తొలిచూపు ప్రేమలా ఎక్కడో తళుక్కుమంటుంది
తొలిచూలు భయంలా ఎక్కడో కలుక్కుమంటుంది.
తొలకరి చినుకులా చల్లగా చిలకరిస్తుంది.
తడిమట్టి వాసనలా గదంతా అలముకుంటుంది.
బావం భాషను తొడుక్కునేందుకు
వాక్యాల నూలుకండెలు పడుగు,పేకలై పరిగెడతాయి.
పదాల అద్దకం కుదరక గజబిజిపెడతాయి.
రాసిన కవితా అర్ధాంగిలా మంచో చెడో ఓ పేరు తేవచ్చు కానీ
రాయని కవిత ప్రియురాలై పట్టింపులేకుంటే పోతానంటుంది.
వేరెవర్ యు గో ఐ ఫోలో అంటూ
ప్రతిపనిలోనూ కుక్కపిల్లలా చోరబడుతూ
దీని ధ్యాసలో పడ్డ ప్రతిసారీ
మాస్టర్జీ ఈ పనిని జానెడు కట్జెయ్ మంటుంది.
శిలకఠినంగా వున్నకొద్దీ చెక్కే శ్రమ పెరుగుతుంది.
కానీ నిలకడతో తన ఉనికికి శాశ్వతత్వం ఇనుమడిస్తుంది.
దేవకన్యలా ప్రత్యక్షమై
మనసుకి శ్రమమరిపిస్తుంది.
సృష్టించే ఆతృత పెంచి
తన కళ్ళతో లోకాన్ని భళ్ళున తెరుస్తుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి