తెలుగులో తొలి యాత్రా సాహిత్యం



కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. 
తెలుగులో యాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే మొదటిదని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.

► అప్పటికి (1831-1832) బ్రిటిషు వారు ఇంకా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోలేదు. కాబట్టి కొంత భాగం సంస్థానాలలో రాజు ల క్రింద ఉండేది.

► ఆనాటి వాడుకభాషలో సమకాలీన జీవిత దౌర్భాగ్యాలను, తన పోషకుల వంచనాశిల్పాన్ని, తన బలహీనతలనూ నిర్వికారంగా వ్రాయగలిగాడు.

► అప్పటి సంస్థానాలలో, ఇంగ్లీషు రాజ్యభాగాలలో, పౌరోహిత్యంలో ఎన్ని విధాల మోసం, లంచగొండితనం, అవినీతి ఉన్నాయో దాపరికం లేకుండా వ్రాశాడు.

► విలియం బెంటింగ్ రాజప్రతినిధులు ఎన్ని విధాల, ఎన్ని కుమార్గాలలో స్వదేశీ సంస్థానాలను క్రమంగా ఆక్రమించుకొంటున్నారో, దేశంలో జమిందారుల, దోపిడీ దొంగల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురౌతున్నారో మొహమాటం లేకుండా వ్రాశాడు.

► కొన్ని ప్రదేశాలలో కుల, మత, ప్రాంత భేదాలు ఎన్ని అనర్ధాలు తెచ్చిపెడుతున్నాయో, భిన్న ప్రాంతాలలో ఆర్ధిక పరిస్థితులెలా ఉన్నాయో చిత్రీకరించాడు.

► పుప్పాడ లోని బెస్తలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా అప్పులపాలైనారో వివరించాడు.




పుస్తకాన్ని ఉచితంగా ఇక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు

కామెంట్‌లు