంటే నీకిష్టమేనా
కళ్ళలోతుల్లోకి దూకుతూ అడిగుతావు.
లేనిదే నేనింత దగ్గరగా జరుగుతానా?
ప్రశ్ననే సమాధానంగా మలచి కాలప్రవాహంలో సుతారంగా వదిలేస్తాను.
అదికాదు నేను నిజంగా నీకు మొత్తంగా నచ్చానా? ఎప్పుడూ నచ్చుతానా?
నాకు ఈతరాదనే నిజాన్నిగుర్తుచేస్తూ ప్రవాహం సుడులు తిరుగుతూ ముంచి తేల్చుతోంది.
నచ్చటమంటే నాకు నిజంగా తెలుసా?
కాంక్షా? వ్యామోహమా? కోరికా? దాహమా?
అలాగయితే నాకు నేను నచ్చానా?
ఇకదాటేయడానికేమీ లేదు.
ఖడ్గచాలనం జరిగాక
స్థబ్దుగా వుంటానంటే కుదరదు.
ప్రశ్నల ఆవిరి వేడికి
రెండు తడికాగితాలు
వదులై దూరాన్ని చేర్చుకుని
ఎదురుబొదురుగా కూర్చున్నాయి.
మనసుకూడా రెపరెపలాడుతోంది
వాలేచోటేదో తెలిసీతెలీనట్లు
వేమనకైనా ఏం తెలిసింది
మోక్షగామిగా పయనం ప్రారంభించినపుడు
అందుకే రంగులేసే పనేంలేకుండా
తెరిచిన నీ దోసిలి నిండా హృదయాన్ని పిండి చూపిస్తాను.
లోహం పాతబడినప్పుడల్లా పాతచింతతో రుద్దినట్లు
చింత చుట్టినప్పుడన్నా భాధ్యత మరింతగా మెరుస్తుంది.
https://www.facebook.com/groups/kavisangamam/permalink/664992973553458/

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి