వరాలిచ్చే చెట్టు! --క్రిస్మస్ నాడు చెట్లను అందంగా అలంకరిస్తారు కదా, మరి ఆ అలవాటు ఎలా మొదలైందో తెలుసా? దాని వెనుక కొన్ని కథలు కూడా ఉన్నాయి.
చాలా ఏళ్ల క్రితం క్రీస్తు పుట్టిన రోజున చర్చికి వెళ్లి రకరకాల బహుమతులను క్రీస్తుకు ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లాడికి పాపం... ఏమివ్వాలో తెలియలేదు. ఏది కొనాలన్నా చేతిలో సెంటు కూడా లేదు. ఏం చేయాలో తోచని ప్లాబోకి తన ఇంటి ముందు ఓ అందమైన మొక్క కనిపించింది. దానిని తీసి చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకెళ్లాడు. అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన అందరూ ప్లాబో కానుక చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూ దానిని బాల ఏసు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యం...! వెంటనే ఆ చిన్న మొక్క అప్పటికప్పుడే ఎదిగిపోయి బంగారు వృక్షంగా మారిపోయింది. పవిత్ర హృదయంతో తీసుకొచ్చిన ఆ కానుకనే జీసెస్ స్వీకరించాడని అందరూ నమ్మారు. అప్పటి నుంచి క్రిస్మస్ చెట్టుని అలంకరిస్తున్నారు.
ఇలాంటిదే మరో కథ కూడా ఉంది.
చలిగాలులు వీస్తున్నాయి. మంచు కురుస్తోంది. చిన్న పాకలో అన్న వాలంటైన్, చెల్లి మేరీ నాన్న కోసం ఎదురుచూస్తున్నారు. ఏదైనా తిని రెండు రోజులైంది. నీర్సంగా ఉన్నారు. ఇంతలో నాన్న వచ్చాడు. చేతిలో రొట్టెముక్క! దాన్నే మూడు భాగాలు చేసుకుని ప్రార్థన చేయసాగారు. 'ఓ జీసస్ మాలాగే ఈ లోకంలో ఆకలితో ఉన్న వాళ్లందరీ కడుపు నింపు'. ప్రార్థన తర్వాత తినబోతుండగా తలుపు చప్పుడైంది. తీసి చూస్తే ఆరేళ్ల పిల్లాడొకడు చలికి వణికిపోతూ 'ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తారా?' అని అడిగాడు. లోపలికి రమ్మన్నారు. 'తిని నాలుగు రోజులైంది' అన్నాడా పిల్లాడు దీనంగా. తమ రొట్టె ఇచ్చి, రగ్గు కప్పి పడుకోబెట్టారు. అతడి ఆకలిని తీర్చగలిగామన్న తృప్తితో వాళ్లు నిద్రపోయారు. అర్థరాత్రి అన్నాచెల్లెల్లిద్దరికీ మెలకువ వచ్చింది. పైన మిలమిలలాడే నక్షత్రాలు. ఎగురుతున్న దేవదూతలు. వాళ్లింటికి వచ్చిన పిల్లాడు ఎవరో కాదు. బాల ఏసు! తల మీద బంగారు కిరీటంతో విలువైన బట్టలతో మెరిసిపోతున్న అతడు, 'మీ దయ గొప్పది. పరలోకపు తండ్రి మీకు మేలు చేస్తాడు' అని దీవించాడు. వాళ్లింటి బయట ఎండిన కొమ్మని నాటాడు. అది చూస్తుండగానే చిగురించి పెరిగి పెద్దదైంది. దాన్నిండా బంగారు యాపిల్ కాయలు! అదే మొట్టమొదటి క్రిస్‌మస్ చెట్టు.
వాడుకలోని మూడో కథ
* ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిస్మస్ చెట్టు ఎక్కడుందో తెలుసా? అబుదాబిలో ఓ హోటల్లో. 40 అడుగుల ఎత్తున నిర్మించిన దీని విలువ కోటి పది లక్షల డాలర్లు. ఈ చెట్టుని 181 వజ్రాలు, ముత్యాలు, విలువైన రాళ్లతో అలంకరించారు.
* క్రిస్మస్ చెట్టును మొదటిసారిగా అలంకరించింది 1510లో. ఇళ్లల్లోకి తీసుకువచ్చి చెట్టును పెట్టే సంప్రదాయం వచ్చింది 16వ శతాబ్దంలో.
* అమెరికాలో ఏటా మూడు కోట్ల క్రిస్మస్ చెట్లు అమ్ముడవుతాయి. పది లక్షల ఎకరాల్లో వీటిని పెంచుతారు.
బహుమతుల తాతయ్య!
చారిత్రకంగా తాతయ్య ను చాలా మార్పులకు లోను చేశారు |
ఎర్రటి గౌను, టోపీ, తెల్లగడ్డంతో బహుమతులిచ్చే శాంతాక్లాజ్ తాతయ్య అసలు పేరు తెలుసా? నికోలస్. ఐదవ శతాబ్దానికి చెందిన ఆయన డచ్ దేశస్తుడు. ఊరిలో అందరికీ సహాయంగా ఉండే నికోలస్ సేవా గుణం చూసిన తల్లిదండ్రులు అతడిని ఆ ఊరి చర్చిలో చేరుస్తారు. మంచిచెడు తెలుసుకుంటూ .. నలుగురికి సహాయంగా ఉంటాడని వారు భావిస్తారు. వారి సూచనల మేరకు నికోలస్ ఊరివారందరికీ ఎంతో ఆప్తుడుగా మారుతాడు. ఎవ్వరికీ ఏ అవసరం వచ్చినా.. నికోలస్ వారికి సహయపడేవాడు. అంతే కాదు ఆయనకు పిల్లలంటే చాలా ప్రేమ. పేదరికంలో ఉన్న చిన్నారులకు ఆయనకు తోచిన బహుమతులు ఇచ్చేవాడు. ఆ ఊరిలో చాలా పేదవారైన ఒక కుటుంబం ఉండేది. ఆ ఇంటి లో ఉండే పిల్లలకు సరైన బట్టలుకూడా ఉండేవి కావు. చలికాలం... విపరీతమైన చలిని తట్టుకోవడానికి ఆ చిన్నారులు కాళ్లకు సాక్స్ వేసుకునేవారు. అయితే ఒకే జత ఉండటంతో వాటిని ఉతికి త్వరగా ఆరడానికి పొయ్యి పైన వేలాడతీసే వారు. ఆ కుటుంబానికి ఎలాగైన సహాయం చేయాలని నికోలస్ భావిస్తాడు. కాని ఆ కుటుంబం ఎవ్వరి నుంచి ఎలాంటి సహాయం అందుకోవడానికి, కనీసం బహుమతులు తీసుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. క్రిస్‌మస్ పండుగ వచ్చింది. ఊరంతా సంబరాలు.. కాని ఆ కుటుంబంలో ఎలాంటి ఆనందం లేదు. ఇది గమనించిన నికోలస్ ఆ ఇంటి పై పెంకులు తొలగించి ఇంటిలోపలికి బంగారు నాణాలున్న చిన్నచిన్న మూటలను వేస్తాడు. అవి సరిగ్గా చిన్నారులు వేలాడతీసిన సాక్స్‌లలో పడతాయి. ఉదయం వాటిని చూసిన చిన్నారులు దేవుడే తమ
కు బహుమతులు ఇచ్చాడని సంబర పడతారు. ఆ ఊరిలో అందరూ వారిని అదృష్టవంతులుగా భావిస్తారు. ఆ కుటుంబం కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ రోజు నుంచి చిన్నారులందరూ తమకు దేవుడు బహుమతులు పంపిస్తాడని ఎదురుచూస్తారు. వారిని నిరుత్సాహపరచడం ఇష్టం లేని నికోలస్ ప్రతి క్రిస్‌మస్ పండుగకు రాత్రి వేళ ఇంటింటికి తిరిగి చిన్నచిన్న బహుమతులను ఇంటిలో వేస్తూ.. తనను ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఎర్రకోటు.. పొడవైన ఎర్ర టోపి ధరించి, తెల్లగడ్డం, కళ్లజోడు పెట్టుకుని మారువేషంలో ఊరంతా తిరిగేవాడు. ఇలా బహుమతులు పంచుతూ...చిన్నారులందరికీ ఆనందానిచ్చేవాడు. క్రిస్‌మస్ సందర్భంగా ఇలా చేయడంతో ప్రతి క్రిస్‌మస్‌కు చిన్నారులంతా బహుమతులు కోసం ఎదురుచూసేవారు. ఇలా నికోలస్ పొడవైన టోపి ధరించడంతో ఆయన పేరు శాంతాక్లాజ్ గా మారింది.
................
మరో కథ
క్రీస్తుశకం 270 కాలంలో ఇప్పటి టర్కీ ప్రాంతంలోని ఓ చర్చిలో బిషప్. గుర్రం మీద తిరుగుతూ పేదవారికి సాయం చేస్తుండేవాడు. ఓ రోజు ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చేయలేక బాధపడతున్న పేదవాడు కనిపించాడు. అతడికి సాయం చేయడానికి బంగారు నాణాలు నింపిన మూడు మూటల్ని వాళ్లింటి పొగగొట్టంలోంచి పడేశాడు. ఆ డబ్బుతో పేదవాడు ఎంతో సంబరంగా కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. అలా ఎంతమందికో తనెవరో తెలియకుండా బహుమతులు ఇచ్చే అతడికే సెయింట్ హోదా లభించింది. అతడే శాంతాక్లాజ్!
చరిత్రకందిన మరో కథ:
హాడన్ సాంద్ బ్లోమ్ ( Haddon Hubbard Sundblom ) ఒక ఆర్టిస్టు , (June 22, 1899 – March 10, 1976) గ్రాఫిక్ డిజైనర్ మూర్ రచించిన ……! క్లెమెంట్ క్లార్క్ మూర్ ( (Clement Clarke Moore ) 1822 లో రాసిన Poem “ఎ విజిట్ ఫ్రమ్ సైంట్ నికొలస్”
ప్రఖ్యాత పద్యం సన్ బ్లోమ్ భావనలకు స్ఫూర్తి గా అయ్యింది.

“A Visit From St. Nicholas”
'Twas the night before Christmas, when all thro' the house
Not a creature was stirring, not even a mouse;
The stockings were hung by the chimney with care,
In hopes that St. Nicholas soon would be there;
The children were nestled all snug in their beds,
While visions of sugar plums danc'd in their heads,
And Mama in her 'kerchief, and I in my cap,
Had just settled our brains for a long winter's nap —
When out on the lawn there arose such a clatter,
I sprang from the bed to see what was the matter.
Away to the window I flew like a flash,
Tore open the shutters, and threw up the sash.
The moon on the breast of the new fallen snow,
Gave the luster of mid-day to objects below;
When, what to my wondering eyes should appear,
But a miniature sleigh, and eight tiny reindeer,
With a little old driver, so lively and quick,
I knew in a moment it must be St. Nick.
More rapid than eagles his coursers they came,
And he whistled, and shouted, and call'd them by name:
"Now! Dasher, now! Dancer, now! Prancer and Vixen,
"On! Comet, on! Cupid, on! Donder and Blitzen;
"To the top of the porch! To the top of the wall!
"Now dash away! Dash away! Dash away all!"
As dry leaves that before the wild hurricane fly,
When they meet with an obstacle, mount to the sky;
So up to the house-top the coursers they flew,
With the sleigh full of toys — and St. Nicholas too:
And then in a twinkling, I heard on the roof
The prancing and pawing of each little hoof.
As I drew in my head, and was turning around,
Down the chimney St. Nicholas came with a bound:
He was dress'd all in fur, from his head to his foot,
And his clothes were all tarnish'd with ashes and soot;
A bundle of toys was flung on his back,
And he look'd like a peddler just opening his pack:
His eyes — how they twinkled! His dimples: how merry,
His cheeks were like roses, his nose like a cherry;
His droll little mouth was drawn up like a bow,
And the beard of his chin was as white as the snow;
The stump of a pipe he held tight in his teeth,
And the smoke it encircled his head like a wreath.
He had a broad face, and a little round belly
That shook when he laugh'd, like a bowl full of jelly:
He was chubby and plump, a right jolly old elf,
And I laugh'd when I saw him in spite of myself;
A wink of his eye and a twist of his head
Soon gave me to know I had nothing to dread.
He spoke not a word, but went straight to his work,
And fill'd all the stockings; then turn'd with a jerk,
And laying his finger aside of his nose
And giving a nod, up the chimney he rose.
He sprung to his sleigh, to his team gave a whistle,
And away they all flew, like the down of a thistle:
But I heard him exclaim, ere he drove out of sight —
Happy Christmas to all, and to all a good night.
—Clement Clarke Moore
“ఇట్ వాస్ ది నైట్ బిఫోర్ క్రిస్ట్మస్” (“Twas the Night Before Christmas”) అనే శీర్షికతో పాప్యులర్ ఐనది.
సైంట్ నికొలస్ పేరు కాల క్రమేణా “శాంతాక్లాజ్” గా అవతరించాడు.
ఈ పరిణామం కేవలము “పేరు“నకు మాత్రమే కాదు, వేషమునకు సైతము వర్తించినది.
“కోకో కోలా కంపెనీ” కోరిక మీద హాడన్ సాంద్ సన్ బ్లోమ్ కొత్త బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు.
శాంతాక్లాజ్ క్రిస్టమస్ 1931 ల నుండి “Santa Clause painting” వేసే ప్రయత్నాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహించాడు
సన్ బ్లోమ్ రూపొందించిన “శాంతాక్లాజ్ చిత్రము” సరి కొత్త దుస్తులతో “శాంతాక్లాజ్” ను ఆవిష్కరించినది. అంతకు పూర్వము ఆకుపచ్చ మున్నగు రంగులతో శాంతాక్లాజ్ దుస్తులు ఉండేవి. సన్ బ్లోమ్ చిత్రణలోని “శాంతాక్లాజ్ ఆహార్య, వేషధారణలు” క్రమంగా కొత్త మైలు రాయిని నెలకొల్పిందని చెప్పక తప్పదు. ఎర్రని కోటు, ఉన్ని టోపీ, బూట్లు – ఇంత మేలిమి డ్రస్సులతో ధగ ధగా మెరుస్తూన్నాడు నేటి శాంతాక్లాజ్.
మనం అనేక సినిమాల దార్వా చూసినట్లు శాంట ఉత్తర ధ్రువంలో తయారయ్యే క్రిస్మస్ ప్రెజెంట్స్ పెయింటింగ్స్ మరియు ప్యాక్స్ తయారచేస్తారని నమ్ముతారు. నిజంగా చెప్పాలంటే, 1890 లూయిస్ మో అనే రచయిత బుక్క్ ద్వారా శాంట మరియు దూతలు గిప్ట్ లు తయారుచేయడానికి పనిచేస్తారని రచన ఒకటి ఉంటుంది. ఈ పుస్తకం పేరు‘జులెమన్డెన్స్ బొగ్’.
శాంటా క్లాజ్ నిజంగా క్రిస్మస్ తో సంబంధం ఉందా ప్రతి సంవత్సరం క్రిస్మస్ కు, చిన్న పిల్లలు శాంటా కోసం వేచిచూసి, అతని నుండి బహుమతలు అందుకుంటారు. అయితే, క్రిస్మస్ జీసెస్ పుట్టిన రోజు సందర్భంగా వేడుక చేసుకుంటారు. ఇక్కడ క్రిస్మస్ కు మరియు శాంటాకు పొంతన లేదు . అలాగే శాంటా నిజమా అన్నది ఇప్పటి తెలియదు. ముందుగా చెప్పినట్లు సెయింట్ నికోలస్ కు సన్నిహిత పోలిక ఉన్నట్లు నమ్ముతారు. అలాగే, యేసు క్రీస్తు యొక్క జననం మరియు ఒక బిషప్ వంటి సెయింట్ నికోలస్ యొక్క జీవితం మధ్య సమయం చాలా విస్తారమైనది.
వివిధ ప్రాంతాలలో బహుమతుల తాతయ్యకున్న ఇతర పేర్లు.
1) గఘంట్ బాబా:- ఆర్మేనియా
2) బాబా చఘలూ:- ఆఫ్ఘని స్థాన్
3) పాపై నోయెల్:- ఈజిప్ట్: ఫ్రాన్స్: స్పెయిన్
4) పీర్ నోయెల్: ఫ్రెంచ్ :- బెల్జియం
5) జౌలుపుక్కీ:- ఫిన్ లాండ్, కెనడా
6) Weihnachtsmann (“క్రిస్ట్ మస్ మ్యాన్”) నికొలస్:- జర్మనీ:
7) Dun Che Lao Ren (“క్రిస్ట్ మస్ ఓల్డ్ మ్యాన్”):- చైనా
8) కనక లోక :- హవాయ్ దీవులు (Hawaii Islands)
9) బాబో నోయెల్:- (ఇరాన్)
10) నోయెల్ బాబా:- టర్కీ
11) పాపా నోయెల్ :- ఫ్రాన్స్ & స్పెయిన్
12) ఫాదర్ క్రిస్ట్ మస్ నోయెల్ :- యునైటెడ్ కింగ్ డమ్
13) ఫాపా నోయిల్:- లాటిన్ అమెరికా:
14) బబ్బూ నటాలీ :- ఇటలీ
గుండ్రిని ఆకారంతో ఎప్పుడూ జాలీగా వుంటాడు. చిమ్నీలగుండా జారుకుంటూ వస్తాడు లాంటి విశేషణాలను అదనంగా తాతగారి పౌరాణిక కథలకు అదనంగా జతచేస్తూనే వస్తున్నారు.
ఆంగ్లంలో మరింత వివరంగా వికీ లో చదవొచ్చు ఇక్కడ చూడండి

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి